- Home
- Entertainment
- Ramayana Stars Salary: రామాయణం కోసం రణబీర్, యశ్, సాయి పల్లవి ఎంత తీసుకున్నారో తెలుసా?
Ramayana Stars Salary: రామాయణం కోసం రణబీర్, యశ్, సాయి పల్లవి ఎంత తీసుకున్నారో తెలుసా?
Ramayana Stars Salary: రామాయణం మూవీ స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్ రూ.75 కోట్లు తీసుకుంటుండగా, యశ్ లాభాల్లో వాటా అడిగాడట. మిగతా నటీనటుల పారితోషికం వివరాలు ఏంటంటే?

రామాయణం స్టార్స్ రెమ్యునరేషన్స్...
నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న రామాయణం ఇండియన్ సినిమాలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, సన్నీ డియోల్ లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ అంచనాలు పెంచేసింది.
ఈ సినిమా బడ్జెట్, సెట్స్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. ఇప్పుడు నటీనటుల రెమ్యునరేషన్స్ హాట్ టాపిక్ గా మారాయి. CineAIx రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ రూ.75 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ మూవీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది అతనే.
ఇక రావణుడిగా నటిస్తున్న యశ్ ఎలాంటి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. నమిత్ మల్హోత్రాతో కలిసి యశ్ ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అందుకే రెమ్యునరేషన్ కు బదులుగా సినిమా లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడు.
దీంతో యశ్ సంపాదన సినిమా కమర్షియల్ సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది. డైరెక్టర్ నితీష్ తివారీ ఈ ప్రాజెక్ట్ కోసం రూ.50 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
సాయి పల్లవి, సన్నీ డియోల్, రవి దూబే రెమ్యునరేషన్స్
ఈ సినిమాలో సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవి రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఆమే.
సాయి పల్లవి న్యాచురల్ యాక్టింగ్ తో సీత పాత్రకు ప్రాణం పోస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక హనుమంతుడిగా నటిస్తున్న సన్నీ డియోల్ ఈ రోల్ కోసం రూ.20 కోట్లు తీసుకుంటున్నాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడిగా టీవీ యాక్టర్ రవి దూబే నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అతను రూ.3 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ నుంచి లారా దత్తా వరకు.. సపోర్టింగ్ కాస్ట్ ఫీజులు
మెయిన్ లీడ్స్ తో పాటు రామాయణం సినిమాలో చాలా మంది ప్రముఖులు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. వాళ్ల పాత్రల నిడివిని బట్టి రెమ్యునరేషన్స్ ఉన్నాయి.
శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ - రూ.1.50 కోట్లు
మండోదరిగా కాజల్ అగర్వాల్ - రూ.1 కోటి
మేఘనాథుడిగా రాఘవ్ జుయల్ - రూ.1 కోటి
జటాయువు (వాయిస్) గా అనుపమ్ ఖేర్ - రూ.50 లక్షలు
విద్యుత్జిహ్వగా వివేక్ ఒబెరాయ్ - (తన రెమ్యునరేషన్ ను క్యాన్సర్ పేషెంట్స్ కు విరాళంగా ఇచ్చాడట)
ఇంద్ర దేవుడిగా కునాల్ కపూర్ - రూ.30 లక్షలు
కైకేయిగా లారా దత్తా - రూ.25 లక్షలు
అయితే ఈ రెమ్యునరేషన్స్ పై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ఈ ఫిగర్స్ కు, అసలు రెమ్యునరేషన్స్ కు తేడా ఉండే అవకాశం ఉంది.





