MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుడి అనేది ఇప్పుడు పెద్ద బిజినెస్‌ .. దేవుడిపై రాజమౌళి కామెంట్స్ వివాదం నేపథ్యంలో ఓల్డ్ వీడియో రచ్చ ‌

గుడి అనేది ఇప్పుడు పెద్ద బిజినెస్‌ .. దేవుడిపై రాజమౌళి కామెంట్స్ వివాదం నేపథ్యంలో ఓల్డ్ వీడియో రచ్చ ‌

రాజమౌళి దేవుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన గతంలో దేవుడి గురించి చెప్పి వీడియో వైరల్‌ అవుతుంది. ఇందులో టెంపుల్స్ కమర్షియల్‌గా మారాయని చెప్పడం గమనార్హం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 22 2025, 09:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దేవుడిపై రాజమౌళి కామెంట్స్ వివాదం
Image Credit : Asianet News

దేవుడిపై రాజమౌళి కామెంట్స్ వివాదం

దర్శకధీరుడు రాజమౌళి భారతీయ సినిమా దశ దిశని మార్చిన దర్శకుడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేవుడిని నమ్మను అని ఆయన చాలా సందర్భాల్లో బహిరంగంగానే  స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ `వారణాసి` ఈవెంట్‌లో ఆయన చేసిన ఈ కామెంట్స్ వివాదంగా మారాయి.  `వారణాసి` ట్రైలర్‌ని ప్రదర్శించడానికి టెక్నికల్‌గా సమస్యలు రావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. నాన్న (విజయేంద్రప్రసాద్‌) హనుమంతుడిని నమ్ముతాడు. నా భార్య హనుమంతుడి భక్తురాలు. దేవుడు మన వెనకాల ఉండి నడిపిస్తాడని అంటారు. ఇదేనా నడిపించేదని కోపం వచ్చిందని తెలిపారు రాజమౌళి. ఈ కామెంట్స్ పెద్ద వివాదంగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజమౌళిపై కేసులు
Image Credit : X

రాజమౌళిపై కేసులు

వానరసేన వంటి హిందుత్వ సంస్థలు దీన్ని సీరియస్‌గా తీసుకుని రచ్చ చేస్తున్నాయి. రాజమౌళిపై కేసులు కూడా పెట్టారు. పలువురు బీజేపీ నాయకులు రాజమౌళి కి వార్నింగ్‌ ఇచ్చారు. దేవుడిపై సినిమాలు చేస్తూ దేవుడినే అవమానిస్తావా? అంటూ మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదం గట్టిగానే నడుస్తోంది. అయితే ఇది మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తోన్న `వారణాసి`పై ఎలాంటి ప్రభావం పడుతుందనేది చూడాలి. ఈ మూవీ రావడానికి ఇంకా రెండేళ్లు ఉంది. కాబట్టి అప్పటి వరకు జనం ఈ విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉంది.

35
దేవుడిపై రాజమౌళి ఓల్డ్ వీడియో వైరల్‌
Image Credit : Instagram

దేవుడిపై రాజమౌళి ఓల్డ్ వీడియో వైరల్‌

ఈ క్రమంలో దేవుడికి సంబంధించిన గతంలో రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. ఏబీఎన్‌ రాధాకృష్ణతో ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఆయన దేవుడిపై మాట్లాడుతూ, తాను దేవుడుని నమ్మను అని, కానీ గుడికి వెళ్తానని, అక్కడ ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలని అనిపిస్తుందని తెలిపారు. తాను 4 యోగాల్లో భక్తి యోగాన్ని నమ్ముతానని, కర్మయోగంలో చెప్పినట్టుగా తాను పనిచేసుకుంటూ వెళ్తానని పేర్కొన్నారు. ఇందులో ఆయన ఇంకా మాట్లాడుతూ, మా అమ్మ, నాన్నకి దేవుడిపై చాలా నమ్మకం. మా నాన్న ఇలా చేయు, అలా చేయమని ఏవేవో పద్ధతులు చెబుతుంటాడు. కానీ నేను వినను. మా అమ్మ చెబితే చేస్తాను, కానీ అమ్మ చెప్పదు. బాబుని అప్పుడప్పుడు మంత్రాలయంకి తీసుకెళ్లు అని మా వైఫ్‌కి ఒకసారి చెప్పింది. అమ్మ చెప్పింది కాబట్టి అప్పుడప్పుడు మంత్రాలయం వెళ్తుంటాను` అని తెలిపారు రాజమౌళి.

