ఆడపిల్లని కనాలని ఉంది, కానీ మా ఆయన సహకరించడం లేదు.. అనసూయ బోల్డ్ స్టేట్‌మెంట్
మాజీ యాంకర్, నటి అనసూయ ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తనకు ఆడబిడ్డని కనాలని ఉందని, కానీ మా ఆయన సహకరించడం లేదంటూ చెప్పి షాకిచ్చింది. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.

యాంకర్ అనసూయ.. తన అసెట్ అయిన యాంకరింగ్‌కి గుడ్ బై చెప్పింది. నటనకు మాత్రమే పరిమితమయ్యింది. జబర్దస్త్ షోకి దాదాపు తొమ్మిదేళ్ల పాటు యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి షో నుంచి తప్పుకుంది.
తనపై వచ్చే డబుల్ మీనింగ్ కామెంట్లు, టీమ్‌లోని కొందరి అత్యుత్సాహం కారణంగా తాను తప్పుకోవాల్సి వచ్చిందని పలు మార్లు చెప్పింది అనసూయ. పిల్లలు పెద్ద అవుతున్నారు కాబట్టి, తనపై చేసే కామెంట్లు వారికి తప్పుగా వెళ్తాయనే ఉద్దేశ్యంతో ఆమె తప్పుకున్నట్టు తెలిపింది.
అనసూయ ఇప్పుడు పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యింది. మధ్యలో కొన్ని రోజులు టీవీ షోలో మెరిసినా, అది తాత్కాలికమే. కానీ పూర్తి స్థాయిలో సినిమాలతోనే అలరించాలని భావిస్తుంది ఈ మాజీ యాంకర్. ఇటీవలే `పుష్ప 2` చిత్రంతో మెప్పించింది.
ఇందులో దాక్షాయణి పాత్రలో మరోసారి అలరించింది. తన మార్క్ ని చూపించింది. అయితే పుష్ప రాజ్ విశ్వరూపం ముందు ఆమె తేలిపోయిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆమె పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలిచ్చింది. ఇందులో తన మనసులోని మాట, తీరని కోరికని బయటపెట్టింది అనసూయ.
తనకు మళ్లీ తల్లిని కావాలని ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆమె వయసు నలభై ఏళ్లు. ఈ సమయంలో మళ్లీ తల్లి కావాలనుకోవడమే ఆశ్చర్యంగా మారింది. అయితే అందుకు ఓ బలమైన కారణం ఉంది. తాను ఆడబిడ్డకి జన్మనివ్వాలని అనుకుంటుందట. తనకు అమ్మాయి కావాలట. ఇంట్లో అమ్మాయి ఉంటే ఆ ఫీలింగ్ వేరే అని, ఆమె చేసే అల్లరి వేరేలా ఉంటుందని, లైఫ్ బ్యాలెన్స్ అవుతుందన్నారు.
అమ్మాయి లేని జీవితమే వేస్ట్ అని చెప్పింది అనసూయ. ఇప్పుడు ఇద్దరు మగపిల్లలు, వాళ్ల భర్త సుశాంక్‌తో కలిసి ముగ్గురు అబ్బాయిలుంటారు. ముగ్గురు మీసాలు గడ్డాలతో ఉంటారు. కూతురు ఉంటే కంట్రోల్‌లో ఉంటారు. ఇళ్లు బ్యాలెన్స్ అవుతుందని, ఇళ్లు చక్కబెట్టాలంటే ఆడపిల్ల ఉండాలని చెప్పింది.
Anasuya Bharadwaj
ఇంత వరకు బాగానే ఉంది, కానీ అమ్మాయిని కనేందుకు తన భర్త సహకరించడం లేదని చెప్పి షాకిచ్చింది అనసూయ. మళ్లీ పిల్లల్ని కనాలంటే కో ఆపరేట్ చేయడం లేదని, నీకేంటే కనేసి వెళ్లిపోతావ్, హాయిగా జాబ్ చేసుకుంటావు. నేనే భరించాలి అంటుంటాడని చెప్పింది.
పాపం అనసూయకి ఆడపిల్లని కనాలని ఉంది, కానీ వాళ్ల భర్త సపోర్ట్ చేయడం లేదంటూ ఓపెన్‌గా ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. అనసూయ ఇంత బోల్డ్ గా రియాక్ట్ కావడంతో ఆమె వీడియో క్లిప్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.
ఇక అనసూయ ఇటీవల వెండితెరపై చాలా రేర్‌గా కనిపిస్తుంది. సినిమాలు లేవా? తగ్గిపోయాయా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు సినిమాలు ఉన్నాయని, షూటింగ్ దశలో ఉన్నాయని, ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవుతాయని తెలిపింది. తాను బిజీగానే ఉన్నట్టు తెలిపింది.
అదే నిజమైతే వచ్చే ఏడాది అనసూయ రచ్చ వేరే లెవెల్‌లో ఉండబోతుందని చెప్పొచ్చు. అయితే క్రేజ్ విషయంలో అనసూయకి టీవీ షోస్ చేసినప్పుడు ఉన్న క్రేజ్ లేదు. `జబర్దస్త్` షోతో నిత్యం ఆడియెన్స్ కి దగ్గరగా ఉండేది, ఏదో రకమైన కంటెంట్ ఇస్తూ వారిని అలరించేది. కానీ ఇప్పుడు అవన్నీ మానేయడంతో అనసూయ క్రేజ్ తగ్గిపోయిందని చెప్పొచ్చు.
Read more: సౌమ్యరావుపై బాడీ షేమింగ్ కామెంట్లు, హైపర్ ఆది వల్లే యాంకర్‌గా తప్పుకుందా?
also read: `విడుదల 2` మూవీ రివ్యూ, రేటింగ్.. విజయ్ సేతుపతి విశ్వరూపం చూపించాడా?