సినిమా కోసం జిమ్ లో కష్టాలు పడుతున్న.. ఈ మెగా యంగ్ హీరోను గుర్తు పట్టారా..?
ప్రస్తుతం పరిస్థితుల్లో హీరోలు కనీసం ఒక్క సారి అయినా సిక్స్ ప్యాక్ చేయకపోతే కష్టం అవుతుంది. ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. అందుకే ఈ మెగా యంగ్ హీరో జిమ్ లో అష్టకష్టాలు పడుతున్నాడు. ఇంతకీ ఈ హీరోను మీరు గుర్తు పట్టారా..?

ఒకప్పుడు కొన్ని సినిమాల్లో కాస్త బొద్దుగా.. చబ్బీగా కనిపించిన మెగా హీరో.. ప్రస్తుతం రాటుదేలిపోతున్నాడు. టోన్డ్ బాడీతో అదరగొడుతున్నాడు. తన సినిమా కోసం తప్పకుండా సిక్స్ ప్యాక్ చేయాలని తపనపడుతున్నాడు. అంతే కాదు ఈ విషయంలో అనుకున్నది సాధించాడు కూడా. జిమ్ లో రోజు కష్టాలు తప్పడంలేదు. ఇంతకీ ఎవరా హీరో అని అనుకుంటున్నారా..?
Also Read: ధనుష్ కేసులో నయనతారకు షాక్, నెట్ ఫ్లిక్స్ కు చుక్కలు చూపించిన హైకోర్టు
ఈ హీరో ఎవరో కాదు మెగా మేనల్లుడు సాయి ధుర్గ తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్. తనకంటూ ఇండస్ట్రీలో డిఫరెంట్ ఇమేజ్ ను సాధించిన సాయి తేజ్.. ఈమధ్య హిట్ సినిమాలు లేక అల్లాడుతున్నాడు. అన్నీ పర్వాలేదు అనిపించే సినిమాలే కావడంతో.. సాయి తేజ్ ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకోసమే గట్టిగా కసరత్తులు చేస్తున్నాడు. ఏం లేకక్క చేయకుండా ఒకటే పనిలో ఉన్నారు.
Also Read: షూటింగ్ లో స్టార్ హీరోయిన్ ని ఏడిపించిన మహేష్ బాబు..?
ఈక్రమంలోనే సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అయ్యింది. అయితే ఈ ఫోటోలో సాయి తేజ్ బాడీ ఒక సైడ్ నుంచి చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బ్రో, విరూపాక్ష లాంటి సినిమాలలో కనిపించిన సాయి తేజ్.. ఇప్పుడు కనిపిస్తున్న సాయి తేజ్ కు ఎక్కడా పోలీక కూడా కనిపించకపోవడంతో షాక్ అవుతున్నారు.
Also Read: విజయ్ దేవరకొండతో డేటింగ్ పై రష్మిక మందన్న ఓపెన్ కామెంట్స్.. ఏమంది ?
ఇక ఈ కసరత్తులన్ని తేజ్ ఎవరికోసం చేస్తున్నాడో తెలుసా...? సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సంబరాల ఏటి గట్టు. ఈ సినిమా కోసం తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పటికే తన బాడీని పూర్తిగా మార్చేశాడు. కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. సంబరాల ఏటి గట్టు టైటిల్ గ్లింప్స్ లో తేజ్ ను చూసి ఫ్యాన్స్ కు పూనకం వచ్చేసింది.
Also Read: విజయ్ కంటే ఆయన భార్య సంగీత ఆస్తులు ఎక్కువా..? దళపతి భార్య సంపాదన ఎంత ..?
కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.