14 ఏళ్ళకే ఫస్ట్ కిస్, నాగచైతన్య ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరు?
Naga Chaitanya First Kiss Experience: టాలీవుడ్ హీరోలలో మిస్టర్ పర్ఫెక్ట్స్ లిస్ట్ లో నాగచైతన్య పక్కాగ ఉంటాడు. ఈ హీరో ఫస్ట్ కిస్ ఎక్స్ పీరియన్స్ ఎప్పుడు అయ్యింది? చైతూ తొలిముద్దు ఎవరికి ఇచ్చాడు. ఓ సందర్భంలో ఆయనే స్వయంగా వెల్లడించిన అసలు నిజం ఏంటి?

Naga Chaitanya First Kiss Experience: రీసెంట్ గా తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు నాగచైతన్య. చాలా కాలంగా తాను ఎదరు చూస్తున్న సాలిడ్ సక్సెస్, తాజాగా తనను వరించడంతో పండగ చేసుకుంటున్నాడు చైతూ. ప్రస్తుతం తండేల్ సక్సెను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు నాగచైతన్య. ఇక నెక్ట్స్ సినిమాలను కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోబోతున్నాడు.
Also Read: 50 లక్షల సమంత ఎంగేజ్మెంట్ రింగ్, విడాకుల తరువాత ఏం చేసిందో తెలుసా?

టాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు. వారిలో నాగచైతన్య కూడా ఒకరు. చాలా కామ్ గా తన పని తాను చేసుకుపోతుంటాడు. చైతూకి స్టార్ డమ్ లేకపోయినా, ఆయనతో సినిమలు చేయడానికి హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. నాగచైతన్య వ్యక్తిత్వం అందరికి నచ్చుతుంది. సాయి పల్లవి లాంటి మరికొందరు హీరోయిన్లు నాగచైతన్యజోడీగా నటించడానికి ఏమాత్రం ఆలోచించకుండా సై అంటుంటారు.
Also Read:రాజమౌళి ఆఫర్ కు నో చెప్పిన స్టార్స్ ఎవరో తెలుసా? ఆతరువాత వాళ్ల రియాక్షన్ ఇదే?
Naga Chaitanya Naga Chaitanya
ఇక పర్సనల్ లైఫ్ లో కాస్త ఎదురుదెబ్బలు తిన్నాడు చైతూ.. సమంతతో ప్రేమ, పెళ్లి, విడాకుల తరువాత, మళ్ళీమరో హీరోయిన్ శోభిత ప్రేమలో పడ్డాడు. 2024 డిసెంబర్ లో వీరి పెళ్ళి ఘనంగా జరిగింది. ఇక నాగచైతన్యకు సబంధించిన ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతూ వస్తోంది. గతంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అదేంటంటే.. నాగచైతన్య ఫస్ట్ కిస్ ఎవరికి ఇచ్చారు.?
Also Read: 5 గురు హీరోయిన్లతో అల్లు అర్జున్ రొమాన్స్, అట్లీ అదిరిపోయే ప్లాన్, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే
ఈ విషయాన్ని నాగచైతన్య బావ, టాలీవుడ్ స్టార్ హీరో రానా ఓ ప్రోగ్రామ్ లో అడిగాడు. రానా హోస్ట్ చేస్తున్న ఆ ప్రోగ్రామ్ కు చైతూ గెస్ట్ గా వచ్చాడు. వీరిద్దరు బంధువులే కాదు మంచి స్నేహితులు కూడా. సో నాగచైతన్యను ఎలాగైనా ఇరికించాలని చాలా ప్రయత్నాలు చేసిన రానా.. నీ ఫస్ట్ కిస్ ఎవరితో అని ప్రశ్నించాడు.
ఏమాత్రం భయపడకుండా, ఆలోచించకుండా నాగచైతన్య నిజం చెప్పేశాడు. నా ఫస్ట్ కిస్ నా క్లాస్ మెంట్ తో జరిగింది. అది కూడా 9th క్లాస్‌లో తొలి ముద్దు పెట్టాను అన్నాడు. ఆ షోలో చైతూ పక్కనే ఉన్న ఆయన కజిన్ సుమంత్ ఈ విషయం విని, షాక్ అయ్యాడు.
ఇక వెంటనే రానా అందుకుని, చూడడానికి ఇంత అమాయకంగా ఉన్నావ్ కదరా అన్నారు. దాంతో చైతూ.. రిప్లయ్ ఇస్తూ.. అమాయకంగా ఉండడమే నాకు ప్లస్ అయ్యిందిరా అని అన్నారు.
ఇలా చైతూ తన స్కూల్ డేస్ లవ్.. ఫస్ట్ కిస్ కు సంబంధించిన విషయం వెల్లడించడంతో, నెటిజన్లు రకరకా కామెంట్లు పెడుతున్నారు. నాగచైతన్య మిస్టర్ పర్ఫెక్ట్ కాదు.. ప్లే బాయ్ అంటూ ఫ్యాన్స్ ఆటపట్టిస్తున్నారు