- Home
- Sports
- Arshdeep Singh Fiancee: ఎవరీ సమ్రీన్ కౌర్? అర్ష్‌దీప్ సింగ్ మనసు దోచుకున్న బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
Arshdeep Singh Fiancee: ఎవరీ సమ్రీన్ కౌర్? అర్ష్‌దీప్ సింగ్ మనసు దోచుకున్న బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
Arshdeep Singh Fiancee: టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నటి సమ్రీన్ కౌర్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ వేడుక ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అర్ష్‌దీప్ కాబోయే భార్య సమ్రీన్ ఎవరో తెలుసా?

అటు ముంబై ఇండియన్స్‌లోకి ఎంట్రీ.. ఇటు ప్రియురాలితో నిశ్చితార్థం.. ఒకేరోజు అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తన ప్రియురాలు, నటి సమ్రీన్ కౌర్‌తో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. నవంబర్ 11న బుధవారం నాడు ఈ వేడుక జరిగింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం అర్ష్‌దీప్ అక్కడే ఉన్నారు. ఈ పర్యటనలోనే సమ్రీన్‌కు ఉంగరం తొడిగి, ఎంతో రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సమ్రీన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్
నిశ్చితార్థం ఉంగరంతో పాటు, అర్ష్‌దీప్ తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫొటోలను సమ్రీన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఒక అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. "జీవితం మాకు ఇవ్వగలిగిన వాటన్నింటిలో, మమ్మల్ని ఒకరికొకరు ఇచ్చిందనే విషయమే నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తోంది. జీవితాంతం కలిసి ఉండేందుకు.. 11.11.2026 (హాయ్ ఫియాన్సీ)" అని ఆమె రాసుకొచ్చారు.
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు మారిన కొన్ని గంటల్లోనే అర్ష్‌దీప్ ఈ శుభవార్త చెప్పడం విశేషం. హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్ ద్వారా అర్ష్‌దీప్ ముంబై జట్టులోకి వెళ్లారు. అయితే, వీరి పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదు.
అసలు ఎవరీ సమ్రీన్ కౌర్?
అర్ష్‌దీప్ సింగ్‌కు కాబోయే భార్య సమ్రీన్ కౌర్ ఒక నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. 1999 సెప్టెంబర్ 7న జమ్మూ కాశ్మీర్లో ఆమె జన్మించారు. పూణేలోని సింబయాసిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ నుంచి బీకామ్ (ఆనర్స్) పూర్తి చేశారు.
చదువు పూర్తయ్యాక మోడలింగ్, నటన వైపు అడుగులు వేశారు. 2018లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో జమ్మూ కాశ్మీర్ తరఫున పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఈ గుర్తింపు ఆమెకు ఎంటర్టైన్మెంట్ రంగంలో మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది.
సినిమాలు, మ్యూజిక్ వీడియోలతో గుర్తింపు
సమ్రీన్ కౌర్ హిందీ, పంజాబీ భాషల్లో పలు ప్రాజెక్టులు చేశారు. 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయం ఆధారంగా కబీర్ ఖాన్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ 83లో ఆమె ఒక చిన్న పాత్రలో కనిపించారు. అలాగే అర్జున్ రాంపాల్ నటించిన నెయిల్ పాలిష్ వెబ్ సిరీస్‌లో, సర్దార్ జీ 2, బావ్రీ వంటి పంజాబీ సినిమాల్లో నటించారు.
సినిమాల కంటే మ్యూజిక్ వీడియోల ద్వారా ఆమెకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాద్షా, గురు రంధవా, జుబిన్ నౌటియల్, జస్ మానక్, మణిందర్ బుట్టర్ వంటి స్టార్ సింగర్ల పాటల్లో ఆమె నటించారు. బావ్లా, తుఝే భూల్నా తో చాహా వంటి పాటలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.
ఐపీఎల్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు లవ్ జర్నీ
ఐపీఎల్ 2026 సమయంలో సమ్రీన్ కౌర్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లకు హాజరై అర్ష్‌దీప్‌ను ప్రోత్సహించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు మొదలయ్యాయి. ఆ తర్వాత ధర్మశాలలో వీరిద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక జులై 2026లో అర్ష్‌దీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమ్రీన్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసి, మై పర్సన్ అంటూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వికెట్ తీసిన తర్వాత అర్ష్‌దీప్ చేసిన స్పెషల్ డ్యాన్స్ సెలబ్రేషన్‌ను సమ్రీన్‌కు అంకితం ఇచ్చారు. ఇటీవల నవంబర్ ప్రారంభంలో తమ రిలేషన్‌షిప్‌పై వచ్చిన ఆన్లైన్ విమర్శలకు సమ్రీన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను 17 ఏళ్ల వయసు నుంచే కష్టపడి సొంత కాళ్లపై నిలబడ్డానని స్పష్టం చేయగా, అర్ష్‌దీప్ కూడా ఆమెకు అండగా నిలిచారు.













