MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • చిరంజీవికి తన సినిమాల్లో ఫేవరేట్‌ లుక్‌ ఏంటో తెలుసా? ఇంట్లో స్పెషల్‌ ప్లేస్‌లో పెద్ద ఫ్రేమ్‌

చిరంజీవికి తన సినిమాల్లో ఫేవరేట్‌ లుక్‌ ఏంటో తెలుసా? ఇంట్లో స్పెషల్‌ ప్లేస్‌లో పెద్ద ఫ్రేమ్‌

చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు పోషించారు. కానీ ఆయనకు ఇష్టమైన, ఫేవరేట్‌ లుక్‌ ఏంటో తెలుసా? ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి వెల్లడించారు. ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 22 2025, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సాధారణ నటుడి నుంచి మెగాస్టార్‌గా చిరంజీవి
Image Credit : Asianet News

సాధారణ నటుడి నుంచి మెగాస్టార్‌గా చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి సాధారణ నటుడిగా కెరీర్‌ని ప్రారంభించి స్టార్‌గా, సుప్రీం స్టార్‌గా, మెగాస్టార్‌గా ఎదిగారు. నాలుగున్నర దశాబ్దాల కెరీర్‌లో 156 సినిమాలు చేశారు. ఎన్నో విజయాలు అందుకున్నారు. `ఖైదీ` తర్వాత ఆయన కెరీర్‌ పరుగులు పెట్టిందని చెప్పొచ్చు. దాదాపు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేశారు. తిరుగులేని మెగాస్టార్‌గా రాణించారు. ఇప్పటికీ రాణిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎన్నో వైవిధ్యమైన రోల్స్ చేసిన చిరంజీవి
Image Credit : Asianet News

ఎన్నో వైవిధ్యమైన రోల్స్ చేసిన చిరంజీవి

చిరంజీవి 156 సినిమాల్లో అనేక రకాల పాత్రలు పోషించారు. హీరోగా, విలన్‌గా, సెకండ్‌ లీడ్‌గా చేశారు. అదే సమయలో పోలీసుగా, గ్యాంగ్‌ స్టర్‌గా, కూలీగా, రిక్షావోడిగా, ఆటో డ్రైవర్ గా, బిలియనీర్‌గా, డాక్టర్‌గా, రైతుగా, పొలిటీషియన్‌గా, చివరికి చెప్పులు కుట్టేవాడిగానూ కనిపించారు. ఇలా విభిన్నమైన పాత్రలు, విభిన్నమైన గెటప్స్ తో మెప్పించారు. ఇప్పటికీ డిఫరెంట్‌ లుక్స్ తోనూ ఆకట్టుకుంటూనే ఉన్నారు. మరి ఇన్ని రోల్స్ చేసిన చిరంజీవికి ఇష్టమైన లుక్‌ ఏంటో తెలుసా? తన ఫేవరేట్‌ రోల్‌ ఏంటో రివీల్‌ చేశారు మెగాస్టార్‌.

Related Articles

Related image1
గుడి అనేది ఇప్పుడు పెద్ద బిజినెస్‌ .. దేవుడిపై రాజమౌళి కామెంట్స్ వివాదం నేపథ్యంలో ఓల్డ్ వీడియో రచ్చ ‌
Related image2
ఇమ్మాన్యుయెల్‌ ప్రేమకి గ్రీన్‌ సిగ్నల్‌, ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి.. మాటిచ్చిన అమ్మ
36
చిరంజీవి చేసిన ఏకైక కౌబాయ్‌ మూవీ `కొదమసింహం`
Image Credit : Asianet News

చిరంజీవి చేసిన ఏకైక కౌబాయ్‌ మూవీ `కొదమసింహం`

చిరంజీవి ఎన్నో సినిమాలు చేశారు. అవన్నీ ఓ ఎత్తైతే, `కొదమసింహం` మరో ఎత్తు. ఎందుకంటే చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్‌ మూవీ ఇదే. అంతకు ముందు తెలుగులో సూపర్‌ స్టార్‌ కృష్ణ `మోసగాళ్లకి మోసగాడు` అనే మూవీ చేశారు. సంచలనాలు సృష్టించారు. ఆ తర్వాత చిరంజీవి ఆ సాహసం చేశారు. దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపించడంతో చిరు కాదనలేకపోయారు. స్వతహాగా తనకు కౌబాయ్‌ మూవీస్‌ అంటే ఇష్టమట. అలాంటి సినిమాలు ఎక్కువగా చూసేవాడట. కానీ తాను ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదట. 

