మోహన్‌బాబు అన్న, చిరంజీవి తమ్ముడు.. సినిమా బంపర్ హిట్, కలెక్షన్ కింగ్ ఇదేం ట్విస్ట్?
మోహన్ బాబు, చిరంజీవి ఇండస్ట్రీలో కొన్ని సార్లు ఫ్రెండ్స్ గా ఉంటారు, మరికొన్ని సార్లు శత్రువులుగానూ మారుతారు. కానీ మోహన్ బాబు అన్నగా, చిరంజీవి తమ్ముడిగా మారడం చూశారా?
మోహన్ బాబు మొన్నటి వరకు వివాదాలతో వార్తల్లో నిలిచారు. కొడుకు మంచు మనోజ్ ని ఇంటినుంచి ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేయడం, మరోవైపు మోహన్‌బాబు యూనివర్సిటీలో అవకతవకలను ఆయన బయటపెట్టడం వంటివి పెద్ద వివాదంగా మారాయి. ఈ ఘటనలో అందరు రోడ్డుమీదకు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. మోహన్‌బాబు ఇంటి గేటుని మనోజ్ పగలగొట్టాడు. మోహన్‌బాబు ఆవేశంతో టీవీ రిపోర్టర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటన కేసుల వరకు వెళ్లింది. మరోవైపు మనోజ్, మోహన్‌బాబు ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.
ఓ వైపు ఈ వివాదాలు కొనసాగుతుండగా, మరోవైపు తన పాత సినిమాలకు సంబంధించిన మెమొరీస్ పంచుకుంటున్నారు మోహన్‌బాబు. కొన్ని తమ వివాదాలకు సింక్ అవుతుండగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటున్నాయి. తన ఫేవరేట్ సినిమాల్లోని సీన్లని పోస్ట్ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు మోహన్‌బాబు. సమ్ థింగ్ స్పెషల్‌గా మారుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన `పట్నం వచ్చిన పతివ్రతలు` అనే సినిమా గురించి తన అనుభవాలను, గొప్ప అనుభూతిని పంచుకున్నారు.
మోహన్ బాబు, చిరంజీవి కలిసి చాలా సినిమాలు చేశారు. చిరంజీవి హీరోగా, మోహన్ బాబు నెగటివ్ షేడ్ ఉన్న చిత్రాలు చేసి మెప్పించారు. అదరగొట్టారు. అయితే ఈ ఇద్దరు కలిసి పాజిటివ్ రోల్స్ చేసిన చిత్రాలు కూడా ఉన్నాయి.
అయితే అందులో `పట్నం వచ్చిన పతివ్రతలు` సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. అందుకు కారణం ఇందులో మోహన్ బాబు అన్నగా నటిస్తే, చిరంజీవి తమ్ముడిగా చేశాడు. ఇదే ఈ మూవీ స్పెషల్. అయితే ఇది 1982లో విడుదలై సంచలన విజయం సాధించింది.
ఇందులో మోహన్‌బాబు పంచుకున్న కామెడీ ఏంటంటే ఈ సినిమాలో అటు అన్న మోహన్ బాబు భార్య, ఇటు చిరంజీవి భార్య ఇంటి నుంచి పట్నం పారిపోతారు. ఈ విషయం తెలిసి ఈ ఇద్దరు సంబరాలు చేసుకుంటారు. ఇదేఇందులో హైలైట్‌గా నిలిచింది. దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ, నా సినీ ప్రయాణంలో 1982లో వచ్చిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.
ఎంతో ప్రతిభావంతుడైన మౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నా పాత్ర ఎంతో సంతృప్తిని కలిగించింది. ముఖ్యంగా నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం, ఆయనకు అన్నగా నటించడం ప్రత్యేక అనుభుతిని మిగిల్చింది` అని తెలిపారు మోహన్ బాబు. తన కెరీర్‌లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచి పోతుందని తెలిపారు.
ఇక ఇప్పుడు మోహన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం `కన్నప్ప`లో నటిస్తూ నిర్మిస్తున్నారు. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ వంటి భారీ స్టార్ కాస్టింగ్‌తో ఈ మూవీ రూపొందుతుంది. మరోవైపు చిరంజీవి `విశ్వంభర` సినిమాలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం చిత్రీకరణ దశలో ఉంద. వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.
read more:థియేటర్లో `పుష్ప 2` క్రిస్మస్ సర్‌ప్రైజ్, షాకిచ్చే నిర్ణయం తీసుకున్న టీమ్, ఏం చేయబోతున్నారంటే
also read: ఆడపిల్లని కనాలని ఉంది, కానీ మా ఆయన సహకరించడం లేదు.. అనసూయ బోల్డ్ స్టేట్‌మెంట్