MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా 5 సినిమాలు, మెగా సమ్మర్ కోసం అభిమానుల ఎదురుచూపులు..

మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా 5 సినిమాలు, మెగా సమ్మర్ కోసం అభిమానుల ఎదురుచూపులు..

మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం.. చరణ్ కు కవల పిల్లలు పుట్టడం, మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది.  ఇది ఇక్కడితో ఆగిపోలేదు.. ఈ సమ్మర్ లో మెగా సినిమాల పండగ జరగబోతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 06 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
2026 లో మెగా జాతర..
Image Credit : Asianet News

2026 లో మెగా జాతర..

మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. 2026 ఎంటర్ అవ్వడంతోనే.. సంక్రాంతి సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా హిట్ అవ్వడమే కాదు.. మెగా ఫ్యామిలీకి వారసుడు కూడా రావడంతో.. ఈ ఆనందం రెట్టింపు అయ్యింది.ఇదే కాదు మెగా ఫ్యామిలీలో ముందుంది మెగా పండగా..

26
సమ్మర్ లో మెగా హీరోల సినిమాలు
Image Credit : Instagram/ Sai Dharam Tej

సమ్మర్ లో మెగా హీరోల సినిమాలు

మెగాస్టార్ ఘనవిజయంతో సంక్రాంతి సీజన్ ముగిసింది..ఇక ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం సమ్మర్ సీజన్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే అనేక సినిమాలు వేసవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ సమ్మర్‌లో కూడా మెగా ఫ్యామిలీ ఆధిపత్యమే కనిపించబోతోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు ఒకే సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటం విశేషం.

Related Articles

Related image1
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
Related image2
చిరంజీవి ని తిట్టినందుకు 13 కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, ఎవరిని కొట్టాడో తెలుసా?
36
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేయబోతున్నాడు
Image Credit : Asianet News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేయబోతున్నాడు

ఈ సమ్మర్ సీజన్‌ ను మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిబ్బన్ కట్ చేయబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26 న విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ పెద్ది సినిమాను పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం.

46
రామ్ చరణ్ ఈసారైన హిట్ కొడతాడా?
Image Credit : Asianet News

రామ్ చరణ్ ఈసారైన హిట్ కొడతాడా?

ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక రంగంలోకి దిగనున్నారు. ఆమె నిర్మాతగా రూపొందిన ‘రాకాస’ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌ మలుపుతిప్పుతుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్. గతంలో వరుసగా రెండు ఫెయిల్యూర్స్ చూసిన రామ్ చరణ్ కు ఇప్పుడు హిట్ కొట్టడం అనివార్యం అయ్యింది.

56
విశ్వంభర పై మెగా అభిమానుల ఆశలు..
Image Credit : Instagram/UV Creations

విశ్వంభర పై మెగా అభిమానుల ఆశలు..

మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం విశ్వంభర కూడా ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది. యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా లాస్ట్ ఇయర్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ లో ఉండటం వల్ల పోస్ట్ పొన్ చేశారు. ఇక ఈమూవీని జూలైలో విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్టు సమాచారం.

66
వరుణ్ తేజ్ తాడో పేడో తేల్చుకుంటాడా?
Image Credit : our own

వరుణ్ తేజ్ తాడో పేడో తేల్చుకుంటాడా?

ఇక చాలా కాలంగా హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ కూడా సమ్మర్ సీజన్‌లో విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌లో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈసినిమా కూడా సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. ఇలా ఒకే సమ్మర్ సీజన్‌లో మెగా ఫ్యామిలీ నుంచి ఐదు సినిమాలు విడుదల కావడం టాలీవుడ్‌లో విశేషంగా మారింది. ఇందులో ఏసినిమా హిట్ అవుతుందో తెలియదు కానీ.. మెగా అభిమానులకు మాత్రం పండగ జరగబోతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
Recommended image2
Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1
Recommended image3
Kantara Secret: కాంతారకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా? గూస్‌ బంమ్స్ తెప్పించే విషయం చెప్పిన రిషబ్ శెట్టి
Related Stories
Recommended image1
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
Recommended image2
చిరంజీవి ని తిట్టినందుకు 13 కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, ఎవరిని కొట్టాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved