MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • Gadgets
  • Samsung Galaxy Glasses: ఫోన్ ముట్టుకోకుండానే ఫోటోలు, వీడియోలు.. లీకైన శాంసంగ్ క్రేజీ గ్లాసెస్ ఫీచర్లు !

Samsung Galaxy Glasses: ఫోన్ ముట్టుకోకుండానే ఫోటోలు, వీడియోలు.. లీకైన శాంసంగ్ క్రేజీ గ్లాసెస్ ఫీచర్లు !

Samsung Galaxy Glasses: శాంసంగ్ గెలాక్సీ గ్లాసెస్ ఫీచర్లు లీక్ అయ్యాయి. 12MP కెమెరా, జెమినీ ఏఐ, నోటిఫికేషన్స్ రీడర్ వంటి అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న సరికొత్త శాంసంగ్ స్మార్ట్ గ్లాసెస్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 03 2026, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ గ్లాసెస్ లీక్.. మెటాకు గట్టి పోటీ
Image Credit : Gemini

అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ గ్లాసెస్ లీక్.. మెటాకు గట్టి పోటీ

టెక్ ప్రపంచంలో వేరబుల్ గ్యాడ్జెట్స్‌కు క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి శాంసంగ్ తన సరికొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయింది. జూలై 22న లండన్‌లో జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ తన సరికొత్త గెలాక్సీ గ్లాసెస్ (Galaxy Glasses) లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ అధికారిక లాంచ్‌కంటే ముందే దీనికి సంబంధించిన కంపానియన్ యాప్ ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ లీక్ ద్వారా ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో ఉండబోయే పూర్తి ఫీచర్లు బయటకు వచ్చేశాయి. గూగుల్ జెమినీ ఏఐ, 12 మెగాపిక్సెల్ కెమెరా, నోటిఫికేషన్స్ గట్టిగా చదివి వినిపించే ఫీచర్ వంటి ఎన్నో క్రేజీ అప్‌డేట్స్‌తో ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
యాప్ లీక్‌తో బయటపడ్డ అసలు సీక్రెట్స్ ఇవే
Image Credit : X/TechKard

యాప్ లీక్‌తో బయటపడ్డ అసలు సీక్రెట్స్ ఇవే

శాంసంగ్ గెలాక్సీ గ్లాసెస్ మేనేజర్ యాప్‌ను లాంచ్‌కు ముందే ఇన్‌స్టాల్ చేసి చూసింది సామ్మీగురు (SammyGuru) అనే వెబ్‌సైట్. ఈ యాప్ హోమ్ స్క్రీన్ స్క్రీన్‌షాట్స్ ద్వారా గ్లాసెస్ ఎలా పనిచేస్తాయనేది క్లియర్‌గా తెలిసిపోయింది. ఈ యాప్ ద్వారా గ్లాసెస్ బ్యాటరీ పర్సంటేజ్ చూసుకోవచ్చు. అలాగే గ్లాసెస్‌తో తీసిన ఫోటోలను ఆటోమేటిక్‌గా ఫోన్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ చేసుకోవడంతో పాటు మెయిన్ ఫీచర్లను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే టోగుల్స్ అన్నీ ఈ సింగిల్ యాప్‌లోనే ఇచ్చారు.

కొత్తగా గ్లాసెస్ కొన్నాక ముక్కు దగ్గర ఉండే ప్రొటెక్టివ్ ఫిల్మ్ తీసేసి, ఎడమ వైపు ఉండే పవర్ స్విచ్ ఆన్ చేసి, ఛార్జింగ్ కేస్‌లో పెట్టి ఫోన్‌కు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చని ఈ యాప్ ద్వారా తెలిసింది. వార్బీ పార్కర్, జెంటిల్ మాన్‌స్టర్ లాంటి ఫేమస్ బ్రాండ్స్‌తో కలిసి శాంసంగ్ ఈ గ్లాసెస్‌ను తయారు చేస్తోంది.

Related Articles

Related image1
SIP Investment: రూ. 21,250తో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. 8-4-3 సీక్రెట్ రూల్ తెలుసా?
Related image2
Amazon Prime Day Sale: కంటెంట్ క్రియేటర్స్ కు పండగే.. వ్లాగింగ్ కెమెరాలపై 54% వరకు భారీ డిస్కౌంట్స్ ! అమెజాన్ టాప్ 5 డీల్స్ ఇవే
36
ఫోటోలు తీస్తుంది.. నోటిఫికేషన్లు చదువుతుంది
Image Credit : Asianet News

ఫోటోలు తీస్తుంది.. నోటిఫికేషన్లు చదువుతుంది

ఈ గెలాక్సీ గ్లాసెస్‌లో నాలుగు హైలైట్ ఫీచర్లు ఉన్నట్లు లీకైన యాప్ ద్వారా స్పష్టమైంది. అందులో మొదటిది గూగుల్ జెమినీ పవర్డ్ ఏఐ అసిస్టెంట్. ఇక రెండోది మీ ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లను ఇది గట్టిగా చదివి వినిపిస్తుంది. అంటే ఫోన్ చేతిలోకి తీసుకోకుండానే ఎవరు మెసేజ్ చేశారో తెలుసుకోవచ్చు. 

మూడోది ఫైండ్ మై గ్లాసెస్ ఫీచర్, దీని ద్వారా గ్లాసెస్ ఎక్కడైనా మర్చిపోతే ఫోన్ ద్వారా వెతకొచ్చు. నాలుగోది అడ్వాన్స్‌డ్ ఫీచర్స్. ఇందులో 12MP కెమెరాను ఇచ్చారు. దీని ద్వారా ఫోన్ టచ్ చేయకుండానే నేరుగా గ్లాసెస్ నుంచే సూపర్ క్వాలిటీ ఫోటోలు, వీడియోలు షూట్ చేయొచ్చు.

46
గెలాక్సీ రింగ్‌తో గ్లాసెస్ కంట్రోల్
Image Credit : X/TechKard

గెలాక్సీ రింగ్‌తో గ్లాసెస్ కంట్రోల్

ఈ లీక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, శాంసంగ్ గెలాక్సీ రింగ్ ద్వారా ఈ గెలాక్సీ గ్లాసెస్‌ను కంట్రోల్ చేయొచ్చు. చేతి వేళ్లతో చేసే సైగల ద్వారా గ్లాసెస్‌ను ఆపరేట్ చేయడానికి వీలుగా యాప్‌లో కోడింగ్ లైన్స్ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. గెలాక్సీ రింగ్‌లో ఉన్న రిసీవర్ కాంపోనెంట్ ఈ గెలాక్సీ గ్లాసెస్ సిగ్నల్స్‌ను క్యాచ్ చేస్తుంది. గెలాక్సీ రింగ్ మాత్రమే కాదు, గెలాక్సీ వాచ్ ద్వారా కూడా ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను కంట్రోల్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కంట్రోలర్ యాప్‌ను శాంసంగ్ డెవలప్ చేస్తోంది.

56
ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ సపోర్ట్
Image Credit : AI Generated

ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ సపోర్ట్

ఈ గెలాక్సీ గ్లాసెస్ 'వన్ యూఐ ఎక్స్ఆర్' ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయి. గూగుల్, శాంసంగ్, క్వాల్‌కామ్ కంపెనీలు సంయుక్తంగా డెవలప్ చేసిన ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ఆధారంగానే ఈ వన్ యూఐ ఎక్స్ఆర్ రన్ అవుతుంది. దీనివల్ల ఈ గ్లాసెస్ గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటి అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్స్‌తో డీప్‌గా కనెక్ట్ అయిపోతాయి.

జెమినీ ఏఐ సాయంతో వాయిస్ నావిగేషన్, లైవ్ ట్రాన్స్‌లేషన్, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటివి హ్యాండ్స్-ఫ్రీగా చేసుకోవచ్చు. గ్లాసెస్ బరువు తక్కువగా ఉండేలా ప్రాసెసింగ్ అంతా కనెక్ట్ అయి ఉన్న స్మార్ట్‌ఫోన్ చూసుకుంటుంది. అలాగే వెలుతురుకు తగ్గట్టు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయ్యే ఫోటోక్రోమిక్ లెన్స్‌ను కూడా ఇందులో వాడుతున్నారు.

66
మెటా వర్సెస్ శాంసంగ్.. ప్రైస్ ఎంత ఉండొచ్చు?
Image Credit : Ray Ban website

మెటా వర్సెస్ శాంసంగ్.. ప్రైస్ ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతం స్మార్ట్ ఏఐ గ్లాసెస్ మార్కెట్‌లో మెటా రే బాన్ గ్లాసెస్ సుమారు రూ. 25,000 ధరతో టాప్‌లో ఉన్నాయి. వీటికి పోటీగా రాబోతున్న శాంసంగ్ గెలాక్సీ గ్లాసెస్ ధర సుమారు రూ. 31,000 నుండి రూ. 41,000 వరకు ఉండే అవకాశం ఉంది. మెటా కంటే ధర ఎక్కువే అయినా, ఇందులో జెమినీ ఏఐ ఇన్ బిల్ట్‌గా రావడం, ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్‌తో డీప్ ఇంటిగ్రేషన్ ఉండటం శాంసంగ్‌కు ప్లస్ పాయింట్.

ఈ రెండు గ్లాసెస్‌లోనూ డిస్‌ప్లే ఉండదు, నార్మల్ గ్లాసెస్ లాగే కనిపిస్తాయి. డిస్‌ప్లే ఉండే సరికొత్త వర్షన్‌ను 2027లో తేవాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. అదే 2027లో యాపిల్ కూడా తన ఏఐ గ్లాసెస్ తెచ్చే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. జూలై 22న జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ గ్లాసెస్‌తో పాటు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, జెడ్ ఫ్లిప్ 8, గెలాక్సీ వాచ్ 9 కూడా లాంచ్ కానున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image2
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
SIP Investment: రూ. 21,250తో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. 8-4-3 సీక్రెట్ రూల్ తెలుసా?
Recommended image2
Amazon Prime Day Sale: కంటెంట్ క్రియేటర్స్ కు పండగే.. వ్లాగింగ్ కెమెరాలపై 54% వరకు భారీ డిస్కౌంట్స్ ! అమెజాన్ టాప్ 5 డీల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved