MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pavitra Lokesh: సీనియర్ నటుడితో పవిత్ర లోకేష్ ఐటెం సాంగ్, అక్రమ సంబంధాలు పెట్టుకునే అమ్మాయిలే హీరో టార్గెట్

Pavitra Lokesh: సీనియర్ నటుడితో పవిత్ర లోకేష్ ఐటెం సాంగ్, అక్రమ సంబంధాలు పెట్టుకునే అమ్మాయిలే హీరో టార్గెట్

పవిత్ర లోకేష్ గతంలో హీరోయిన్ గా రాణించారు. కన్నడ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేశారు. ఓ చిత్రంలో పవిత్ర లోకేష్ ఏకంగా ఐటెం సాంగ్ లో కూడా మెరిశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 18 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pavitra Lokesh
Image Credit : Asianet News

Pavitra Lokesh

నటి పవిత్ర లోకేష్ గురించి పరిచయం అవసరం లేదు. గతంలో ఆమె వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. పవిత్ర లోకేష్ గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు సుచేంద్ర నుంచి కూడా పవిత్ర లోకేష్ విడిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నరేష్ తో పవిత్ర లోకేష్ పెళ్లి
Image Credit : Asianet News

నరేష్ తో పవిత్ర లోకేష్ పెళ్లి

ఆ తర్వాత ఆమె తెలుగు నటుడు నరేష్ తో రిలేషన్ షిప్ మొదలుపెట్టడం తీవ్ర వివాదం అయిన సంగతి తెలిసిందే. మీడియాలో పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు వచ్చాయి. కానీ చివరకు నరేష్, పవిత్ర పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పవిత్ర లోకేష్ దశాబ్దాలుగా నటిగా రాణిస్తున్నారు. ఇప్పుడంటే ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు కానీ గతంలో కన్నడలో అనేక చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా రాణించారు.

35
పవిత్ర లోకేష్ చేసిన ఐటెం సాంగ్
Image Credit : Asianet News

పవిత్ర లోకేష్ చేసిన ఐటెం సాంగ్

ప్రస్తుతం తల్లి, అత్త, వదిన పాత్రలు చేస్తున్న పవిత్ర లోకేష్ గతంలో ఐటెం సాంగ్ కూడా చేశారని తెలుసా ? అవును ఆమె ఓ కన్నడ చిత్రంలో అదిరిపోయే ఐటెం సాంగ్ చేశారు. గ్లామరస్ గా కనిపిస్తూ డ్యాన్స్ తో అదరగొట్టారు. 2004లో విడుదలైన కన్నడ చిత్రం 'మోండా'లో పవిత్ర లోకేష్ చిన్న పాత్రలో మెరిసి స్పెషల్ సాంగ్ లో చిందులేశారు. ఇంతకీ ఆ మూవీలో హీరో ఎవరంటే.. డైలాగ్ కింగ్ సాయి కుమార్.

45
సాయి కుమార్ తో ఐటెం సాంగ్ చేసిన పవిత్ర లోకేష్
Image Credit : Asianet News

సాయి కుమార్ తో ఐటెం సాంగ్ చేసిన పవిత్ర లోకేష్

సాయి కుమార్ తెలుగులో ఎంతటి పాపులర్ నటుడో.. కన్నడలో కూడా అంతే పాపులర్. మోండా మూవీలో సాయి కుమార్ సీరియల్ కిల్లర్ గా నటించారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే అమ్మాయిలని హీరో వరుసగా మర్డర్ లు చేస్తుంటాడు. ఈ మూవీలో సాయి కుమార్ అన్నయ్య పోలీస్ అధికారి. ఇంట్లో అన్న వదినలతో సాయి కుమార్ ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళల్ని హతమారుస్తుంటాడు.

55
అక్రమ సంబంధాలు పెట్టుకునే అమ్మాయిలే టార్గెట్
Image Credit : our own

అక్రమ సంబంధాలు పెట్టుకునే అమ్మాయిలే టార్గెట్

ఈ క్రమంలో పవిత్ర లోకేష్ తో సాయి కుమార్ కి పరిచయం ఏర్పడుతుంది. పవిత్ర లోకేష్ ని చూపించగానే ఆమె చాలా సాంప్రదాయంగా భర్తతో అన్యోన్యంగా ఉన్నట్లు చూపిస్తారు. కానీ సాయి కుమార్ ని చూడగానే ఫిదా అయిపోతుంది. ఎలాగైనా అతడిని ముగ్గులోకి దించాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే సాయి కుమార్, పవిత్ర లోకేష్ మధ్య అదిరిపోయే ఐటెం సాంగ్ వస్తుంది. 'బారో వీర జోకుమార' అనే ఈ పాటలో పవిత్ర లోకేష్ గ్లామర్ ఒలకబోసింది. ఆ తర్వాత ఆమెని కూడా సాయి కుమార్ చంపేస్తారు. చివరికి సాయి కుమార్ అన్నయ్యకి డౌట్ వస్తుంది. సాయి కుమార్ ని పట్టుకునేందుకు తన వదినతోనే ట్రాప్ లోకి దించుతారు. ఆ విధంగా సాయి కుమార్ దొరికిపోతాడు. కథ థ్రిల్లింగ్ గా ఉన్నప్పటికీ ఈ చిత్రం విజయం సాధించలేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్
Recommended image2
Mamitha Baiju Salary: ఒకప్పుడు లక్షల్లో.. ఇప్పుడు కోట్లలో.. మమితా బైజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Recommended image3
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Related Stories
Recommended image1
Chiranjeevi: రాజకీయాల్లోకి రావాలనే కోరిక చిరంజీవికి ఎప్పుడు కలిగింది ? ఎట్టకేలకు బయటపెట్టిన డైరెక్టర్
Recommended image2
Sobhan Babu: కారులోనే కన్నీళ్లు పెట్టుకున్న శోభన్ బాబు, మొదటి 2 వారాలు థియేటర్లు ఖాళీ.. కట్ చేస్తే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved