- Home
- Entertainment
- ప్రభాస్ 'స్పిరిట్'లో మెగాస్టార్ చిరంజీవి ?.. ఎలాంటి పాత్రో తెలుసా, థియేటర్లు తగలబడిపోతాయి
ప్రభాస్ 'స్పిరిట్'లో మెగాస్టార్ చిరంజీవి ?.. ఎలాంటి పాత్రో తెలుసా, థియేటర్లు తగలబడిపోతాయి
Prabhas Spirit Movie: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’లో చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జోరందుకుంది.

ప్రభాస్ 'స్పిరిట్' మూవీ
టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా చిత్రం ‘స్పిరిట్’ గురించి మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తొలిసారి కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అభిమానుల్లో భారీ క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ప్రభాస్ కి తండ్రిగా చిరంజీవి
ఈ ప్రచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్‌కు తండ్రిగా చిరంజీవి పాత్ర ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో సుమారు 15 నిమిషాల పాటు సాగే కీలక సన్నివేశంలో మెగాస్టార్ ఎంట్రీ ఉండవచ్చని టాక్. చిరంజీవి పాత్రతో కథలో సరికొత్త ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు.
థియేటర్లు హోరెత్తడం ఖాయం
ఇదే విషయంపై గతంలో కూడా ఒకసారి గాసిప్ వినిపించింది. అప్పుడు దాదాపు ఈ వార్తలను ఖండించినట్టే పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ తాజా ప్రచారం ఊపందుకోవడంతో, ఈసారి నిజమయ్యే అవకాశాలపై అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. ఒకే తెరపై ప్రభాస్, చిరంజీవి ఇద్దరూ కనిపిస్తే అది టాలీవుడ్ చరిత్రలోనే ఓ ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభాస్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా ఈ వార్తతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. ప్రభాస్, చిరంజీవి ఒకేసారి స్క్రీన్ పై పవర్ ఫుల్ గా కనిపిస్తే థియేటర్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే.
ఫస్ట్ లుక్ పోస్టర్ కి క్రేజీ రెస్పాన్స్
ఇదిలా ఉండగా, గత న్యూ ఇయర్ సందర్భంగా ‘స్పిరిట్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో ప్రభాస్ కెమెరాకు వెనుకవైపు తిరిగి నిలబడి కనిపించారు. ఆ ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. సోషల్ మీడియా లో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ పోస్టర్‌కు భారీ స్పందన లభించింది. ప్రభాస్ లుక్, పోస్టర్ డిజైన్, బ్యాక్‌డ్రాప్ అన్నీ కూడా సినిమా తీవ్రతను సూచిస్తున్నాయని విశ్లేషణలు వచ్చాయి.
పాన్ వరల్డ్ మూవీగా స్పిరిట్
‘స్పిరిట్’ సినిమాను సందీప్ రెడ్డి వంగా స్వయంగా రచించి, దర్శకత్వం వహించి, ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో తన ప్రత్యేక శైలిని నిరూపించుకున్న వంగా, ఈసారి ప్రభాస్‌తో ఎలాంటి కథ చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను విడుదల చేయాలన్న లక్ష్యంతో, ‘స్పిరిట్’ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

