MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • సౌందర్య చనిపోయింది అంటే కనీసం స్పందించని హీరో ఒక్కరే.. సంబంధం అంటగట్టేస్తారా ?

సౌందర్య చనిపోయింది అంటే కనీసం స్పందించని హీరో ఒక్కరే.. సంబంధం అంటగట్టేస్తారా ?

Soundarya: సౌందర్య మరణ వార్తతో చిత్ర పరిశ్రమ మొత్తం అప్పట్లో ఉలిక్కి పడింది. కానీ ఒక్క స్టార్ హీరో మాత్రం స్పందించలేదు. దానికి కారణం ఆ హీరో వివరించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 26 2026, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సౌందర్య మరణం
Image Credit : Asianet News

సౌందర్య మరణం

మహానటి సావిత్రి తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ లో అంతటి మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నటి సౌందర్య. అతి తక్కువ కాలంలో దాదాపు 100 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులని సౌందర్య అలరించారు. అగ్ర హీరోలందరితో సౌందర్య నటించారు. కానీ 2004లో దురదృష్టవశాత్తూ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిత్ర పరిశ్రమలో విషాదం
Image Credit : MAA TV

చిత్ర పరిశ్రమలో విషాదం

సౌందర్య మరణంతో చిత్ర పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడింది. ఆమె సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆమె నటించిన వారంతా విషాదం వ్యక్తం చేస్తూ స్పందించారు. కానీ ఒక్క హీరో తప్ప సౌందర్య మరణం గురించి స్పందించలేదు. తనకి స్పందించాలని అనిపించలేదని అన్నారు. పైగా ఆ హీరో సౌందర్యతో చాలా చిత్రాల్లో నటించారు. 

Related Articles

Related image1
OTT Movies: 1000 కోట్ల పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి, శ్రీకాంత్ కొడుకు రోషన్ మూవీ కూడా.. ఈ వారం పండగే
Related image2
Eesha Rebba: డైరెక్టర్ తో ఈషా రెబ్బా రిలేషన్ షిప్, త్వరలో పెళ్లి.. ఒకరిని చూస్తున్నా అంటూ కంఫర్మ్ చేసిన నటి
35
జగపతి బాబు మాత్రం స్పందించలేదు
Image Credit : actress.soundarya/Instagram

జగపతి బాబు మాత్రం స్పందించలేదు

వాళ్ళిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. జగపతి బాబు. ఆయన ఓ ఇంటర్వ్యూలో సౌందర్య డెత్ గురించి మాట్లాడారు. సౌందర్య మరణించినప్పుడు నేను మలేషియాలో ఉన్నాను. సౌందర్య చనిపోయినట్లు నాకు ఫోన్ వచ్చింది. నాకు ఆమె మరణం గురించి స్పందించాలని అస్సలు అనిపించలేదు. ఆ టైంలో నేను ఆలోచించింది ఒక్కటే.. సౌందర్య బ్రదర్ అమర్ పరిస్థితి ఏంటి ? ఎలా ఉన్నాడు ? అని మాత్రమే ఆలోచించా. నేను నమ్మేది ఒక్కటే ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే. కానీ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని మాత్రం ఆలోచించాను. 

45
సౌందర్య గురించి ఆలోచించలేదు కానీ..
Image Credit : our own

సౌందర్య గురించి ఆలోచించలేదు కానీ..

ఆ టైంలో నా మైండ్ లో సౌందర్య మరణం కంటే.. ఆమె బ్రదర్ అమర్.. వాళ్ళ అమ్మ నాన్న, ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళందరి పరిస్థితి ఏంటి ? వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అని మాత్రమే ఆలోచించా. అంతకు ముందు నాకు, సౌందర్యకి సంబంధం అంటగట్టారు. సౌందర్య అంటే నాకు ఇష్టం ఉంది, మంచి ఫ్రెండ్ అంత వరకు మాత్రమే. 

55
దర్శకుడి కోసం వెళితే..
Image Credit : instagram

దర్శకుడి కోసం వెళితే..

ఒకరోజు డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి రైల్వేస్టేషన్ కి వెళ్ళా. అదే ట్రైన్ లో సౌందర్య కూడా వచ్చింది. అంతే మీడియా మొత్తం నేను సౌందర్య కోసమే వెళ్లానని.. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాసేశారు. ఆ వార్తలు చూసి చాలా కోపం వచ్చింది అని జగపతి బాబు తెలిపారు. ఆ రోజు సౌందర్య మరణించినప్పుడు నేను ముందుగా అడిగింది వాళ్ళ బ్రదర్ అమర్ గురించే. అంటే నాకు అమర్ తో కూడా సంబంధం అంటగట్టేస్తారా అని జగపతి బాబు ప్రశ్నించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
సౌందర్య
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
OTT Movies: 1000 కోట్ల పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి, శ్రీకాంత్ కొడుకు రోషన్ మూవీ కూడా.. ఈ వారం పండగే
Recommended image2
Eesha Rebba: డైరెక్టర్ తో ఈషా రెబ్బా రిలేషన్ షిప్, త్వరలో పెళ్లి.. ఒకరిని చూస్తున్నా అంటూ కంఫర్మ్ చేసిన నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved