చార్మినార్, నాగార్జున సాగర్‌లో ప్రపంచ అందగత్తెలు సందడి.. బుద్ధవనంలో ప్రార్థనలు
ప్రపంచ అందగత్తెలు హైదరాబాద్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం వీరు అటు చార్మినార్, ఇటు నాగార్జున సాగర్‌ని సందర్శించారు. అక్కడి అందాలను వీక్షించి సందడి చేశారు.

miss world 2025 contestants
ప్రపంచ అందగత్తెలు ఇప్పుడు హైదరాబాద్‌లోనే సందడి చేస్తున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక అయిన విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
miss world 2025 contestants
ఇక ఈ పోటీలో పాల్గొంటున్న సుమారు 110 దేశాల సుందరీమణులు హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ కల్చర్‌ని ఎక్స్ ప్లోర్ చేస్తున్నారు. ఆదివారం వాళ్లు తాటి కల్లు, తాటి ముంజలను రుచి చూశారు. నీరా టేస్ట్ ని ఆస్వాధించారు. ఇక సోమవారం మరింతగా ఎంజాయ్ చేశారు.
miss world 2025 contestants
సుమారు 22 మంది ప్రపంచ అందగత్తెలు హైదరాబాద్‌లో, నాగార్జున సాగర్‌లో సందడి చేశారు. మొదటి ఈ రోజు మధ్యాహ్నం చార్మినార్‌ని వీక్షించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. చార్మినార్ అందాలను తిలకించడంతోపాటు షాపింగ్ చేశారు. కొందరు సుందరీ మణులు మన హైదరాబాద్‌కి ఫేమస్ అయిన మట్టి గాజులను కొనుక్కోవడం విశేషం.
miss world 2025 contestants
అనంతరం నాగార్జున సాగర్‌ని వీక్షించారు. సాగర్‌లోని బుద్దవనం ని 22 మంది ఈ సుందరీమణులు వీక్షించి సందడి చేశారు. ప్రార్థనలు చేశారు. ధ్యానంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ అందగత్తెలు
వీరి టూర్‌కి సంబంధించి, హైదరాబాద్‌లో అందాల పోటీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గట్టి భద్రత ఏర్పాట్లు చేసింది. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వం అన్ని రకాలుగా భారీ స్థాయిలో భద్రతని ఏర్పాటు చేశారు. కమిషనర్ స్థాయిలో అధికారితో ఈ సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం విశేషం.
miss world 2025 contestants
అదే సమయంలో ఈ ప్రపంచ సుందరీ మణులు మన తెలంగాణ కల్చర్‌ని వీక్షిస్తూ ఎక్స్ ప్లోర్ చేయడం విశేషంగా చెప్పొచ్చు. తెలంగాణ సీఎం, ప్రభుత్వం ఈ మేరకు తగిన చర్యలు తీసుకుందని, తగిన ఏర్పాట్లు చేసిందని సమాచారం.
అంతేకాదు తెలంగాణ చేనేత దుస్తులు కూడా ఈ సుందరీమణులు ధరించేలా ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ప్రపంచ అందగత్తెలు మన హైదరాబాద్‌లో, తెలంగాణలో సందడి చేయడం విశేషమనే చెప్పాలి.