MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • OTT Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న నాగదుర్గ సినిమా, ప్రైమ్‌ టాప్‌ 10లో తెలుగు మూవీస్‌ జోరు

OTT Movies: ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న నాగదుర్గ సినిమా, ప్రైమ్‌ టాప్‌ 10లో తెలుగు మూవీస్‌ జోరు

OTT Movies: ఓటీటీలు ఇప్పుడు థియేటర్‌కి ఆల్టర్‌ నేట్‌గా మారాయి. ఆడియెన్స్ ఓ మోస్తారు నుంచి చిన్న సినిమాలను ఓటీటీలోనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో దుమ్ములేపుతున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 05 2026, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రైమ్‌ వీడియోస్‌ లో టాప్‌ 10 మూవీస్‌
Image Credit : Asianet News

ప్రైమ్‌ వీడియోస్‌ లో టాప్‌ 10 మూవీస్‌

ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. చాలా సినిమాలో ఓటీటీలోనే హిట్‌ అవుతున్నాయి. థియేటర్లో వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం సినిమా వస్తుందని కూడా జనాలకు తెలియడం లేదు. అలాంటి చిత్రాలు ఓటీటీలోకి వచ్చి దుమ్మురేపుతున్నాయి. ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు స్టార్‌ ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ మూవీ కూడా ఉంది. ఆమె తమిళంలో నటించిన తొలి చిత్రం ఇప్పుడు ప్రైమ్‌ వీడియోస్‌లో ట్రెండ్‌ అవుతుంది. అంతేకాదు మొదటి స్థానంలో దూసుకుపోతుండటం విశేషం. మరి ప్రైమ్‌ వీడియోస్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న టాప్‌ 10 మూవీస్‌ ఏంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండియా వైడ్‌గా నెం 1 స్థానంలో నాగదుర్గ మూవీ
Image Credit : Asianet News

ఇండియా వైడ్‌గా నెం 1 స్థానంలో నాగదుర్గ మూవీ

ప్రైమ్‌ వీడియోస్‌లో ఇండియాలో టాప్‌ 10 మూవీస్‌లో మొదటి స్థానంలో నాగదుర్గ నటించిన `లవ్‌ ఓ లవ్‌` అనే తమిళ సినిమా ట్రెండ్‌ అవుతుంది. ఈ చిత్రం ద్వారానే ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఇందులో పవీస్‌ నారాయణన్‌ హీరోగా నటించగా, సెల్వరాఘవన్‌, వనితా విజయ్‌ కుమార్‌, కేఎస్‌ రవికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఇది రూపొందింది. జులై 10న ఈ చిత్రం విడుదలైంది, కాకపోతే థియేటర్లో ఆడలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది. ఇండియా వైడ్‌గా మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతుందంటే దీన్ని ఎంత మంది చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నాగదుర్గ క్రేజ్‌ దీనికి కారణం కావడం విశేషం.

35
రెండో స్థానంలో వరలక్ష్మి పోలీస్‌ కంప్లైంట్‌
Image Credit : Asianet News

రెండో స్థానంలో వరలక్ష్మి పోలీస్‌ కంప్లైంట్‌

రెండో స్థానంలో హాలీవుడ్‌ మూవీ `ది డెవిల్స్ మౌత్‌` మూవీ ఇండియాలో ట్రెండ్‌ కావడం విశేషం. మూడో స్థానంలో తెలుగు సినిమా ఉంది. అదే `పోలీస్ కంప్లైంట్‌`. వరలక్ష్మి శరత్‌ కుమార్‌, నవీన్‌ చంద్ర జంటగా నటించిన చిత్రమిది. చాలా రోజుల క్రితమే థియేటర్లోకి వచ్చింది. కానీ ఆడియెన్స్ దీన్ని పట్టించుకోలేదు. కాకపోతే సినిమా ఫర్వాలేదనే టాక్‌ వచ్చింది. అయితే చాలా గ్యాప్‌తో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఇండియా వైడ్‌గా మూడో స్థానంలో ట్రెండ్‌ కావడం విశేషం.

45
ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న నాగబంధం మూవీ
Image Credit : X/@nikstudiosindia

ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న నాగబంధం మూవీ

నాల్గో స్థానంలోనూ తెలుగు సినిమానే ఉంది. పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన `నాగబంధం` మూవీ ప్రైమ్‌ వీడియోస్‌లో ట్రెండ్‌ కావడం విశేషం. ఇందులో విరాట్‌ కర్ణ హీరోగా నటించగా, నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్‌, అనసూయ, మురళీ శర్మ, జగపతిబాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత అభిషేక్‌ నామా దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రమిది. విజువల్‌ పరంగా మెప్పించిన ఈ సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతుండటం విశేషం. వీటితోపాటు `మాస్టర్స్ ఆఫ్‌ ది యూనివర్స్` అనే హాలీవుడ్‌ చిత్రం ఐదో స్థానంలో ట్రెండ్‌ అవుతుంది.

55
సాయిపల్లవి మూవీ సైతం ట్రెండింగ్‌
Image Credit : instagram

సాయిపల్లవి మూవీ సైతం ట్రెండింగ్‌

ఆరో స్థానంలో సాయిపల్లవి నటించిన సినిమా ఉంది. ఆమె హిందీలో నటించిన `ఏక్‌ దిన్‌` సినిమా ఇండియా వైడ్‌గా ప్రైమ్‌ వీడియోస్‌లో ట్రెండ్‌ కావడం విశేషం. థియేటర్లో ఇది ఆడలేదు, కానీ ఓటీటీలో రచ్చ చేస్తోంది. ఏడో స్థానంలో మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ `అనోమీ` ఉంది. ఇందులో రెహ్మాన్‌, భవన ప్రధాన పాత్రలు పోషించారు.   ఫిబ్రవరిలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం అక్కడ ఫర్వాలేదనిపించింది. కాకపోతే ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతుంది. ఇక ఎనిమిదో స్థానంలో కన్నడ ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ `సెకండ్‌ కేస్‌ ఆఫ్‌ సీతారామ్‌` మూవీ ఉండగా, తొమ్మిదో స్థానంలో హాలీవుడ్‌ మూవీ `ఘోస్ట్ ట్రైన్‌`, పదో స్థానంలో `స్పైడర్‌ మ్యాన్‌ హోమ్ కమింగ్‌` చిత్రాలున్నాయి. మొత్తంగా రెండు తెలుగు సినిమాలు, ఒకటి తెలుగు అమ్మాయి నటించిన చిత్రం ప్రైమ్‌ వీడియోస్‌లో టాప్‌ 10 లో ట్రెండ్‌ కావడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
సాయి పల్లవి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Trisha Udhayanidhi: ఉదయనిధి స్టాలిన్‌ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన త్రిష.. అరెస్ట్ వేళ దుమారం రేపుతున్న వార్త, నిజం ఏంటంటే?
Recommended image2
Jason Sanjay: చిన్నప్పుడు అన్నీ గొడవలే, దూరమయ్యాకే ప్రేమేంటో తెలిసింది.. చెల్లిపై జాసన్ సంజయ్ ఎమోషనల్‌ కామెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved