థియేటర్లో `పుష్ప 2` క్రిస్మస్ సర్‌ప్రైజ్, షాకిచ్చే నిర్ణయం తీసుకున్న టీమ్, ఏం చేయబోతున్నారంటే
థియేటర్లో `పుష్ప 2` సినిమా రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. నార్త్ లో ఇది కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అయితే క్రిస్మస్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది `పుష్ప 2` టీమ్.
అల్లు అర్జున్ కేసులు, వివాదాలతో మొన్నటి వరకు వార్తల్లో నిలిచినా, ఆయన నటించిన `పుష్ప 2` మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నార్త్ లో దుమ్మురేపుతుంది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1500కోట్లు దాటిందని టీమ్ వెల్లడించింది. వాస్తవంగా 20-30శాతం కలెక్షన్లు తక్కువగా ఉంటాయని ట్రేడ్ వర్గాల టాక్.
ఈ మూవీ నార్త్ లో హిట్, సౌత్‌లో మాత్రం జస్ట్ యావరేజ్‌గా నిలిచింది. చాలా చోట్ల ఇప్పటికే డల్ అయిపోయింది. కానీ హిందీ మార్కెట్‌లో మాత్రం సినిమా బ్రేకుల్లేకుండా దూసుకుపోతుంది. అక్కడి ఆడియెన్స్ సినిమాని తెగ చూస్తున్నారు.
బిహార్, ఛత్తీస్‌ఘర్, జార్ఖండ్, బెంగాల్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర బెల్ట్ మొత్తం ఈ మూవీని బాగా చూస్తున్నారట. అందుకే బాలీవుడ్ సినిమాల రికార్డులన్నింటిని బ్రేక్ చేసి సరికొత్త సంచలనం దిశగా వెళ్తుంది.
నార్త్ ఆడియెన్స్ నుంచి వస్తోన్న స్పందన చూసి టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ క్రమంలో ఆడియెన్స్ కి మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. కొత్తగా సినిమాని మళ్లీ రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే సినిమా థియేటర్లో ఆడుతుంది. కానీ క్రిస్మస్‌కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతుందట. థియేటర్లో సర్‌ప్రైజ్ చేయబోతుందట.
మరి ఇంతకి టీమ్ ఏం చేయబోతుందంటే సినిమా నిడివిని పెంచుతున్నారట. ప్రస్తుతం `పుష్ప 2` సినిమా నిడివి మూడు గంటల 20 నిమిషాలు. బ్రేక్‌తో కలిపి మూడున్నర గంటలు. దీనికి ఇప్పుడు మరో 20 నిమిషాల సన్నివేశాలను కలపబోతున్నారట.
అంటే సుమారు 18 నిమిషాల సీన్లని సినిమాకి యాడ్ చేస్తున్నారు. క్రిస్మస్ నుంచి ఈ సీన్లు యాడ్ అవుతాయట. ఇందులో పలు కీలక సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయని సమాచారం. ఇది పుష్ప ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్‌ప్రైజ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కొత్తగా కలిపే సీన్లతో ఇకపై `పుష్ప 2` మూవీ మూడు గంటల 38 నిమిషాలు ఉండబోతుంది. బ్రేక్‌తో కలిపి మూడు గంటల యాభై నిమిషాల వరకు వస్తుంది. ఇదే నిజమైతే ఇటీవల కాలంలో వచ్చిన అత్యంత లాంగెస్ట్ ఫిల్మ్ గా `పుష్ప 2` నిలవబోతుంది. ఇక సినిమా సరికొత్త రికార్డుల దిశగా వెళ్తుంది. ఇప్పటికే హిందీ బెల్ట్ లో అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయి.
ఇక మిగిలింది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతయ సినిమాల రికార్డులు బ్రేక్ చేయడమే. రెండు వేల కోట్లతో `దంగల్`, 1800 కోట్లతో `బాహుబలి 2` టాప్‌లో ఉన్నాయి. మరి పూర్తి రన్‌లో వాటి రికార్డులను `పుష్ప 2` బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ ఒక స్ట్రాటజీ ప్రకారమే వెళ్లారు. ఆయన చాలా సీన్లు నార్త్ ఆడియెన్స్ కోసమే డిజైన్ చేశారు. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తాన్ని నార్త్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకునే చేశారట. జాతర సీన్లు, క్లైమాక్స్ ఫైట్ సీన్లు అక్కడి కల్చర్‌కి దగ్గరగా ఉంటాయి.
మరోవైపు పుష్ప రాజ్‌గా బన్నీ లుక్ కూడా నార్త్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా, పాన్ నమలడం, డైలాగులు చెప్పే విధానం అన్నీ వారికి నచ్చేలానే చేశారు బన్నీ. దర్శకుడు సుకుమార్‌తో కలిసి ఓ ప్లాన్ ప్రకారమే చేసిన పని అని టీమ్ చెబుతుంది. అందుకే నార్త్ వారికి ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. వాళ్లూ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.
read more: ఆడపిల్లని కనాలని ఉంది, కానీ మా ఆయన సహకరించడం లేదు.. అనసూయ బోల్డ్ స్టేట్‌మెంట్
also read: సౌమ్యరావుపై బాడీ షేమింగ్ కామెంట్లు, హైపర్ ఆది వల్లే యాంకర్‌గా తప్పుకుందా?