MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas ని వెంటాడుతున్న బ్యాడ్‌ సెంటిమెంట్‌.. ఏకంగా మూడు సినిమాలు ఫ్టాప్‌.. స్పిరిట్‌ దాన్ని బ్రేక్‌ చేస్తుందా?

Prabhas ని వెంటాడుతున్న బ్యాడ్‌ సెంటిమెంట్‌.. ఏకంగా మూడు సినిమాలు ఫ్టాప్‌.. స్పిరిట్‌ దాన్ని బ్రేక్‌ చేస్తుందా?

ప్రభాస్‌ ని మార్చి నెలకి సంబంధించిన ఒక బ్యాడ్‌ సెంటిమెంట్‌ వెంటాడుతుంది. దీంతో ఇప్పుడిది `స్పిరిట్‌`ని వెంటాడే ప్రమాదం ఉంది. మరి దాన్ని సందీప్‌ రెడ్డి వంగా బ్రేక్‌ చేస్తాడా? అనేది చూడాలి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 17 2026, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫౌజీ, స్పిరిట్‌ చిత్రాలతో బిజీగా ప్రభాస్‌
Image Credit : Asianet News

ఫౌజీ, స్పిరిట్‌ చిత్రాలతో బిజీగా ప్రభాస్‌

ప్రభాస్‌ ఈ సంక్రాంతికి `ది రాజా సాబ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ హర్రర్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు `స్పిరిట్‌` చిత్రం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్పిరిట్‌ పై భారీ అంచనాలు
Image Credit : Spirit Movie\Bhadrakali Pictures Twitter

స్పిరిట్‌ పై భారీ అంచనాలు

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న `స్పిరిట్‌` మూవీ ఇటీవలే ప్రారంభమైంది. `అర్జున్‌ రెడ్డి`, `యానిమల్‌` వంటి చిత్రాలతో సందీప్‌ రెడ్డి వంగా తానేంటో నిరూపించుకున్నారు. ఇండియన్‌ సినిమా మేకింగ్‌ లెక్కలను మార్చేశారు. అలాంటి దర్శకుడితో ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌ ప్రభాస్‌ మూవీ చేస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి భారీ హైప్‌ నెలకొంది.

35
స్పిరిట్‌ రిలీజ్‌ డేట్‌
Image Credit : Asianet News

స్పిరిట్‌ రిలీజ్‌ డేట్‌

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ అదిరిపోయింది. క్రేజీగా ఉంది. ఆ అంచనాలను మరింతగా పెంచింది. దీనికితోపాడు ఈ సంక్రాంతి సందర్భంగా మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు సందీప్‌ రెడ్డి వంగా. సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 5న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభాస్‌ అభిమానులు హ్యాపీ అవుతున్నారు. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

45
ప్రభాస్‌ కి మార్చి నెల బ్యాడ్‌సెంటిమెంట్‌
Image Credit : our own

ప్రభాస్‌ కి మార్చి నెల బ్యాడ్‌సెంటిమెంట్‌

అయితే `స్పిరిట్‌` రిలీజ్‌ డేట్‌ అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. మార్చి నెల ప్రభాస్‌ బ్యాడ్‌సెంటిమెంట్‌గా మారింది. ఈ నెలలో విడుదలైన చిత్రాలు పరాజయం చెందాయి. `రాఘవేంద్ర`, `చక్రం`, `రాధేశ్యామ్‌` చిత్రాలు ఈనెలలోనే విడుదలయ్యాయి. `రాఘవేంద్ర` మూవీ మార్చి 28 2003లో విడుదలయ్యింది. `చక్రం` మార్చి 25 2005లో విడుదలయ్యింది. అలాగే `రాధేశ్యామ్‌` మార్చి 11న 2022లో విడుదలయ్యింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చెందాయి. ఇదే ఇప్పుడు `స్పిరిట్‌`ని కలవరపెడుతుంది. ప్రభాస్‌కి ఉన్న ఈ మార్చి బ్యాడ్‌ సెంటిమెంట్‌ కంటిన్యూ అయితే ఏంటనే ఆలోచనలో పడ్డారు అభిమానులు.

55
ప్రభాస్‌ బ్యాడ్‌ సెంటిమెంట్‌ని స్పిరిట్‌ బ్రేక్‌ చేస్తుందా?
Image Credit : Spirit Movie\Bhadrakali Pictures Twitter

ప్రభాస్‌ బ్యాడ్‌ సెంటిమెంట్‌ని స్పిరిట్‌ బ్రేక్‌ చేస్తుందా?

అయితే అక్కడ ఉన్నది సందీప్‌ రెడ్డి వంగా. అలా జరగానికి వీళ్లేదని, ఇలాంటి బ్యాడ్‌సెంటిమెంట్లు ఆయన్నిఏం చేయలేవని అభిమానులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ మూవీలో డిమ్రీ తృప్తి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మాఫియా నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని సందీప్‌ రెడ్డి వంగా బ్రదర్స్ నిర్మిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
సందీప్ రెడ్డి వంగా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?
Recommended image2
Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌
Recommended image3
Aishwarya Rai Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్ బ్లాక్ డ్రెస్ లుక్ వైరల్.. వైరల్ వీడియో
Related Stories
Recommended image1
MSG: అనిల్‌ రావిపూడి చేసిన పనికి చుట్టాల్లో ఇబ్బంది పడ్డ వెంకటేష్‌ భార్య, చిరంజీవి వద్ద వెంకీ ఆవేదన
Recommended image2
Samantha రికార్డుని బ్రేక్‌ చేసిన తమన్నా.. టాప్‌లో సాయిపల్లవి.. అత్యధిక వ్యూస్‌ సాధించిన టాప్‌ 5 సాంగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved