దుబాయ్ బుర్జ్ ఖలీఫా లో ఇల్లు కొన్న ఏకైక ఇండియన్ హీరో ఎవరో తెలుసా?
ఇండియన్ స్టార్ హీరోల పేరిట ఏదో ఒక రికార్డ్ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. ఈక్రమంలోనే దుబాయ్ లోని బుర్జ్ ఖాలీఫా లో మన ఇండియన్ హీరో ఫ్లాట్ కొని సరికొత్త రికార్డ్ సాధించాడని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా హీరో?
- FB
- TW
- Linkdin
Follow Us
)
దుబాయ్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బుర్జ్ ఖలీఫానే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన ఈ కట్టడంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ పై మన ఇండియన్ సినిమా అప్ డేట్స్ తో పాటు స్టార్ సెలబ్రిటీల పుట్టినరోజులకు సబంధించిన అప్ డేట్స్ ను కూడా ప్లే చేస్తుంటారు. అయితే ఈ బుర్జ్ ఖాలీఫా బిల్డింగ్ లో మన ఇండియన్ స్టార్ హీరోకు ప్లాట్ ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా హీరో?
ఇండియాలో చాలామంది సూపర్ స్టార్ హీరోలు ఉండగా. ఒకే ఒక్క హీరోకు ఈ బుర్జ్ ఖలీఫా లో ప్లాట్ ఉంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరో కాదు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసిన ఏకైక ఇండియన్ యాక్టర్ గా ఆయన ఒక ప్రత్యేక రికార్డు సృష్టించారు.
2004లో ప్రారంభమై 2010లో పూర్తి అయిన బుర్జ్ ఖలీఫా భవనం, దుబాయ్‌లో 828 మీటర్ల ఎత్తుతో 163 అంతస్తులుగా నిర్మించబడింది. ఈ గొప్ప భవనంలో సెలబ్రిటీల నుంచి వ్యాపారవేత్తల దాకా పలువురు ప్లాట్స్ ను కొన్నారు. ఈ క్రమంలో మోహన్ లాల్ దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో 29వ అంతస్తులో ఒక సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ను కొన్నారు.
ఈ ప్లాట్ విలువ 3.5 కోట్లు. అంతే కాదు ఈ ఫ్లాట్‌ను ఆయన తన భార్య సుచిత్ర లాల్ పేరిట రిజిస్టర్ చేయించారు. దీనితో పాటు మోహన్ లాల్ దుబాయ్‌లో మరో విలాసవంతమైన విల్లాలో 3BHK అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక తెలుగు హీరోలలో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి మరికొందరికి కూడా దుబాయ్‌లో ఆస్తులున్నాయనే ప్రచారం ఉన్నా, వాటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు.
ఇక సినిమాల పరంగా రీసెంట్ గా మోహన్ లాల్ మంచి విజయాలను నమోదు చేస్తున్నాడు. గతంలో వరుస పరాజయాలు ఎదురైనా, ఇటీవల విడుదలైన ఎల్ 2: ఎంపురాన్ , తుడరమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఈ విజయాలతో మోహన్ లాల్ మరోసారి మంచి ఫామ్ లోకి వచ్చాడు. బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయుగా మాత్రమే కాదు, దుబాయ్ లో గోల్డ్ వీసా ఉన్న నటుడిగా మోహన్ లాల్ మరో రికార్డ్ కూడా సాధించాడు.