MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోతో మూవీ నిర్మించాలనుకుని అతడినే అల్లుడిగా చేసుకున్న డైరెక్టర్ కూతురు..ఆ సంఘటన తెలిసినప్పటికీ..

స్టార్ హీరోతో మూవీ నిర్మించాలనుకుని అతడినే అల్లుడిగా చేసుకున్న డైరెక్టర్ కూతురు..ఆ సంఘటన తెలిసినప్పటికీ..

ఒకప్పటి రచయిత, దర్శకుడు డివి నరసరాజు ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పనిచేశారు. నరసరాజు కుటుంబంతో క్రేజీ హీరో సుమన్ కి అనుబంధం ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 12 2025, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : sumantalwar.blogspot

ఒకప్పటి రచయిత, దర్శకుడు డివి నరసరాజు ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పనిచేశారు. దర్శకుడిగా కంటే ఆయన రచయితగానే ఎక్కువ గుర్తింపు పొందారు. అప్పట్లో యుగంధర్, యమగోల, గుండమ్మ కథ, రంగులరాట్నం, రాజమకుటం, రాముడు భీముడు లాంటి చిత్రాలకు నరసరాజు రచయితగా పనిచేశారు.

నరసరాజు కుటుంబంతో క్రేజీ హీరో సుమన్ కి అనుబంధం ఉంది. నరసరాజు మనవరాలినే సుమన్ వివాహం చేసుకున్నారు. సుమన్ భార్య పేరు శిరీష తల్వార్. ఆమె నరసరాజు కుమార్తె బిడ్డ. శిరీష సుమన్ వివాహం చాలా డ్రమాటిక్ గా జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Facebook/Suman Talwar Hero

నరసరాజు కుమార్తె కవిత.. సుమన్ హీరోగా ఒక చిత్రం నిర్మించాలనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పటికే నాకు నరసరాజు గారితో పరిచయం ఉంది. నా కుమార్తె నీతో సినిమా నిర్మించాలని అనుకుంటోంది. ఒకసారి మీ ఇంటికి వస్తుంది మాట్లాడు అని ఆయన చెప్పారు. నేను ఓకే చెప్పాను. ఆమె మా ఇంటికి వచ్చి ఇలా తనతో సినిమా నిర్మించాలని ఉన్నట్లు చెప్పారు. తప్పకుండా చేస్తాను కానీ దర్శకుడిని మీరే ఎంచుకోండి అని చెప్పాను.

35
Image Credit : Facebook/Suman Talwar Hero

ఆ విధంగా కొన్ని రోజులపాటు సినిమా గురించి మా మధ్య చర్చలు జరిగాయి. నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం.. వాళ్లు మా ఇంటికి రావడం జరుగుతూ ఉండేది. సినిమా అయితే ఆలస్యం అవుతూనే ఉంది కానీ మా రెండు కుటుంబాల మధ్య అనుబంధం బాగా పెరిగింది. అదే టైంలో కవిత తన కుమార్తె శిరీషకి వివాహం చేయాలని అనుకుంటున్నారు.

45
Image Credit : Facebook/Suman Talwar Hero

నా గురించి వాళ్ళకి తెలుసు.. కాబట్టి శిరీషని నాకే ఇచ్చి చేయాలని అనుకున్నారు. పెళ్లి ప్రపోజల్ వాళ్ల నుంచే వచ్చింది. అప్పటికి శిరీష తో నాకు ఎలాంటి పరిచయం లేదు. నా జీవితంలో జరిగిన జైలు సంఘటన గురించి కూడా వాళ్లకి తెలుసు. నేను ఏ తప్పు చేయలేదని వాళ్లు నమ్మారు. అందుకే శిరీష ని నాకు ఇచ్చే వివాహం చేయాలని అనుకున్నారు. మంచి కుటుంబం కావడంతో నేను కూడా ఓకే చెప్పాను అని సుమన్ అన్నారు.

55
Image Credit : News18

ఆసక్తికర విషయం ఏంటంటే సినిమా కోసం మా ప్రయాణం మొదలైంది. కానీ ఆ సినిమా అసలు ప్రారంభంకానే లేదు. ఆమె కుమార్తెతో పెళ్లి మాత్రం జరిగింది. నాతో సినిమా నిర్మించాలని అనుకున్న కవిత గారు నన్ను అల్లుడుగా చేసుకున్నారు అని సుమన్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నీకీ గతికి ఆ దేవుడే కారణం, ముఖేష్‌పై వంశీ ఫైర్‌.. ఎలిమినేషన్‌ నుంచి జస్ట్ మిస్‌ ఎవరంటే?
Recommended image2
Jason Sanjay: `సిగ్మా` డిజాస్టర్‌ ఎఫెక్ట్.. హీరోగా విజయ్‌ కొడుకు జాసన్‌ సంజయ్‌, డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image3
Bigg Boss 10: ఎనిమిదో వారం ఓటింగ్‌.. ఈ వారం బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరు?
Related Stories
Recommended image1
ప్రభాస్ కి ఇష్టంలేని రాజమౌళి సినిమా ఏంటో తెలుసా.. అదే హీరోతో మరో మూవీ చేస్తే మెంటలెక్కిందట
Recommended image2
ఆ హీరోయిన్ తో జీవితంలో నటించకూడదు అనుకున్న ఎన్టీఆర్, ఏఎన్నార్..ఆమె లేకుంటే ఈ చిత్రాల పరిస్థితి అంతే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved