- Home
- Entertainment
- ఆమె బ్రతికుంటే ఇండియాలోనే టాప్ హీరోయిన్ అయి ఉండేది, సౌందర్య కాదు.. మోహన్ బాబు కామెంట్స్
ఆమె బ్రతికుంటే ఇండియాలోనే టాప్ హీరోయిన్ అయి ఉండేది, సౌందర్య కాదు.. మోహన్ బాబు కామెంట్స్
మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అసెంబ్లీ రౌడీ ఒకటి. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1991 లో విడుదల సంచలన విజయం సాధించింది.
- FB
- TW
- Linkdin
Follow Us

మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ మూవీ
మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అసెంబ్లీ రౌడీ ఒకటి. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1991 లో విడుదల సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో మోహన్ బాబు కామెడీ టైమింగ్ తో కూడిన నటన, సెంటిమెంట్, పొలిటికల్ సన్నివేశాలు, దివ్యభారతి గ్లామర్ హైలెట్ గా నిలిచాయి.
వాస్తు బాగలేని బంగ్లాలో ప్లాన్
ఈ చిత్రం గురించి మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విశేషాలు పంచుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు చెన్నైలోని తన ఆఫీసులో జరిగినట్లు మోహన్ బాబు తెలిపారు. ఆ ఆఫీస్ కి వాస్తు సరిగా లేదని చాలామంది చెప్పేవాళ్ళు. అది పాత బంగ్లా. వాస్తు గురించి చాలా విధాలుగా చెప్పినప్పటికీ నేను ఆ బంగ్లా అని వదిలిపెట్టలేదు.
దివ్య భారతిని వద్దన్నారు
ఇక హీరోయిన్ గా ఈ చిత్రంలో దివ్యభారతిని తీసుకోవాలని అనుకున్నా. అప్పటికే ఆమె తెలుగులో మొదటి చిత్రం మాత్రమే చేస్తుంది. ఆ అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవద్దు.. షూటింగ్ నుంచి త్వరగా వెళ్ళిపోతుంది అని చాలామంది దివ్యభారతి గురించి నెగటివ్ కామెంట్స్ చేశారు. అయినప్పటికీ దివ్యభారతినే హీరోయిన్ గా తీసుకున్నట్లు మోహన్ బాబు తెలిపారు. దివ్యభారతి కనుక బ్రతికి ఉంటే ఇండియాలోనే టాప్ హీరోయిన్ అయి ఉండేది అని మోహన్ బాబు అన్నారు. అంత టాలెంట్, అందం ఆమె సొంతం.
దివ్య భారతితో గొడవలు
కానీ అది ఆ అమ్మాయి తలరాత. చిన్న వయసులోనే మరణించింది అని మోహన్ బాబు అన్నారు. షూటింగ్ సమయంలో ఆ అమ్మాయికి నాకు కొన్ని గొడవలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి లేదు కాబట్టి ఆ గొడవలు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు.
అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ హిట్
ఈ చిత్రంలో మోహన్ బాబు తల్లిదండ్రులుగా జగ్గయ్య, అన్నపూర్ణ నటించారు. జగ్గయ్య పాత్ర కోసం ముందుగా రావు గోపాలరావు గారిని అడిగాం. ఆయన నో చెప్పడంతో ఆ తర్వాత జగ్గయ్య గారిని సంప్రదించడం ఆయన ఓకే చెప్పడం జరిగింది. మొత్తంగా అసెంబ్లీ రౌడీ చిత్రం విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. మోహన్ బాబు కెరీర్ లో మెమొరబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.