MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: ఆ కమెడియన్ వల్లే రాంచరణ్ మూవీ హిట్ అవుతుంది, ఒక్క సీన్ కూడా కట్ చేయొద్దు.. తెగేసి చెప్పిన చిరు

Chiranjeevi: ఆ కమెడియన్ వల్లే రాంచరణ్ మూవీ హిట్ అవుతుంది, ఒక్క సీన్ కూడా కట్ చేయొద్దు.. తెగేసి చెప్పిన చిరు

రాంచరణ్ నటించిన హిట్ మూవీ ఓ నటుడి జాతకమే మార్చేసింది. ఆ కమెడియన్ వల్లే సినిమా హిట్ అవుతుంది అని చిరంజీవి రషెస్ చూసి చెప్పారట. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 18 2026, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan
Image Credit : Asianet News

Ram Charan

ఏ నటుడికైనా సరైన సినిమా ఒక్కటి పడితే చాలు జాతకమే మారిపోతుంది. పాపులర్ అయిన ప్రతి నటుడి కెరీర్ లో అలాంటి సినిమా ఒకటుంటుంది. పోసాని కృష్ణ మురళి రచయితగా, నటుడిగా గుర్తింపు పొందారు. చాలా కాలంగా సినిమాల్లో ఆయన చిన్న వేషాలు వేస్తున్నారు. కానీ పోసానికి నటుడిగా బ్రేక్ ఇచ్చింది మాత్రం రాంచరణ్ నాయక్ మూవీనే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిన్న పాత్రని సెకండాఫ్ మొత్తం ఉండేలా..
Image Credit : google

చిన్న పాత్రని సెకండాఫ్ మొత్తం ఉండేలా..

ఆ మూవీలో పోసాని కామెడీ రౌడీగా నటించారు. వాస్తవానికి నాయక్ మూవీలో ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం పోసానిది చాలా చిన్న పాత్ర. రెండు మూడు రోజులు షూటింగ్ చేస్తే సరిపోతుంది. కానీ అనూహ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం తన పాత్ర ఉండేలా వివి వినాయక్ మార్చేశారట. దీని గురించి పోసాని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
పడీ పడీ నవ్వారు
Image Credit : Asianet News

పడీ పడీ నవ్వారు

ఆ టైంలో నాకు యాక్టింగ్ పై అంతగా ఆసక్తి లేదు. ఏవో కొన్ని సినిమాలు చేస్తున్నా అంతే. శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంటే వివి వినాయక్ ఫోన్ చేశారు. వినాయక్ చాలా మంచి వ్యక్తి. రాంచరణ్ మూవీలో 3 రోజుల పాత్ర ఉంది, వచ్చి చేసిపో అని రిక్వస్ట్ చేశాడు. సరే అని వెళ్ళాను. ఫస్ట్ రోజు షూటింగ్ లో నా డైలాగులకు కెమెరామెన్ చోటా కె నాయుడు, వివి వినాయక్ అదే విధంగా సెట్ లో ఉన్న వారంతా పగలబడి నవ్వారు.

45
చిరంజీవి గారికి చూపించారు
Image Credit : X

చిరంజీవి గారికి చూపించారు

ఆ తర్వాత రషెష్ కూడా చూసి నవ్వుతూనే ఉన్నారు. అప్పుడు వివి వినాయక్ ఈ పాత్ర సెకండ్ హాఫ్ మొత్తం ఉండాల్సిందే. ఏం చేస్తావో చేయి అని రైటర్ ఆకుల శివకి చెప్పారు. ఆ విధంగా 3 రోజుల పాత్ర కాస్త 13 రోజుల పాత్ర అయింది. వివి వినాయక్ నా సన్నివేశాల రషెష్ ని చిరంజీవి గారికి కూడా చూపించారు. ఆయన రిపీట్ గా చూస్తూ నవ్వారు.

55
ఒక్క సీన్ కూడా కట్ చేయొద్దు
Image Credit : our own

ఒక్క సీన్ కూడా కట్ చేయొద్దు

నా సీన్లు చూసిన తర్వాత చిరంజీవి గారు వినాయక్, రాంచరణ్ తో చెప్పారట. పోసాని సీన్లు ఒక్కటి కూడా కట్ చేయడానికి వీల్లేదు. ఈ సీన్ల వల్లే సినిమా హిట్ అవుతుంది అని అన్నారు. చిరంజీవి మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా రిలీజ్ అయ్యాక నాయక్ మూవీ హిట్ కావడానికి ప్రధాన కారణం నేనే అని చాలా మంది చెప్పారు. నాయక్ రిలీజ్ అయిన వారంలో నేను 36 సినిమాలకు సైన్ చేశాను. ఆ సినిమాలేంటో మర్చిపోతానని పేపర్ లో రాసుకునేవాడిని అని పోసాని తెలిపారు. కొందరు నిర్మాతలు అయితే ఒక రోజులు రూ.2 లక్షలు ఇస్తాం, డేట్లు ఇవ్వండి అని కూడా రిక్వస్ట్ చేసినట్లు పోసాని తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dakkshi: కాస్టింగ్ కౌచ్ కష్టాలు దాటుకుని ఆర్జీవీ సినిమాలో ఛాన్స్.. బిగ్ బాస్ లోకి కరోనా వైరస్ బ్యూటీ దక్షి
Recommended image2
Shivakumar Marihal: బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్ ప్రియుడు, షాలినీకి ఇచ్చిపడేసిన శివకుమార్
Recommended image3
Rakul Preet Singh: రాంచరణ్ సినిమా నుంచి అజయ్ దేవగన్ మూవీ వరకు.. రకుల్ కెరీర్ లో టాప్ 10 బెస్ట్ రోల్స్ ఇవే
Related Stories
Recommended image1
Pavitra Lokesh: సీనియర్ నటుడితో పవిత్ర లోకేష్ ఐటెం సాంగ్, అక్రమ సంబంధాలు పెట్టుకునే అమ్మాయిలే హీరో టార్గెట్
Recommended image2
Chiranjeevi: రాజకీయాల్లోకి రావాలనే కోరిక చిరంజీవికి ఎప్పుడు కలిగింది ? ఎట్టకేలకు బయటపెట్టిన డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved