రాజమౌళి ఆఫర్ కు నో చెప్పిన స్టార్స్ ఎవరో తెలుసా? ఆతరువాత వాళ్ల రియాక్షన్ ఇదే?
రాజమౌళి తో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్స్ అయినా ఎగిరి గంతేస్తారు. ఒక్క సీన్ చేసినా చాలు అనుకునేవారు ఉన్నారు. కాని రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసేవారు ఉంటారా? ఒకరు ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు. ఇంతకీ ఎవరెవరు జక్కన్న సినిమాను రిజెక్ట్ చేశారు?

Rajamouli
రాజమౌళి సినిమాలో అవకాశం రావడం చాలామంది స్టార్లు అదృష్టంగా భావిస్తుంటారు. బాలీవుడ్ స్టార్స్ కూడా జక్కన్న సినిమాలో ఒక్క చిన్న పాత్ర ఉన్నాచాలు అనుకుంటారు. రాజమౌళి సినిమాలో చేస్తే పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు, వరల్డ్ ఫేమస్ అవ్వచ్చు అని ఆలోచిస్తుంటారు. అందుకే రాజమౌళిని తన సినిమాలో అవకాశం ఇవ్వమని అడిగేవారు కూడా ఉన్నారు. కాని రాజమౌళి సినిమా నుంచి ఆఫర్ వచ్చినా కూడా కాదనుకుని రిజెక్ట్ చేసిన వారు ఉన్నారని మీకు తెలుసా? ఇంతకీ వాళ్ళు ఎంత మంది.. ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేశారు.
Also Read: హీరోయిన్ తో రహస్యంగా విశాల్ ఎంగేజ్మెంట్, స్టార్ హీరో పెళ్లాడబోయేది ఆమెనేనా?
రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేశారు అని ప్రచారం జరుగుతున్న వాళ్ళలో మొదటిగా హీరో బాలకృష్ణ పేరే వినిపిస్తుంది. బాలయ్య బాబుతో రాజమౌళి సింహాద్రి సినిమా చేయాలి అని అనుకున్నారట. కాని ఈ కథను బాలయ్య రిజెక్ట్ చేశారట. దాంతో అది జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది. ఇక సింహాద్రి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా జక్కన్నతో సినిమా మిస్ అయ్యాడు బాలకృష్ణ.
Also Read: అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు? జాతర చేయబోతున్న ఐకాన్ స్టార్, ఇక రచ్చ రచ్చే
ఇక రాజమౌళి సినిమాను మిస్ అయిన మరో స్టార్ హీరో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును పవన్ తో సినిమా చేయాలని రాజమౌళి చాలా ప్రయత్నాలు చేశారాట. విక్రమార్కుడు కథ పట్టుకుని పవన్ కళ్యాన్ ను చాలాసార్లు కలిశారట. పవన్ కథ కూడా విన్నారట. కాని పవన్ మాత్రం ఈసినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. దాంతో ఆ కథ రవితేజకు వినిపించిన అద్భుతమైన సినిమా చేశాడు రాజమౌళి. విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.
Also Read: శోభిత ధూళిపాళ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, అతన్ని అంతలా ప్రేమించిందా?
ఇక రాజమౌళి ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వదులుకున్న మరో హీరో జాన్ అబ్రహం. ఈ హీరోకి ప్రాంతీయ భాషలో వచ్చే సినిమాలు చాలా చులకనగా చూస్తాడు. ఆ ఉద్దేశ్యంతోనే ఒప్పుకోలేదేమో..బహుబలి సినిమాలో రానా చేసిన భళ్ళాలదేవ పాత్రకోసం జాన్ ను అడిగాడట రాజమౌళి.
కాని అతను రిజెక్ట్ చేయడంతో రానా సీన్ లోకి వచ్చాడు. ఇక బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదించాడట జక్కన్న. కాని ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో సత్యరాజ్ కు ఆ అవకాశం వచ్చింది. ఈసినిమా తరువాత సత్యరాజ్ కు కూడా అవకాశాలు భారీగా పెరిగిపోయాయి.
ఇక రాజమౌళి ఇచ్చిన అవకాశాన్ని హీరోయిన్లు కూడా కొంత మంది రిజెక్ట్ చేశారట. బాహుబలి సినిమాలో రాజమాత శివగామి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించాడట రాజమౌళి. కాని ఆమె రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో రమ్యకృష్ణను రంగంలోకి దింపాడు. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది.
ఇక త్రిష కూడా రాజమౌళి సినిమాకు నో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందట. మర్యాద రామన్న సినిమాలో సునిల్ జోడీగా నటించడానికి త్రిషను అడిగాడట రాజమౌళి. జక్కన్న సినిమాలో చేయాలని ఉన్నా.. సునిల్ పక్కన చేస్తే పెద్ద ఆఫర్లు రావు అనుకుని త్రిష.. ఆ అఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇలా చాలామంది స్టార్స్ రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసి... ఆతరువాత అయ్యే అనుకున్నారట. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని. సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా ప్రచారం జరిగింది.