45
ఇప్పుడు టెంపుల్స్ పెద్ద బిజినెస్‌
Image Credit : jio hotstar

ఇప్పుడు టెంపుల్స్ పెద్ద బిజినెస్‌

అదే సమయంలో తన మెడలో ఉన్న వినాయకుడి లాకెట్‌ 15ఏళ్ల క్రితం తనకు వదిన ఇచ్చిందని  చెప్పారు. రాజమౌళి ఇంకా చెబుతూ, `హిందూ ధర్మంలోనే మనకు, జంతువులకు మధ్య తేడా ఉంది. మనిషిగా పుట్టామంటే మన జీవితానికి ఒక అర్థం ఉండాలి, ఏదో చేయాలి. మన హిందూ ధర్మంలో సంపూర్ణమైన జీవితానికి నాలుగు యోగాలు సూచించారు. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞాన యోగం. ఇందులో ఒక్క భక్తియోగంలోనే దేవుడు ఉన్నాడు, మిగిలిన యోగాల్లో దేవుడు లేడు. హిందూ ధర్మంలోనే నాస్తికత్వం ఉందనేది నా ఉద్దేశ్యం. దీంతో కర్మయోగాన్ని నమ్ముకుని మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. గుడులు కమర్షియల్‌, అందులో డబ్బులు పెట్టడం, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు అడగడం, దానికో రేట్‌, దీనికో రేట్‌ ఇలా ప్రతిదీ కమర్షియల్‌ గా నడుస్తుంది. అదొక పెద్ద బిజినెస్‌ అయ్యింది. అందుకే భక్తి రాదు. ఇప్పుడు కూడా దేవుడిపై నమ్మకం లేకపోయినా ఎవరూ లేనప్పుడు గుడిలో వెళ్లి కూర్చుంటాను, అది చాలా బాగుంటుంది. ఒకసారి మా అన్నయ్య శ్రీశైలం సమీపంలోని బసవేశ్వర ఆలయానికి తీసుకెళ్లారు. సాయంత్రం సమయంలో వెళితే గుడిలో ఎవరూ లేరు, పక్కన నది ప్రవహిస్తుంది, మైక్‌లో మా అన్నయ్య(కీరవాణి) కంపోజ్‌ చేసిన భక్తి ప్రవచనాలు సన్నగా వినిపిస్తున్నాయి. అవి వింటుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. అలాంటి వాతావరణాన్ని కోరుకుంటాను` అని తెలిపారు రాజమౌళి.

55
రామాయణం ఆధారంగా `వారణాసి`
Image Credit : Asianet News

రామాయణం ఆధారంగా `వారణాసి`

ప్రస్తుతం రాజమౌళిపై వివాదం నడుస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియోని వైరల్‌ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇందులోనూ ఆయన దేవుడిని నమ్మను అనే చెప్పాడు, గుడి కమర్షియల్‌గా మారిందని, భక్తి అనేది ఇప్పుడు కమర్షియల్‌గా మారిపోయిందనడం గమనార్హం. ఇక మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తోన్న `వారణాసి` నుంచి టైటిల్‌ గ్లింప్స్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది విజువల్‌ వండర్‌గా ఉంది. రామాయణంలోని ఒక ఘట్టాన్ని ప్రధానంగా చేసుకున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు రాజమౌళి తెలిపారు. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్ తో ఈ మూవీని  రూపొందిస్తున్నారని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. ఇందులో నాలుగు కాలాలను చూపించారు. ఈ నాలుగు కాలల్లోకి మహేష్‌ ప్రయాణిస్తాడని, ఆయన జర్నీ ప్రధానంగా చేసుకుని ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగటివ్ రోల్‌ చేస్తున్నారు. దాదాపు రూ.1200కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. అంతేకాదు  కనీవినీ ఎరుగని రీతిలో సినిమాని విడుదలకు కూడా ప్లాన్‌ చేస్తున్నాడట.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Recommended image3
Sobhita Dhulipala: అద్దం ముందు శోభిత ఫోజులు.. రెడ్ రోజ్ లుక్‌లో గ్లామర్ ట్రీట్!
Related Stories
Recommended image1
బిగ్‌ బాస్‌ 9 తెలుగు 11వ వారం లేటెస్ట్ ఓటింగ్‌.. డేంజర్‌ జోన్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్, ఈమె పక్కా
Recommended image2
బయట సరిపోక బిగ్‌ బాస్‌కి వచ్చావ్‌.. నువ్వు అందరిని వాడుకుంటావ్‌.. హద్దులు మీరి తిట్టుకున్న తనూజ, దివ్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved