MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • అంతా అయిపోంద‌నిపిస్తోందా.? ఈ ఒక్క పాట వింటే మీ జీవితం కొత్త‌గా మొద‌ల‌వ‌డం ఖాయం

అంతా అయిపోంద‌నిపిస్తోందా.? ఈ ఒక్క పాట వింటే మీ జీవితం కొత్త‌గా మొద‌ల‌వ‌డం ఖాయం

Motivational Song: మ‌నిషిని క‌దిలించే శ‌క్తి సాహిత్యానికి ఉంటుంది. ఇలాంటి సాహిత్యాన్ని సినిమా పాట‌ల్లోకి తీసుకొచ్చిన ఘ‌న‌త సిరివెన్నెల సీతారామశాస్త్రిది అని చెప్ప‌డంలో సందేహం లేదు. ఆయ‌న రాసిన అద్భుత పాట‌ల్లో ఒక‌దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 08 2026, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప‌ట్టుద‌ల మూవీలో అద్భుత పాట
Image Credit : cinema express.com, Gemini AI

ప‌ట్టుద‌ల మూవీలో అద్భుత పాట

సిరివెన్న‌ల క‌లం నుంచి జాలు వారిన అద్భుత పాట‌ల్లో ప‌ట్టుద‌ల మూవీలోని ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దురా ఓట‌మి అనే పాట ఒక‌టి. 1992లో విడుదలైన 'పట్టుదల' చిత్రంలోని ఈ స్ఫూర్తిదాయకమైన పాట, ఓటమిని అంగీకరించకుండా ప్రయత్నాన్ని కొనసాగించమనే సందేశాన్ని చాటుతుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతాన్ని కె.జె. ఏసుదాస్ పాడగా, ఇళయరాజా సంగీతం అందించారు. నిరంతర కృషి, పట్టుదల ఉంటే విజయం ఖాయమని ఈ పాట చెబుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆర్జీవీ మాట‌ల్లో
Image Credit : Asianet News

ఆర్జీవీ మాట‌ల్లో

నిజానికి ఈ పాటను ఈత‌రం జ‌న‌రేష‌న్‌కు పరిచ‌యం చేసింది ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అని చెప్ప‌డంలో సందేహం లేదు. రామూయిజం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆర్జీవీ ఈ పాట గురించి మాట్లాడారు. త‌న ఉద్దేశంలో ప్రపంచంలోనే ది బెస్ట్ ఇన్‌స్పిరేషనల్ సాంగ్ అంటే ఇదే అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్ కింద ఉన్న కామెంట్స్‌లో చాలా మంది యూజ‌ర్లు ఆర్జీవీ చెప్పిన త‌ర్వాతే ఈ పాట‌ను చూస్తున్నామ‌ని పేర్కొన్నారు. నిజానికి ఈ త‌రం వారికి ఈ పాట ఎంతో అవ‌స‌రం. చిన్న చిన్న కార‌ణాల‌కే, ఓట‌మిల‌కు కుంగిపోతున్న యువ‌త ఈ పాట‌లోని అర్థాన్ని అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇంత‌కీ పాట‌లో ఉన్న అంత‌టి గొప్ప‌త‌నం ఏంటో చూద్దాం.

36
నొప్పి లేని క్ష‌ణం ఉండ‌దు
Image Credit : our own

నొప్పి లేని క్ష‌ణం ఉండ‌దు

మ‌నిషి జీవితంలో క‌ష్టాలు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌నే సందేశాన్ని ఈ పాట ఇస్తుంది. అయితే దానిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డ‌మే మ‌నిషి చేయాల్సిన ప‌ని అని శాస్త్రి ఈ పాట ద్వారా తెలిపారు. ఈ పాట‌లోని.. ‘నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున, నీరసించి నిలిచిపోతె, నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ , దేహముంది ప్రాణముంది, నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా, ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారెదెవరురా’ అనే లైన్ అద్భుతంగా ఉంటుంది.

46
నిరాశకే నిరాశ పుడుతుంది
Image Credit : our own

నిరాశకే నిరాశ పుడుతుంది

ప్రతీ మనిషికి జీవితంలో నిరాశ పుట్టడం సర్వసాధారణం. అయితే నిరంతరం కృషి చేస్తే ఆ నిరాశ‌కు కూడా నిరాశ పుడుతుంద‌ని శాస్త్రి ఈ పాట‌లో చ‌క్క‌గా చెప్పారు. ఆకాశం ఎంత పెద్ద‌గా ఉన్నా ఎగిరే గువ్వ పిల్ల రెక్క ముందు చిన్న‌దే క‌దా అంటారు. అలాగే స‌ముద్రం ఎంత పెద్ద‌ద‌యినా ఈదే చేప‌పిల్ల మొప్ప ముందు చిన్న‌దేగా అని అభివ‌ర్ణించారు. అలాగే ప‌శ్చిమాన సూర్యుడు అస్త‌మించినా మ‌ళ్లీ ఉద‌యం తూర్పున ఉద‌యిస్తాడు. కాబ‌ట్టి ఎప్పుడూ ఓట‌మిని ఒప్పుకోవ‌ద్ద‌నే గొప్ప సందేశాన్ని ఈ పాట ఇస్తుంది. ఇదిలా ఉంటే శాస్త్రి రాసిన పాట‌లోని కొన్ని లైన్స్‌ను పాట‌లో పెట్ట‌డానికి ప‌ట్టుద‌ల చిత్ర యూనిట్ అంగీక‌రించ‌లేదంటా. దీంతో సినిమా కోసం కొన్ని చ‌ర‌ణాల‌ను మార్చిన‌ట్లు సిరివెన్నెల స్వ‌యంగా తెలిపారు. అయితే సినిమాలో పాట‌కంటే శాస్త్రి స్వ‌యంగా పాడిన పాటకు మ‌రింత ఎక్కువ రెస్పాన్స్ వ‌చ్చింది. శాస్త్రి పాడిన పాట‌ను ఇక్క‌డ వినండి.

56
ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దురా పాట పూర్తి లిరిక్స్
Image Credit : our own

ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దురా పాట పూర్తి లిరిక్స్

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

విశ్రమించవద్దు ఏ క్షణం

విస్మరించవద్దు నిర్ణయం

అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వ పిల్ల

రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల

మొప్ప ముందు చిన్నదేనురా

పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య

ఒక్కనాడు నెగ్గలేదురా

గుటక పడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ

తూరుపింట తేలుతుందిరా

66
ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దురా పాట పూర్తి లిరిక్స్
Image Credit : our own

ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దురా పాట పూర్తి లిరిక్స్

నిశా విలాసం ఎంత సేపురా..

ఉషోదయాన్ని ఎవ్వడాపురా..!!

రగులుతున్న గుండె కూడా

అగ్నిగోళమంటిదేనురా

నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన

జీవితాన అడుగుఅడుగునా

నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీదికాదు

బతుకు అంటే నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది

ఇంతకన్న సైన్యముండునా

ఆశ నీకు అస్త్రమవును.. శ్వాస నీకు శస్త్రమవును

ఆశయమ్ము సారథవునురా

నిరంతరం ప్రయత్నమున్నదా

నిరాశకే నిరాశపుట్టదా

ఆయువంటు ఉన్నవరకు చావు కూడ నెగ్గలేక

శవముపైన గెలుపు చాటురా

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం
ఫీల్ గుడ్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Fact: లారీల వెన‌కాల రంగురంగుల బ‌ట్ట‌లు ఎందుకు క‌డతారో తెలుసా.? అస‌లు కార‌ణం ఇదే..
Recommended image2
రూ. 1.3 ల‌క్ష‌ల కోట్ల‌తో నిర్మాణం, ఈనెల 28న శంకుస్థాప‌న‌.. ఏపీలో ఈ ప్రాంతం మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved