MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు

Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు

Bigg Boss Telugu 10: రెండో రోజు బిగ్ బాస్ లో నామినేషన్ల సీన్ వాడీ వేడిగా జరిగింది. ఇన్ని రోజులు త్రిగుణ్ ఒక్కడే అనుకుంటే.. ఇప్పుడు అతనికి శివ కూడా తోడయ్యాడు. ఇద్దరితో పాటు వంశీ కూడా మూకుమ్ముడిగా ముఖేష్, వర్షిణీపై దాడి మొదలు పెట్టారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 03 2026, 11:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వాడీ వేడిగా నామినేషన్ల ప్రక్రియ..
Image Credit : Asianet News

వాడీ వేడిగా నామినేషన్ల ప్రక్రియ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీస్తోంది. డే 58 ఎపిసోడ్ నామినేషన్లలో ముకేష్, వర్షిణి ప్రధాన టార్గెట్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఒకవైపు వర్షిణితో శివ్, నరేష్, రామ్ ప్రసాద్ వాదనకు దిగగా.. మరోవైపు ముకేష్ వ్యాఖ్యలతో దేబ్జానీ భావోద్వేగానికి గురైంది. త్రిగుణ్, శివ సైతం ముకేష్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శివ అయితే ముఖేష్ కు సిగ్గులేదు అంటూ.. కోపంతో ఊగిపోయాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వర్షిణికి నరేష్, రామ్ ప్రసాద్ కౌంటర్లు
Image Credit : Asianet News

వర్షిణికి నరేష్, రామ్ ప్రసాద్ కౌంటర్లు

తొమ్మిదో వారం నామినేషన్లలో వర్షిణి నరేష్‌ను టార్గెట్ చేసింది. హోటల్ టాస్క్ సమయంలో ఝాన్సీ డబ్బులు అడిగినా నరేష్ ఇవ్వలేదని ప్రశ్నించింది. దేబ్జానీ చెప్పిన కారణంగానే డబ్బులు ఇవ్వలేదని ఆరోపించింది. దీనికి నరేష్ స్పందిస్తూ.. డబ్బులు తనవని, వాటిని ఇచ్చిన తర్వాత ఎలా ఖర్చు చేసుకోవాలో తన ఇష్టమని చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు. అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించాల్సిన అవసరం లేదంటూ వర్షిణిపై అసహనం వ్యక్తం చేశాడు. ఇతరుల కోసం ఆడుతున్నారని తనను ప్రశ్నించిన వర్షిణి కూడా అదే పని చేస్తోందని కౌంటర్ ఇచ్చాడు.

అనంతరం రామ్ ప్రసాద్ వర్షిణిని నామినేట్ చేశాడు. బయటకు స్నేహంగా ఉంటూ లోపల మరోలా వ్యవహరిస్తోందని, తన ప్రయోజనాల కోసం నరేష్‌ను ఉపయోగించుకుందని ఆరోపించాడు. దీనికి వర్షిణి స్పందిస్తూ నరేష్ గ్రీన్ జోన్‌లోకి వెళ్లాడని, తాను మాత్రం వెళ్లలేదని చెప్పింది. అయితే తామిద్దరం ఒకరికొకరు సహాయం చేసుకున్నామని, ఇందులో ఉపయోగించుకోవడం ఏముందని రామ్ ప్రసాద్ ప్రశ్నించాడు.

34
శివ్‌తో వర్షిణి వాగ్వాదం
Image Credit : Asianet News

శివ్‌తో వర్షిణి వాగ్వాదం

ఆ తర్వాత వర్షిణి శివ్‌ను నామినేట్ చేసింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత తమ అలయెన్స్‌ను విడదీస్తానని చెప్పి ఆ విషయంలో విజయం సాధించారని, చివరకు ఝాన్సీ బయటకు వెళ్లిపోయిందని ఆరోపించింది. దీనికి శివ ఘాటుగా బదులిచ్చాడు. ఝాన్సీ ఎలిమినేషన్‌కు ముకేష్ ప్రవర్తనే కారణమని, తాము ఎవరినీ మానసికంగా కుంగదీయలేదని స్పష్టం చేశాడు. మీరే అలాంటి పరిస్థితులను తెచ్చుకున్నారని వర్షిణికి కౌంటర్ ఇచ్చాడు.

44
ముకేష్‌పై శివ్, త్రిగుణ్ ఆగ్రహం.. దేబ్జానీ ఎమోషనల్
Image Credit : Asianet News

ముకేష్‌పై శివ్, త్రిగుణ్ ఆగ్రహం.. దేబ్జానీ ఎమోషనల్

ముకేష్ గతంలో చేసిన కామెంట్స్ తో దేబ్జానీ తీవ్రంగా హర్ట్ అయినట్లు కనిపించింది. దేబ్జానీ వెనుక శివ తిరుగుతున్నాడనే అర్థం వచ్చేలా ముకేష్ మాట్లాడటంపై శివ నామినేట్ చేస్తూనే ఫైర్ అయ్యాడు. ఒక మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. గేమ్‌లో మూడు స్టార్ల కోసం ఇంతలా దిగజారాలా అంటూ నిలదీశాడు.

దేబ్జానీ సైతం ముకేష్ ప్రవర్తనను తప్పుబట్టింది. టాస్కుల్లో వేగం, బ్యాలెన్స్ కంటే వ్యక్తిత్వం, ప్రవర్తన ముఖ్యమని చెప్పింది. ముకేష్‌ను డర్టీ మైండ్, అనర్హుడు అంటూ నామినేట్ చేసింది. అతడి మాటలకు బాధపడిన ఆమె చివరకు 'ఐ పిటీ ఆన్ యూ ముకేష్' అంటూ భావోద్వేగానికి గురైంది.

ఇదే సమయంలో త్రిగుణ్ కూడా ముకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి ఆలోచనా విధానాన్ని తప్పుబడుతూ డర్టీ మైండ్, వల్గర్ మైండ్ అంటూ ఘాటుగా మాట్లాడాడు. స్నేహానికి ఇచ్చే విలువ, వ్యక్తిత్వం, ఎథిక్స్ అన్నీ ముకేష్ దగ్గర శూన్యమంటూ విమర్శించాడు. మరోవైపు ముకేష్ కూడా త్రిగుణ్‌పై ఎదురుదాడికి దిగుతూ ఈ సమాజానికి నువ్వే హానికరమని వ్యాఖ్యానించాడు.

త్రిగుణ్ నిజంగా కొంత మందిని ప్రభావితం చేస్తున్నట్టుగా ఇక్కడ అర్ధం అవుతోంది. హౌస్ లో చాలా జరుగుతున్నాయి. కానీ గతంలో రోహిత్ ను టార్గెట్ చేసిన త్రిగుణ్ అండ్ టీమ్.. అతను వెళ్లిపోయిన వెంటనే ముఖేష్, వర్షిణీపై పడ్డారు. మూసుకుని కూర్చో, సిగ్గులేదా లాంటి పదాలు వాడుతూ.. త్రిగుణ్, శివ చేసిన వీరంగా చిల్లరగా అనిపించింది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Stars Salary: రామాయణం కోసం రణబీర్, యశ్, సాయి పల్లవి ఎంత తీసుకున్నారో తెలుసా?
Recommended image2
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Recommended image3
Mamitha Baiju: 2026 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్‌.. వరుసగా 300, 330, 350 కోట్ల కలెక్షన్స్
Related Stories
Recommended image1
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Recommended image2
Ramayana Stars Salary: రామాయణం కోసం రణబీర్, యశ్, సాయి పల్లవి ఎంత తీసుకున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved