MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Chiru Vs Anil: 2027 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి.. లిస్ట్ లో 6 సినిమాలు, మజా గ్యారెంటీ

Chiru Vs Anil: 2027 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి.. లిస్ట్ లో 6 సినిమాలు, మజా గ్యారెంటీ

Chiru Vs Anil: థియేటర్లలో ప్రస్తుతం సంక్రాంతి సినిమాలు సందడి చేస్తున్నాయి. 2027 సంక్రాంతికి కూడా అప్పుడే బెర్తులు ఖరారు అయ్యాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 18 2026, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
2027 సంక్రాంతి సినిమాలు 
Image Credit : Asianet News

2027 సంక్రాంతి సినిమాలు 

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెంట్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం 250 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అప్పుడే 2027 సంక్రాంతి బెర్తులు కూడా ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది. 2026 సంక్రాంతికి అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో వచ్చారు. 2027 కి మాత్రం చిరంజీవి సినిమాతో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ 2027 సంక్రాంతికి బెర్తులు ఖరారు చేసుకున్నట్లు వార్తలు వస్తున్న సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మెగా 158
Image Credit : Asianet News

మెగా 158

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రెండవ చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. బాబీ, చిరు కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం 2023 సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

37
వెంకీ - అనిల్ 
Image Credit : our own

వెంకీ - అనిల్ 

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తదుపరి చిత్రం నాగార్జునతో ఉండొచ్చు అని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ దిల్ రాజు మరోసారి వెంకీ అనిల్ కాంబో సెట్ చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఇదే జరిగితే వెంకీ అనిల్ చిత్రం మెగా 158తో పోటీ పడాల్సి ఉంటుంది. 

47
శర్వానంద్, మైత్రి మూవీస్ కాంబో
Image Credit : social media

శర్వానంద్, మైత్రి మూవీస్ కాంబో

శర్వానంద్ 39వ చిత్రం మైత్రి మూవీస్ బ్యానర్ లో ఉండబోతోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

57
సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మరో మూవీ
Image Credit : Asianet News

సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మరో మూవీ

ఈ సంక్రాంతికి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి అనగనగా ఒక రాజు చిత్రం రిలీజ్ అయింది. వచ్చే సంక్రాంతికి కూడా ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమాని నాగవంశీ ప్లాన్ చేస్తున్నారట. వివరాలు తెలియాల్సి ఉంది.

67
తేజ సజ్జా - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
Image Credit : Youtube/People Media Factory

తేజ సజ్జా - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, తేజ సజ్జా కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

77
రజినీకాంత్ 173
Image Credit : Instagram

రజినీకాంత్ 173

సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ చిత్రం కూడా 2027 సంక్రాంతి బరిలో ఉంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Recommended image2
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Recommended image3
2 కోట్ల సినిమాకు 100 కోట్ల ఆఫరా? 200 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
Related Stories
Recommended image1
చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులు చెల్లా చెదురు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. శ్రీదేవిని తప్పించాల్సిందే అంటూ
Recommended image2
చిరంజీవి కంటే చంద్రమోహన్ కే క్రేజ్ ఎక్కువ, అతడిని తొలగించండి అంటూ స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. కట్ చేస్తే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved