- Home
- Entertainment
- ENE 2: విమర్శలకు సమాధానం చెబుతూ, అనుమానాలను బ్రేక్ చేసిన శ్రీనాథ్ మాగంటి.. ఇకపై హీరోగా
ENE 2: విమర్శలకు సమాధానం చెబుతూ, అనుమానాలను బ్రేక్ చేసిన శ్రీనాథ్ మాగంటి.. ఇకపై హీరోగా
క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా రాణిస్తోన్న శ్రీనాథ్ మాగంటి ఆ మధ్య హీరోగా నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు `ఈ నగరానికి ఏమైంది రిపీట్`లో కార్తీక్‌గా దుమ్ములేపాడు. విమర్శకుల ప్రశంసలందుకుంటున్నాడు.

హీరోగా మెప్పించిన శ్రీనాథ్ మాగంటి
శ్రీనాథ్ మాగంటి.. ఒక్కో సినిమాతో తానేంటో నిరూపించుకుంటున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ని ప్రారంభించి సోలో హీరోగా ఎదుగుతున్నాడు. ఓ వైపు క్యారెక్టర్స్ చేస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడు హీరోగా నటిస్తున్నాడు. `యానిమల్`, `హిట్` ఫ్రాంఛైజీ, `లక్కీ భాస్కర్`, `ఉస్తాద్ భగత్ సింగ్` వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. `మేన్షన్ హౌజ్ మల్లేష్`లో సోలో హీరోగా నటించాడు. ఇందులో తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇటీవల ఆయన `ఈ నగరానికి ఏమైంది రిపీట్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
ఈ నగరానికి ఏమైంది 2 లో కార్తీక్‌గా రచ్చ
'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటిని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. మొదట్లో విమర్శలు కూడా వచ్చాయి. సుశాంత్ రెడ్డిని మ్యాచ్ చేస్తాడా?లేదా? అని అందరిలోనూ అనుమానాలుండేవి 'ఈ నగరానికి ఏమైంది' ఫ్యాన్స్ అసలే కార్తిక్ పాత్రలో సుశాంత్‌కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నారు. దీంతో శ్రీనాథ్ ఎలా చేస్తాడు, చేయలేడేమో అనే టాక్ వినిపించింది. అది శ్రీనాథ్‌కి కూడా రిస్క్. ఎందుకంటే ఎక్కడ తేడా కొట్టిన శ్రీనాథ్ మాగంటి ఇమేజ్‌కి కూడా డ్యామేజ్ అవుతుంది.
సుశాంత్ తన వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో ఆ పాత్రలోకి శ్రీనాథ్ రావాల్సి వచ్చింది. తరుణ్ భాస్కర్ లాంటి ప్యాషనేట్ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు శ్రీనాథ్ కూడా ఎదురు చూశాడు. ఫస్ట్ డే షూటింగ్ రోజు ఒక వేళ శ్రీనాథ్ మాగంటి కార్తీక్ పాత్రలో ఇమడకపోపయినా, సంతృప్తి కలగకపోయినా ఇంకో ఆప్షన్‌కి వెళ్దామన్న కోణంలో మేకర్స్ ఉన్నారు. కానీ శ్రీనాథ్ మాత్రం కార్తీక్ పాత్రకు ప్రాణం పోశాడు. సుశాంత్‌ని మ్యాచ్ చేస్తూ కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయాడు. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయాడు.
శ్రీనాథ్, శివాత్మిక ట్రాక్ కూడా పండింది. సినిమా విడుదలకు ముందున్న సందేహాలను శ్రీనాథ్ పటాపంచలు చేసేశాడు. ట్రోలింగ్ చేసిన వారంతా ఇప్పుడు కార్తీక్ పాత్రకు శ్రీనాథ్ న్యాయం చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నా నటనతో సంతృప్తి చెందకపోతే కార్తీక్ పాత్ర కోసం మరొక నటుడిని తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావించారు. కానీ ఈ రోజు, సినిమా విడుదలైంది.
ఇకపై హీరోగా శ్రీనాథ్ మాగంటి
`నేను ఈ సినిమాలో భాగమయ్యాను. అదే నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు’ అని శ్రీనాథ్ ఎమోషనల్ అవుతున్నాడు. 'హిట్', 'యానిమల్' వంటి చిత్రాలలో సైడ్ ఆర్టిస్ట్‌గా మంచి సక్సెస్ అందుకున్న శ్రీనాథ్‌కి ఇప్పుడు ఈ కార్తీక్ పాత్ర, సినిమా విజయంతో మరింత బాధ్యత పెరిగిపోయింది. ఇకపై శ్రీనాథ్ లీడ్ రోల్స్‌తో అందరినీ అలరించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలిపారు శ్రీనాథ్. మరి హీరోగా ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.















