- Home
- Entertainment
- 50 ఏళ్లుగా భార్య పెట్టిన కండిషన్ ఫాలో అవుతున్న మురళీమోహన్, అందుకే ఆ సినిమాలో నటించలేదా?
50 ఏళ్లుగా భార్య పెట్టిన కండిషన్ ఫాలో అవుతున్న మురళీమోహన్, అందుకే ఆ సినిమాలో నటించలేదా?
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా, ఎంపీగా దాదాపు 50 ఏళ్లకు పైగా కొనసాగుతున్నారు మురళీమోహన్. ఇన్నేళ్ల కెరీర్ లో తన భార్య పెట్టిన ఒక్క కండీషన్ ను మాత్రం ఎప్పుడు క్రాస్ చేయలేదట. ఇంతకీ ఆ కండీషన్ ఎంటి?

టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరోలలో మురళీ మోహన్ ఒకరు. 85 ఏళ్ల వయస్సులో కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ నటుడు, అనేక రంగాల్లో తన టాలెంట్ చూపించారు. హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసి.. సూపర్ హిట్ సినిమాలు చేసిన మురళీ మోహాన్, ఆతరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి వందల సినిమాల్లో నటించి మెప్పించారు. ఈక్రమంలోనే నిర్మాతగా కూడా మారిని మరళీ మోహన్, జయభేరి సంస్థ ద్వారా ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు.
KNOW
సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో పాటు, తాతల కాలం నాటి నుంచి వస్తున్న ఆస్తులతో వ్యాపారం చేసి సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా గుర్తింపు సంపాదించారు మురళీ మోహాన్. అంతే కాదు రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టి రాజమండ్రి నుంచి ఎంపీగా పనిచేశారు మురళీ మోహన్.
ఆయన జీవితంలో అడుగు పెట్టిన ప్రతీ రంగంలో అపజయం ఎరుగని వ్యక్తిగా గుర్తింపు సాధించారు మురళీ మోహాన్. ప్రస్తుతం బిజినెస్ నుంచి, సినిమాలు, రాజకీయాల నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరైనా వచ్చి క్యారెక్టర్ ఇస్తే, అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు.
అయితే మురళీ మోహన్ 50 ఏళ్ల సినిమా జీవితంలో తన భార్య పెట్టిన ఓ కండీషన్ ను మాత్రం ఫాలో అవుతూ వచ్చారట. ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతూనే ఉన్నారట. ఈవిషయాన్ని రీసెంట్ గా అతడు సినిమా రీరిలీజ్ కాబోతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో వెల్లడించారు మురళీ మోహాన్.
నిర్మాతగా మురళీ మోహన్ అద్భుతమైన సినిమాలు చేశారు. మరీ ముఖ్యంగా ఆయన నిర్మించిన అతడు సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ అయ్యింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 2005లో వచ్చిన 'అతడు' సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సినిమాను జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మించారు. ఈసినిమాకు ఎంత క్రేజ్ ఉందంటే.. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా ప్లే అయితే అలా చూస్తుండిపోతుంటారు అభిమానులు. టీవీ టీఆర్పీలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఇక అతడు సినిమా 1500 సార్లు టీవీలో ప్లే అయ్యి రికార్డ్ కూడా క్రీయేట్ చేసింది. ఇన్ని రికార్డు లు ఉన్న ఈసినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండగా, స్టార్ హీరోలు నటించిన హిట్ సినిమాలను వరుసగా రీరిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో అతడు మూవీని కూడా కొత్త హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఆగస్టు 9న అతడు రీ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో, మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మీరు కూడా స్టార్ నటులు కదా? సూపర్ హిట్ సినిమా అతడు ను నిర్మించారు కానీ, ఈ సినిమాలో మీరెందుకు నటించలేదని ఓ మీడియా ప్రతినిధి మురళీమోహన్ ను ప్రశ్నించగా. అందుకాయన బదులిస్తూ, తన భార్య పెట్టిన కండిషన్ కారణంగానే తాను ఆ సినిమాలో నటించలేదని తెలిపారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ "అతడు సినిమాలో నాకు పాత్ర ఇవ్వలేదు. నేను సినీ పరిశ్రమలోకి రావాలనుకున్న తొలినాళ్లలో మా ఆవిడ ఓ కండిషన్ పెట్టింది. నేను ఎవరి దగ్గరకు వెళ్లి పాత్రను అడగకూడదు, ఎవరైనా పిలిచి చేయమంటే తప్ప తానుగా వెళ్లి క్యారెక్టర్ ను అడగకూడదు అని స్పష్టం చేసింది. ఆ మాటలకు ఇప్పటివరకూ కట్టుబడి ఉన్నాను.
కెరీర్ అంతా కూడా నా వద్దకు వచ్చిన పాత్రలనే చేస్తూ వచ్చాను. ఇప్పటికీ అదే రూల్ పాటిస్తున్నాను. అందుకే అతడు సినిమాలో క్యారెక్టర్ ఇవ్వమని నేను అడగలేదు. నాకు అందులో పాత్ర లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వలేదు. అందుకే నేను ఈ సినిమాలో కనిపించలేదు" అని మురళీమోహన్ వివరించారు.