50 లక్షల సమంత ఎంగేజ్మెంట్ రింగ్, విడాకుల తరువాత ఏం చేసిందో తెలుసా?
నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత తన ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని ఏం చేసిందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు.

హీరోయిన్ సమంత కు సబంధించిన ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆమె ఒక్క పోస్ట్ కు లక్షల్లో లైకులు వస్తుంటాయి. ఆమె గురించి వచ్చిన ప్రతీ సమాచారం ఎప్పుడూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక హీరోయన్ గా స్టార్ డమ్, నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు, మయోసైటిస్ వ్యాధి ఇలా సమంత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసింది బ్యూటీ. ఇక మరో వైపు నాగచైతన్య విడాకులు తీసుకున్న వెంటనే శోభితను ప్రేమించడం ప్రారంభించాడు, మూడేళ్ళ తరువాత గత ఏడాది పెళ్లి చేసుకున్నారు.

సమంత - నాగ చైతన్య విడాకులు
మొదట్లో సమంత - చైతన్య విడాకులకు సమంతనే కారణమని సోషల్ మీడియా కోడై కూసింది. , ఆ తర్వాత నాగ చైతన్యకు శోభితపై ఉన్న ప్రేమ కారణమా అనే ప్రశ్నలు తలెత్తాయి. పెళ్లి తర్వాత నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. మా విడాకులకు - శోభితకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ పుకార్ల వల్ల ఎక్కువగా నష్టపోయింది శోభిత అని అన్నారు.
పెళ్లయిన డైరెక్టర్‌తో డేటింగ్ చేస్తున్న సమంత
నాగ చైతన్య రెండో పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టినప్పటికీ, సమంత తన రెండో పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో గత కొన్ని నెలలుగా సమంత, ఇదివరకే పెళ్లయిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందని పుకార్లు మాత్రం పుట్టాయి. కాని ఈ విషయంలో ఇద్దరు బయటపడలేదు, ఏమీ చెప్పలేదు.
సమంత ఉంగరం పెండెంట్‌గా మార్పు:
ఇదిలా ఉంటే సమంతకు నాగ చైతన్య పెళ్లి సమయంలో ఆమె వేలికి తొడిగిన ఎంగేజ్‌మెంట్ ఉంగరం గురించి కొత్త సమాచారం వైరల్ అవుతోంది. ఆమె తన రింగ్ ను ఏం చేసి ఉంటుంది అన్న ప్రశ్న సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. అయితే ఆమె తన ఉంగరాన్ని మార్చేసిందట.
ఆ రింగ్ ను పెండెంట్ గా మార్చి... దాని కోసం ఒక నెక్లెస్‌ను తయారు చేయించుకుంది. సమంత ఈ పెండెంట్‌ను చాలా కార్యక్రమాల్లో ఉపయోగించింది. సమంత ఈ పెండెంట్‌ను సినిమా ఈవెంట్స్ కు కూడా వేసుకుని రావడం చూస్తుంటాం. ఇలా 50 లక్షల విలువైన ఈ ఉంగరాన్ని పెండెంట్‌గా మార్చి ఆశ్చర్యపరిచింది సామ్.
పెళ్లి దుస్తుల్లో మార్పులు చేసిన సమంత
ఇక తన పెళ్లి గౌన్ ను కూడా రీ మోడల్ చేయించింది సమంత. 2024లో అవార్డుల ప్రదానోత్సవానికి తగ్గట్టుగా తన పెళ్లి గౌనును మార్చి డిజైన్ చేయించుకుంది. నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు 6 సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నాలుగు సంవత్సరాలు కలిసి జీవించారు. ఆ తర్వాత అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరూ 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

