- Home
- Entertainment
- Ram Prasad: అది నీకు చేతకాదులే, రాంప్రసాద్ ముఖం మీదే చెప్పేసిన అతడి తల్లి..దేబ్జానీ పేరెంట్స్ హంగామా
Ram Prasad: అది నీకు చేతకాదులే, రాంప్రసాద్ ముఖం మీదే చెప్పేసిన అతడి తల్లి..దేబ్జానీ పేరెంట్స్ హంగామా
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో గురువారం రోజు ఎవరెవరి కుటుంబ సభ్యులు అడుగుపెట్టారు ? ఎలాంటి సందడి చేశారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Bigg Boss Telugu 10
బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. హౌస్ లో 67వ రోజు రాంప్రసాద్, దేబ్జానీ, సుధీర్ ల కుటుంబ సభ్యులు సందడి చేశారు. ముందుగా రాంప్రసాద్ తల్లి, కుమార్తె ఉజ్వల హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
రాంప్రసాద్ తల్లి ఎంట్రీ
రాంప్రసాద్ తల్లి హౌస్ లోకి రాగానే నేరుగా కిచెన్ లోకి వెళ్లి కొడుక్కి ఇష్టమైన విధంగా టీ పెట్టుకుని వచ్చి ఇచ్చింది. తల్లీ కొడుకులు మాట్లాడుకుంటుండగా రాంప్రసాద్ కుమార్తె ఉజ్వల కూడా నాన్న అని పలకరిస్తూ వచ్చేసింది. రాంప్రసాద్ కి బయట ఎలాంటి సపోర్ట్ ఉందో అతడి తల్లి తెలియజేసింది. చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్ళు కూడా రాంప్రసాద్ ని బాగా ఆడమని చెప్పినట్లు అతడి తల్లి తెలిపారు.
వేరేవాళ్ళ తప్పుని కూడా నాపై వేసుకుంటాను
నాలో మైనస్ లు ఏం కనిపిస్తున్నాయి అని రాంప్రసాద్ అడగగా.. వేరే వాళ్ళ తప్పుని ఎత్తి చూపలేవు అని అతడి తల్లి సమాధానం ఇచ్చింది. అది నాకు చేతకాదు కదా.. వేరే వాళ్ళ తప్పుని కూడా నాపైనే వేసుకుంటాను కానీ వాళ్ళ తప్పుని ఎత్తి చూపలేను అని రాంప్రసాద్ అన్నారు. అవును అది మనకు చేతకాదులే అని రాంప్రసాద్ తల్లి పేర్కొంది.
సుధీర్ తల్లి ఎమోషనల్
ఆ తర్వాత హౌస్ లోకి దేబ్జానీ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు కంటెస్టెంట్స్ అందరితో ఆప్యాయంగా మాట్లాడారు. ముఖ్యంగా నరేష్ తో వారి సంభాషణ నవ్వులు పూయించింది. దేబ్జానీ తండ్రి నరేష్ ని అల్లుడు గారు అంటూ సరదాగా చమత్కరించారు. వీళ్ళ తర్వాత హౌస్ లోకి వచ్చిన సుధీర్ తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు కాలికి గాయంతో బాధపడుతుండంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అదేం కాదు తగ్గిపోతుంది అని ఇతర ఇంటి సభ్యులు ఆమెని ఓదార్చారు. తమ కొడుకు ఇంత దూరం వచ్చాడు అంటే చాలా గర్వంగా ఉంది. ఎక్కడికి వెళ్లినా సుధీర్ గురించి చెబుతుంటే గర్వంగా ఉంది అని ఆమె అన్నారు.











