- Home
- Entertainment
- చిరంజీవి తొత్తువి నువ్వు, పరిటాల రవి ముందే నటుడికి మోహన్ బాబు వార్నింగ్.. గొడవ ఎలా మొదలైందంటే
చిరంజీవి తొత్తువి నువ్వు, పరిటాల రవి ముందే నటుడికి మోహన్ బాబు వార్నింగ్.. గొడవ ఎలా మొదలైందంటే
మోహన్ బాబు, దివంగత రాజకీయ నేత పరిటాల రవి మధ్య మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత చరిత్ర ఆధారంగా 'శ్రీరాములయ్య' అనే చిత్రంలో నటించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మోహన్ బాబుపై శివాజీ రాజా కామెంట్స్
మోహన్ బాబు, దివంగత రాజకీయ నేత పరిటాల రవి మధ్య మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత చరిత్ర ఆధారంగా 'శ్రీరాములయ్య' అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో నందమూరి హరికృష్ణ, సౌందర్య కూడా నటించారు.
అయితే టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా తనకి మోహన్ బాబుతో ఉన్న అనుబంధం, విభేదాల గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి నేను, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, కొంతమంది నటులం కలిసి బ్రహ్మానందం పేరుపై చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాం. ఆ ట్రస్ట్ కి సంబంధించిన డబ్బులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బులు వ్యవహారాన్ని పరిష్కరించమని నాకే చెప్పారు. దీంతో ఆ వ్యవహారం గొడవకు దారితీసింది. దాసరి నారాయణరావు గారు ఇన్వాల్వ్ అయ్యి సమస్యను పరిష్కరించారు.
మోహన్ బాబు దగ్గరకు వివాదం
ఈ విషయం మోహన్ బాబు దగ్గరకు వెళ్ళింది. మోహన్ బాబుతో నాకు అంతగా పరిచయం లేదు. ఆయన సినిమాలో నేను ఎప్పుడూ నటించలేదు. కానీ ఆయనంటే నాకు ఇష్టం ఉంది. ఈ గొడవ గురించి తెలుసుకున్న మోహన్ బాబు ఫోన్ చేసి తమ్ముడు ఒకసారి రామానాయుడు స్టూడియోకి రా అని పిలిచారు. డబ్బింగ్ చెబుతున్నాను.. అయిపోయాక వస్తానని చెప్పా. డబ్బింగ్ పూర్తయ్యాక అక్కడికి వెళ్లాను. నాకు తెలిసిన వాళ్లు మ్యాటర్ చాలా సీరియస్ అని చెప్పారు. కానీ నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు. వార్నింగ్ ఇస్తారేమో.. నేను జరిగింది నిజయతీగా చెబుదాం అనుకున్నా.
పరిటాల రవి కూడా అక్కడే ఉన్నారు
సెట్లో మోహన్ బాబు తోపాటు నాకు ఇష్టమైన పరిటాల రవి కూడా ఉన్నారు. నేను వెళ్లి కూర్చోగానే పరిటాల రవి నాతో మాట్లాడారు. అప్పటికే అక్కడున్న నా స్నేహితులు కొందరు పరిటాల రవికి నా గురించి మంచిగా చెప్పారు. పరిటాల రవి నాతో ఎందుకమ్మా గొడవలు, నీ గురించి అందరూ ఇక్కడ చాలా మంచిగా చెప్పారు అమ్మా అని అన్నారు. అదంతా అయిపోయిందండి ఇప్పుడేం గొడవలు లేవు అని చెప్పాను.
మోహన్ బాబుకు కూడా నా తప్పేమీ లేదని అక్కడున్న వాళ్ళు చెప్పారు. మోహన్ బాబు షార్ట్ పూర్తి చేసుకుని రాగానే టీ తాగవయ్యా అని అన్నారు. ఏంటయ్యా గొడవలు అని ఆయన కూడా అడిగారు. ఇప్పుడేం లేదు లెండి అంతా సమసిపోయింది అని చెప్పాను. ఓకే సరే ఇక నువ్వు వెళ్లొచ్చు అని చెప్పారు. అలా ఆ వ్యవహారం స్మూత్ గా ముగిసింది అని శివాజీ రాజా తెలిపారు.
శివాజీ రాజాని జనరల్ సెక్రటరీ చేసిన మోహన్ బాబు
నాకు అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ మోహన్ బాబు గారు నన్ను మా అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీని చేశారు. ఆయన వల్లే నేను జనరల్ సెక్రటరీ అయ్యాను. మా అసోసియేషన్ తరపున ఆ టైంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు క్రికెట్ మ్యాచ్ పెట్టాలని మోహన్ బాబు అనుకున్నారు. ఈ విషయం నాకు చెప్పారు. ఆ టైంలోనే 'మా' టీవీ ఛానల్ ని కొత్తగా ప్రారంభించారు. ఆ చానల్ స్థాపించిన మురళీ కృష్ణం రాజును కలిసి సెలబ్రిటీల క్రికెట్ మ్యాచ్ కాబట్టి.. ఛానల్ ఎంత డబ్బు చెల్లిస్తుందో అడగమని చెప్పారు.
మురళీ కృష్ణంరాజుతో మాట్లాడినప్పుడు ఆయన కోటి రూపాయలు వరకు ఇస్తామని చెప్పారు. ఈ విషయం మోహన్ బాబు కి చెప్తే.. కోటి రూపాయలు మాత్రమేనా.. ఏంటి తమ్ముడు నేను మాట్లాడుతాను చూడు అని మురళీకృష్ణ రాజుకి ఫోన్ చేశారు. మోహన్ బాబు ఒకటిన్నర కోటి డిమాండ్ చేశారు. ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. అది మోహన్ బాబు గారి మాటకున్న విలువ అని శివాజీ రాజు తెలిపారు.
శివాజీ రాజా చిరంజీవికి తొత్తు అంటూ మోహన్ బాబు వ్యాఖ్యలు
ఆ తర్వాత మోహన్ బాబు చుట్టూ ఉన్న వాళ్ళు కొందరు ఆయనకి నా గురించి చాడీలు చెప్పడం ప్రారంభించారు. లేనిపోనివి కల్పించి ఆయనకు చెప్పారు. నా వ్యక్తిత్వం తెలిసి కూడా మోహన్ బాబు వాళ్ళ మాటలు నమ్మారేమో నాకు తెలియదు. అప్పటి నుంచి నాతో గ్యాప్ మెయింటెయిన్ చేయడం ప్రారంభించారు. నేను కూడా దూరం జరుగుతూ వచ్చాను. ఒక సందర్భంలో మోహన్ బాబు ఎవరితోనో మాట్లాడుతూ.. శివాజీ రాజా చిరంజీవికి తొత్తు అయ్యా అని అన్నారు. ఆయన అలా ఎందుకన్నారో తెలియదు. ఆ మాట నన్ను చాలా బాధించింది. ఎందుకంటే చిరంజీవి గారితో కూడా నేను ఎప్పుడూ నటించలేదు అని శివాజీ రాజా తెలిపారు. కానీ మోహన్ బాబు గారు నాలాంటి వాడిని ఎందుకు దూరం చేసుకున్నారో తెలియదు అని అన్నారు.