46
`కొదమసింహం` ఇష్టమైన మూవీ
Image Credit : Asianet News

`కొదమసింహం` ఇష్టమైన మూవీ

దర్శకుడు మురళీమోహన రావు, కైకాల నాగేశ్వరరావు వచ్చి ఈకథ చెప్పినప్పుడు ఓకే అన్నారు. మేకింగ్‌ పరంగా రిస్క్ అయినా చేశారు. ఆ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. మొదటి వారంలో అన్ని ఏరియాల్లో రికార్డు వసూళ్లని రాబట్టింది. ఓవరాల్‌గా  హిట్‌ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఇదిలా ఉంటే ఈ మూవీలోని కౌబాయ్‌ లుక్‌ తన ఫేవరేట్‌ లుక్‌ అని తెలిపారు చిరంజీవి. `కొదమసింహం` ఈ శుక్రవారం(నవంబర్‌ 21)న రీ రిలీజ్‌ సందర్భంగా ఆయన ఈ సినిమాకి సంబంధించిన మెమొరీస్‌ని పంచుకున్నారు.

56
కౌబాయ్‌ చిరంజీవి ఫేవరేట్‌ రోల్‌
Image Credit : Asianet News

కౌబాయ్‌ చిరంజీవి ఫేవరేట్‌ రోల్‌

అందులో భాగంగా కౌబాయ్‌ లుక్‌ తనకు ఎంతో ఇష్టమైనది అని, తన ఇష్టాన్ని తెలుసుకుని నిర్మాతలు ప్రత్యేకంగా ఫ్రేమ్‌ డిజైన్‌ చేసి తనకు గిఫ్ట్ గా ఇచ్చారని, ఆ ఫ్రేమ్‌ని తన ఇంట్లో స్పెషల్‌ ప్లేస్‌లో పెట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆ ఫ్రేమ్‌ని చూపించారు చిరంజీవి. తనకే కాదు, తనకంటే ఎక్కువగా రామ్‌ చరణ్‌కి ఈ మూవీ చాలా ఇష్టమని, ఈ సినిమా చూస్తూనే భోజనం చేసేవాడని తెలిపారు. ఇందులో తాను గుర్రపుస్వారీ చేసిన నేపథ్యంలో అప్పట్నుంచి హార్స్ రైడింగ్‌ చరణ్‌కి ఇష్టంగా మారిందని, ఇప్పుడు హ్యాబీ అయ్యిందన్నారు.

66
ఫస్ట్ టైమ్‌ గెడ్డంతో నటించిన మూవీ
Image Credit : Asianet News

ఫస్ట్ టైమ్‌ గెడ్డంతో నటించిన మూవీ

ఇక `కొదమసింహం` చిత్రంలో మొదటిసారి గెడ్డంతో కనిపించారు చిరంజీవి. అప్పటి వరకు క్లీన్‌ షేవ్‌తోనే మూవీ చేశారు. గ్లామర్‌గా కనిపించాలంటే క్లీన్‌ షేవ్‌ ఉండాలని అది ఫాలో అయ్యారు. కానీ మొదటసారి కొద్దిపాటి గడ్డంతో చేసిన తొలి చిత్రం ఇదే అని చిరంజీవి పేర్కొన్నారు. శుక్రవారం రీ రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చిరంజీవి `మన శంకరవరప్రసాద్‌ గారు` చిత్రంలో నటిస్తున్నారు. ఇది సంక్రాంతికి విడుదల కాబోతుంది. మరోవైపు `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది. అలాగే బాబీ దర్శకత్వంలో ఓ మూవీ, శ్రీకాంత్‌ ఓడెల డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నారు చిరంజీవి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image3
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Related Stories
Recommended image1
గుడి అనేది ఇప్పుడు పెద్ద బిజినెస్‌ .. దేవుడిపై రాజమౌళి కామెంట్స్ వివాదం నేపథ్యంలో ఓల్డ్ వీడియో రచ్చ ‌
Recommended image2
ఇమ్మాన్యుయెల్‌ ప్రేమకి గ్రీన్‌ సిగ్నల్‌, ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి.. మాటిచ్చిన అమ్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved