MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే

Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే

Rajinikanth: ఓసారి రజినీకాంత్ ను చూసి ఒక మహిళ బిచ్చగాడనుకుంది. ఆయన అవతారం చూసి జాలితో తన దగ్గరున్న 10 రూపాయలు చేతిలో పెట్టింది. ఆ తరవాత అతను సూపర్ స్టార్ రజినీ అని తెలిశాక ఏ చేసిందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 10 2026, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నిజజీవితంలో సింపుల్ గా ఉండే రజినీ
Image Credit : Instagram

నిజజీవితంలో సింపుల్ గా ఉండే రజినీ

సినిమాల్లో రజినీకాంత్‌ సూపర్ స్టార్. కానీ నిజజీవితంలో ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. కింద కూర్చోవడానికి ఏమాత్ర సందేహించరు. ఆయన సింప్లిసిటీ వల్ల కొన్ని సార్లు ఆయన అభిమానులు సైతం అతడిని పోల్చుకోలేరు.  ఓ మహిళ రజనీని పోల్చుకోలేక బిచ్చగాడు అనుకుని 10 రూపాయలు భిక్షం వేసింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శివాజీ సినిమా షూటింగ్లో
Image Credit : instagram

శివాజీ సినిమా షూటింగ్లో

రజినీకాంత్‌కు తన సినిమా హిట్ కొడితే హిమాలయాలకు వెళ్లడం, గుళ్లకు వెళ్లడం అలవాటు. 'శివాజి' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఓ గుడికి వెళ్లాలనుకున్నారు.  కానీ సూపర్‌స్టార్‌గా కాకుండా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లారు. తనతో పాటూ బౌన్సర్లను రావొద్దని చెప్పారు. తెల్ల పంచె, చొక్కా వేసుకుని ఒంటరిగా గుడికి వెళ్లారు. దేవుడి దర్శనం తర్వాత గుడి బయట మెట్లపై కాసేపు కూర్చున్నారు. అప్పుడే అక్కడికి ఓ వృద్ధురాలు వచ్చారు. మెట్లపై కూర్చున్న వ్యక్తి రజినీకాంత్ అని ఆమెకు తెలియదు. తెల్ల పంచె, గడ్డంతో ఉన్న ఆయన్ను చూసి, ఎవరో పేదవాడు, బిచ్చగాడు అనుకున్నారు. జాలితో తన దగ్గరున్న 10 రూపాయల నోటును రజినీకాంత్ చేతిలో పెట్టారు.

Related Articles

Related image1
Name Astrology: మీ పేరు ఈ 3 అక్షరాలలో దేనితో మొదలైనా మీరు రిచ్ కావడం ఖాయం
Related image2
Blouse designs: 40 ఏళ్లు దాటిన మహిళల కోసం డీసెంట్ లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్లు
34
ఆ డబ్బును ఏం చేశారు?
Image Credit : Rajinikanth\Instagram

ఆ డబ్బును ఏం చేశారు?

అప్పుడు రజినీకాంత్ ఎలాంటి కోపాన్ని ప్రదర్శించలేదు.  ఆ మహిళ ఇచ్చిన 10 రూపాయలను ఎంతో ప్రేమగా, చిన్న నవ్వుతో రెండు చేతులతో స్వీకరించారు. తరువాత మెట్లపై నుంచి లేచి తన కారు వైపు నడిచారు. ఆయన కోసం ఎదురుచూస్తున్న లగ్జరీ కారు, ఆయన కోసం ఎదురుచూస్తున్న సెక్యూరిటీ, జనాలు చూసి ఆ మహిళ షాక్ అయింది. తను బిచ్చగాడు అనుకుని 10 రూపాయలు ఇచ్చింది రజినీకాంత్ కి అన్న విషయం ఆమెకు అర్థమైంది.

44
క్షమించమని అడిగిన మహిళ
Image Credit : Rajinikanth\Instagram

క్షమించమని అడిగిన మహిళ

వెంటనే ఆమె రజినీకాంత్ దగ్గరకు పరుగెత్తుకెళ్లి, 'నన్ను క్షమించండి. దయచేసి క్షమించండి. మీరు ఎవరో నాకు నిజంగా తెలియదు' అని వేడుకుంది. అప్పుడు రజినీకాంత్ ఆ మహిళతో  'అమ్మా, మీరు నన్ను క్షమించమని అడగకండి. నిజానికి ఇది దేవుడే నాకు గుర్తుచేస్తున్న ఒక అద్భుతమైన పాఠం. నా అసలు స్వరూపం ఏంటో దేవుడు మీ ద్వారా నాకు తెలియజేశాడు. దేవుడి ముందు మనమందరం బిచ్చగాళ్లమే. ఆయన దర్బారులో మన యోగ్యత, అంతస్తు, డబ్బు దేనికీ విలువ లేదు. అందరూ ఒక్కటే' అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, 'నాకు ఎలాంటి అహంకారం, గర్వం రాకుండా ఆపడానికే దేవుడు మీ ద్వారా నాకు సందేశం ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ 10 రూపాయలు నాకు కేవలం డబ్బు కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం' అని చెప్పారు. ఆ మహిళ ఇచ్చిన 10 రూపాయల నోటును చివరి వరకు తన దగ్గరే భద్రంగా ఉంచుకుంటానని చెప్పారు. ఇప్పటికీ ఆ 10 రూపాయల నోటు రజినీకాంత్ దగ్గర ఓ పవిత్రమైన జ్ఞాపకంగా ఉంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Recommended image3
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Related Stories
Recommended image1
Name Astrology: మీ పేరు ఈ 3 అక్షరాలలో దేనితో మొదలైనా మీరు రిచ్ కావడం ఖాయం
Recommended image2
Blouse designs: 40 ఏళ్లు దాటిన మహిళల కోసం డీసెంట్ లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved