- Home
- Entertainment
- Meenakshi Chaudhary ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ప్రభాస్ కాదు.. వామ్మో మీనాక్షి కోరికలకు మతిపోవాల్సిందే
Meenakshi Chaudhary ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ప్రభాస్ కాదు.. వామ్మో మీనాక్షి కోరికలకు మతిపోవాల్సిందే
Meenakshi Chaudhary: స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఓ వైపు వరుస సక్సెస్ లు, మరోవైపు మ్యారేజ్ వార్తలతో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆమె తన ఫస్ట్ క్రష్‌ని బయటపెట్టింది.

సంక్రాంతి క్వీన్‌గా మీనాక్షి చౌదరీ
మీనాక్షి చౌదరీ గతేడాది సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో హిట్ అందుకుంది. అప్పుడు వెంకటేష్ సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు `అనగనగా ఒక రాజు` మూవీతో విజయాన్ని అందుకుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఇప్పుడు విజయవంతంగా రన్ అవుతుంది. భారీ వసూళ్లని రాబడుతోంది. దీంతో సంక్రాంతి క్వీన్‌గా మారుతుంది మీనాక్షి.
మ్యారేజ్ రూమర్స్ కి మీనాక్షి చెక్
ఇటీవల మీనాక్షి చౌదరీ మ్యారేజ్ విషయం ఇటీవల చర్చనీయాంశం అయ్యింది. ఆమె హీరోతో లవ్ లో ఉందని, పెళ్లి చేసుకోబోతుందనే వార్తలొచ్చాయి. హీరో సుశాంత్, మీనాక్షి చౌదరీ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ వచ్చిన నేపథ్యంలో ఇటీవలే దీనిపై ఆమె స్పందించింది. అలాంటిదేమీ లేదని, అవి కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పింది. సుశాంత్ మంచి ఫ్రెండ్ అని చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్ అని వెల్లడించింది.
మీనాక్షి చౌదరీ ఫస్ట్ క్రష్
ఈ క్రమంలో మీనాక్షి చౌదరీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె తన ఫస్ట్ క్రష్‌ని వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందే తనకు క్రష్ ఉన్నట్టు చెప్పింది. స్కూల్ టైమ్ లో తనకు క్రష్ ఏర్పడిందని చెప్పింది. తాను 9వ తరగతి చదువుకునే సమయంలో స్కూల్ టీచర్‌పై క్రష్ స్టార్ట్ అయ్యిందట. అయితే ఆ విషయం తన తోటి ఫ్రెండ్స్ కి కూడా తెలియడంతో వారంతా తనని ఆటపట్టించేవారట. అది తనకు బెస్ట్ మెమొరీ అని చెప్పింది.
ప్రభాస్ లాంటి మొగుడు రావాలి
ఇక సినిమాల్లోకి వచ్చాక తన క్రష్‌ని వెల్లడించింది మీనాక్షి. డార్లింగ్ ప్రభాస్‌పై తన ఇష్టాన్ని పంచుకుంది. గతేడాది `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పింది. ప్రభాస్‌లాగా మంచి హైట్ ఉండాలని, అంతే మంచి మనసు ఉండాలని చెప్పింది. ఇంటలిజెంట్‌గా ఉండాలని చెప్పింది. ప్రభాస్ లో ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి, కాబట్టి ప్రభాస్ లాంటి వ్యక్తి భర్తగా రావాలని చెప్పి షాకిచ్చింది మీనాక్షి. మొత్తంగా ప్రభాస్ అయితే బెటర్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది.
కాబోయే భర్తకి ఉండాలని లక్షణాలు బయటపెట్టిన మీనాక్షి
అయితే ఇటీవల మాట మార్చింది మీనాక్షి. `అనగనగా ఒక రాజు` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె తనకు కాబోయే భర్తకి ఉండాల్సిన లక్షణాలు చెబుతూ, వంద ఎకరాల వ్యవసాయం ల్యాండ్ ఉండాలట. మూడు బ్రేకప్స్ అయినా ఫర్వాలేదని, ఇంట్లో పని చేయాలి, బట్టలు ఉతకాలి అని, వంట కూడా చేయాలని చెప్పింది. రాజ్మా తన ఫేవరేట్ డిష్ అని, అది బాగా చేయాలని చెప్పింది. బట్టలు ఉతకడమే కాదు, ఐరన్ కూడా చేయాలని చెప్పింది. జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టమని, అలాంటి ఫ్యామిలీలోని అబ్బాయి అయితే బాగుంటుందని, అదే సమయంలో రోజుకి మూడు గిఫ్ట్స్ ఇచ్చేవాడు కావాలి అని తెలిపింది. ఫైనల్‌గా సినిమాల్లోని వ్యక్తిని, మోడలింగ్ చేసే వ్యక్తిని పెళ్లి చేసుకోనని వెల్లడించింది మీనాక్షి. ఇలా తన కోరికల చిట్టా బయటపెట్టి అందరిని షాక్‌కి గురి చేసింది. ఇలా అయితే ఏఐలోనే అబ్బాయిని క్రియేట్ చేయాలని నవీన్ పొలిశెట్టి పంచ్ వేయడం విశేషం.

