MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Preity Zinta Brett Lee: ప్రీతి జింటాతో సీక్రెట్ లవ్? 16 ఏళ్ల తర్వాత షాకింగ్ నిజం చెప్పిన బ్రెట్ లీ

Preity Zinta Brett Lee: ప్రీతి జింటాతో సీక్రెట్ లవ్? 16 ఏళ్ల తర్వాత షాకింగ్ నిజం చెప్పిన బ్రెట్ లీ

Preity Zinta Brett Lee Love Story: బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో అఫైర్ వార్తలపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ స్పందించారు. బాస్ తో నిజంగా లవ్ స్టోరీ ఉందా? ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్లపై బ్రెట్ లీ ఏం చెప్పారు? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 05 2026, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాస్ తో నిజంగా లవ్ స్టోరీ ఉందా? ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్లపై ఓపెన్ అయిన బ్రెట్ లీ
Image Credit : X/FCfrenchPZ

బాస్ తో నిజంగా లవ్ స్టోరీ ఉందా? ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్లపై ఓపెన్ అయిన బ్రెట్ లీ

క్రికెట్, సినిమా గ్లామర్ల మధ్య ఏదో ఒక లింక్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక క్రికెటర్లు, సినీ తారల మధ్య ఫ్రెండ్షిప్, డేటింగ్ రూమర్లు ఎక్కువయ్యాయి. అలాంటి ఒక పాపులర్ గాసిప్ పై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఏళ్ల తర్వాత నోరు విప్పారు. బాలీవుడ్ 'డింపుల్ గర్ల్' ప్రీతి జింటాతో తనకు అఫైర్ ఉందంటూ వచ్చిన రూమర్ల పై స్పందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రీతి జింటాతో అఫైర్ ఉందా?
Image Credit : ChatGPT

ప్రీతి జింటాతో అఫైర్ ఉందా?

ఐపీఎల్ ప్రారంభంలో అంటే 2008 నుంచి 2011 మధ్య బ్రెట్ లీ, ప్రీతి జింటా డేటింగ్ లో ఉన్నారంటూ తీవ్ర ప్రచారం జరిగింది. ఆ సమయంలో బ్రెట్ లీ.. ప్రీతి జింటా సహ యజమానిగా ఉన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) టీమ్ తరఫున ఆడారు. వీళ్లిద్దరూ కలిసి మ్యాచ్ లలో సందడి చేయడం, ముంబైలోని ఒక రెస్టారెంట్ లో కలిసి కనిపించడంతో ఈ గాసిప్స్ మరింత ఎక్కువయ్యాయి. అయితే, తాజాగా ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్ లీ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

Related Articles

Related image1
Most Venomous Snakes: ఒక్కకాటుతో ఏనుగును కూడా చంపేసే స్నేక్.. ఇండియాలో టాప్ 5 విషపూరితమైన పాముల ఇవే
Related image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
35
ఆ వార్తల్లో నిజం లేదు: బ్రెట్ లీ
Image Credit : Getty

ఆ వార్తల్లో నిజం లేదు: బ్రెట్ లీ

తాను ఏనాడూ ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదని బ్రెట్ లీ స్పష్టం చేశారు. "మీకో అసలైన నిజం చెప్తాను, నేను ఏ బాలీవుడ్ నటితోనూ లవ్ లో లేను. ప్రీతి జింటా, నేను అప్పట్లో మంచి ఫ్రెండ్స్, ఇప్పటికీ అలాగే ఉన్నాం. నేను పంజాబ్ కింగ్స్ కి ఆడేటప్పుడు ఆమె మా టీమ్ బాస్. ఆమె చాలా తెలివైన మహిళ. ఆమె అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నా గురించి ఇలాంటి పుకార్లు వచ్చినా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు నిజమేంటో తెలుసు. జనాలు రకరకాలుగా అనుకున్నా, ఆ ఊహాగానాలను నా వరకు రానివ్వలేదు" అని బ్రెట్ లీ వెల్లడించారు.

నిజానికి 2010లోనే ప్రీతి జింటా కూడా ఈ రూమర్లను సోషల్ మీడియాలో ఖండించారు. ప్రతి ఏటా బ్రెట్ లీతో తన పేరును కలపడం పాతబడిపోయిన వార్త అని, తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని అప్పుడే స్పష్టం చేశారు.

45
ఇద్దరి పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది?
Image Credit : Getty

ఇద్దరి పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది?

ఇక వీరిద్దరి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, బ్రెట్ లీ 2006లో ఎలిజబెత్ కెంప్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు జన్మించాడు. అయితే, రెండేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయి, 2009లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బ్రెట్ లీ 2014లో లానా అండర్సన్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరోవైపు ప్రీతి జింటా 2016లో లాస్ ఏంజెల్స్ లో జీన్ గుడ్ ఇనఫ్ ను వివాహం చేసుకున్నారు. ఈ జంట 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు.

55
ప్రీతి రీఎంట్రీ, బ్రెట్ లీ ఐపీఎల్ కెరీర్
Image Credit : Getty

ప్రీతి రీఎంట్రీ, బ్రెట్ లీ ఐపీఎల్ కెరీర్

ప్రీతి జింటా చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆమె నటిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ 'బట్వారా 1947' (Batwara 1947) ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సన్నీ డియోల్, షబానా అజ్మీ, కరణ్ డియోల్, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీటితో పాటు కుణాల్ ఖేము సినిమా 'వైబ్' లోనూ ఆమె నటిస్తున్నారు.

మరోవైపు బ్రెట్ లీ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన 2008 నుంచి 2010 వరకు పంజాబ్ కింగ్స్ కు ఆడారు. ఆ తర్వాత 2011లో కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) కు మారి, 2013 వరకు ఆడారు. మొత్తం 38 ఐపీఎల్ మ్యాచ్ లలో 25 వికెట్లు తీశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Ajinkya Rahane: అజింక్య రహానేకు బీసీసీఐ నెలనెలా పెన్షన్.. ఎంత వస్తుందో తెలుసా?
Recommended image2
Hardik Pandya New Look : హార్దిక్ పాండ్యా కొత్త లుక్ అదిరిందిగా
Recommended image3
Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !
Related Stories
Recommended image1
Most Venomous Snakes: ఒక్కకాటుతో ఏనుగును కూడా చంపేసే స్నేక్.. ఇండియాలో టాప్ 5 విషపూరితమైన పాముల ఇవే
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved