- Home
- Entertainment
- మంచు మనోజ్ మరో డేరింగ్ స్టెప్.. `మోహన రాగ మ్యూజిక్` పేరుతో సంగీతం ప్రపంచంలోకి ఎంట్రీ
మంచు మనోజ్ మరో డేరింగ్ స్టెప్.. `మోహన రాగ మ్యూజిక్` పేరుతో సంగీతం ప్రపంచంలోకి ఎంట్రీ
మంచు మనోజ్ మరో డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ఆయన హీరో నుంచి విలన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కొత్త జర్నీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. మ్యూజిక్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

మంచు మనోజ్ మరో డేరింగ్ స్టెప్
మంచు మనోజ్ మరో డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ఆయన ఇప్పటికే హీరో నుంచి విలన్‌గా టర్న్ తీసుకున్నారు. `భైరవం`, `మిరాయ్` చిత్రాలతో మెప్పించారు. `మిరాయ్`లో అదిరిపోయే విలనిజం చూపించి మెప్పించారు. విశేష ప్రశంసలు అందుకున్నారు. తాజాగా మరో డేర్ స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మ్యూజిక్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అందులో భాగంగా మంచు మనోజ్ `మోహన రాగ` పేరుతో మ్యూజిక్ లేబుల్‌ని ప్రారంభించారు. లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్ అనే క్యాప్షన్ తో మన సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు మోహన రాగ మ్యూజిక్ లేబుల్ తో తనదైన ప్రయత్నం చేయబోతున్నారు.
మ్యూజిక్ రంగంలోకి మంచు మనోజ్
తాను కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నట్టు శనివారం మంచు మనోజ్ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. సంగీతం మీద తనకున్న ప్రేమే మోహన రాగ మ్యూజిక్ లేబుల్ స్థాపించేలా స్ఫూర్తినిచ్చిందని ఇందులో పేర్కొన్నారు. ఫ్రెష్ సౌండ్స్, బోల్డ్ టాలెంట్, ఫియర్ లెస్ క్రియేటివిటీ తమ మ్యూజిక్ లేబుల్ ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేస్తామని మంచు మనోజ్ తెలిపారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది మంచు మనోజ్ ఫ్యామిలీకి ఒక ఎమోషనల్ మైల్ స్టోన్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు.
మోహన్ బాబు వరసుడిగా ఎంట్రీ ఇచ్చి మంచు మనోజ్
విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు మంచు మనోజ్. బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. ప్రారంభంలో హీరోగా మంచి విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత క్రమంలో పరాజయాలు ఇబ్బంది పెట్టాయి. అదే సమయంలో ఫ్యామిలీ జీవితం పరంగానూ ఇబ్బందులు ఫేస్ చేశాడు. ఆ తర్వాత వాటినుంచి బయటపడి, తాను ప్రేమించిన భూమా మౌనికా రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడం విశేషం. వీరికి ఇటీవలే కూతురు జన్మించింది.
మంచు మనోజ్‌కి సంగీతం అంటే పిచ్చి
ప్రారంభం నుంచి మంచు మనోజ్ జీవితంలో సంగీతం అనేది ఓ అంతర్భాగంగా ఉంటోంది. ఎందుకంటే ‘పోటుగాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయానే..’ పాటను పాడి ప్రేక్షకులను మెప్పించారు. కోవిడ్ సమయంలో అందరినీ ఉత్తేజరపరిచేలా ‘అంతా బాగుంటాంరా’ పాటను విడుదల చేశారు. ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలో ‘పిస్తా పిస్తా.. ’ పాటతో పాటు ‘నేను మీకు తెలుసా’ సినిమాలో ‘ఎన్నో ఎన్నో..’, ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలో ‘ప్రాణం పోయే బాధ..’ పాటలకు సాహిత్యాన్ని అందించారు. ఆయన హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగంతో కూడుకున్న, విలక్షణమైన గాత్రం ఆయనలోని సహజమైన సంగీత ప్రతిభను తెలియజేస్తోంది.
తన సినిమాలకు మ్యూజిక్ డిపార్ట్ మెంట్‌లో వర్క్
తెరపై పాటలు పాడటం, రాయటం వంటి సంగీత సంబంధమైన విషయాలే కాదు.. తెర వెనుక ఎన్నో సేవలను అందించారు. మనోజ్ తన సినీ ప్రయాణంలో తండ్రి డా.మంచు మోహన్ బాబు, అన్నయ్య మంచు విష్ణు, సోదరి లక్ష్మి మంచు చిత్రాలకు సంగీత విభాగంలో వర్క్ చేయటంతో పాటు వారి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ కూడా చేశారు. తన కుటుంబ సభ్యులు నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన పాటలను పాడారు. అంతర్జాతీయ స్థాయిలో తన గుర్తింపును పెంచుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణితో కలిసి హాలీవుడ్ సినిమా ‘బాస్మతి బ్లూస్’కు సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో కెప్టెన్ మార్వెల్ పాత్ర పోషించిన బ్రీ లార్సన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు.
అంతర్జాతీయ కొలాబరేషన్
‘మోహన రాగ మ్యూజిక్’ అనేది కొత్త ఆలోచనలు, భావోద్వేగాలను కలిపే స్టేజ్ కాబోతుంది. ఈ కంపెనీతో మంచు మనోజ్ ఒక కొత్త సృజనాత్మక అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటం, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం..భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పేరుకీ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. తండ్రీ కొడుకులిద్దరికీ అత్యంత ఇష్టమైన రాగం.. మోహన రాగం. ఒరిజినల్ సింగిల్స్, కొలాబ్రేషన్స్, కొత్తరకమైన మ్యూజిక్ ప్రాజెక్ట్స్ ఈ లేబల్ నుంచి రాబోతున్నాయి. మోహన రాగ మ్యూజిక్ కంపెనీతో జరగబోయే అతి పెద్ద ఇంటర్నేషనల్ కొలాబ్రేషన్ గురించి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

