MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Mahesh Babu: త్రివిక్రమ్ ను టెన్షన్ పెట్టిన మహేష్ బాబు, సూపర్ స్టార్ సెంటిమెంట్ తెలియక డైరెక్టర్ ఏం చేశాడంటే?

Mahesh Babu: త్రివిక్రమ్ ను టెన్షన్ పెట్టిన మహేష్ బాబు, సూపర్ స్టార్ సెంటిమెంట్ తెలియక డైరెక్టర్ ఏం చేశాడంటే?

Mahesh Babu: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత టెన్షన్ పెట్టాడో తెలుసా? సూపర్ స్టార్ సెంటిమెంట్ తెలియక త్రివిక్రమ్ కూడా మహేష్ కు ఫోన్ చేసి ఓ విషయం అడిగాడట. ఇంతకీ ఏంటా కథ?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 05 2026, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హిట్ కాంబినేషన్..
Image Credit : Asianet News

హిట్ కాంబినేషన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన టాలీవుడ్ క్లాసిక్ చిత్రం 'అతడు'. ఈ సినిమా 22 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. హిట్ కొట్టడమే కాదు డైలాగ్స్, యాక్షన్, కామెడీ, పాటలు అన్నింటి పరంగా తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ సినిమా నిర్మించడానికి ముందు జరిగిన పలు ఆసక్తికరమైన సంఘటనలను దర్శకుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహేష్ బాబు సెంటిమెంట్ గురించి, కథ విన్న తరువాత త్రివిక్రమ్ పడ్డ టెన్షన్ గురించి ఏం చెప్పాడంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కథ విన్న వెంటనే గది నుంచి బయటకు..
Image Credit : Asianet News

కథ విన్న వెంటనే గది నుంచి బయటకు..

త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మొదటి చిత్రం 'నువ్వే నువ్వే' చిత్రీకరణ కూడా ప్రారంభం కాకముందే మహేష్ బాబుకు 'అతడు' కథను వినిపించారు.పద్మాలయా స్టూడియోస్‌లోని ఒక గదిలో ఇద్దరూ కూర్చుని కథా చర్చలు జరిపారు. త్రివిక్రమ్ కథ మొత్తం చెప్పిన వెంటనే, మహేష్ బాబు ఏమీ మాట్లాడకుండా లేచి గది బయటకు వెళ్ళిపోయారు దాంతో మహేష్ బాబుకు కథ నచ్చలేదేమో, అందుకే అలా వెళ్లిపోయారని త్రివిక్రమ్ కాస్త కంగారు పడ్డారు. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డారు. కానీ చివరకు సూపర్ స్టార్ ఇచ్చిన ట్విస్ట్ తో షాక్ అయ్యారు.

34
త్రివిక్రమ్ కు షాక్ ఇచ్చిన మహేష్ బాబు..
Image Credit : Asianet News

త్రివిక్రమ్ కు షాక్ ఇచ్చిన మహేష్ బాబు..

త్రివిక్రమ్ కథ చెప్పడం..మహేష్ బాబు లేచి వెల్లిపోవడంతో.. ఇక ఈ సినిమా సెట్ అవ్వదేమో అని కంగారుపడ్డారట. కానీ దాదాపు 10 నిమిషాల తర్వాత మహేష్ బాబు తిరిగొచ్చి త్రివిక్రమ్‌తో మాట్లాడుతూ — "ఏం లేదు, చాలా సేపటి నుంచి కూర్చుని ఉన్నాను కదా అని అలా బయటకు వెళ్లి వచ్చాను.. మనం ఈ సినిమా చేస్తున్నాం" అని క్లారిటీ ఇచ్చారు . దాంతో త్రివిక్రమ్ హమ్మయ్యా అనుకున్నారు.

44
ముహూర్తానికి రాకపోవడం వెనుక మహేష్ సెంటిమెంట్!
Image Credit : ETV win

ముహూర్తానికి రాకపోవడం వెనుక మహేష్ సెంటిమెంట్!

సినిమాను అధికారికంగా ప్రారంభించే ముహూర్తపు పూజ రోజున ‌- ఫస్ట్ షాట్ తీసినప్పుడు మహేష్ బాబు లొకేషన్‌కు రాలేదు . దాంతో అనుమానం వచ్చిన త్రివిక్రమ్, స్వయంగా మహేష్ బాబుకు ఫోన్ చేసి — "మీరు నిజంగానే ఈ సినిమాలో నటిస్తున్నారా? అసలు ముహూర్తానికి కూడా రాలేదేంటి?" అని నవ్వుతూ అడిగారట. అప్పుడే త్రివిక్రమ్‌కు అసలు విషయం తెలిసింది. సాధారణంగా మహేష్ బాబు తన సినిమాల ముహూర్తపు వేడుకలకు హాజరు కాకపోవడం ఆయనకున్న ఒక విచిత్రమైన సెంటిమెంట్ అని అర్థమైంది. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Recommended image2
Suriya: 50 ఏళ్ల సూర్య తన క్రష్ అంటున్న 25 ఏళ్ల హీరోయిన్ ఎవరో తెలుసా? ఇద్దరు జంటగా నటిస్తున్నసినిమా ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved