- Home
- Entertainment
- రూ.99 టికెట్ రేట్‌తో బాక్సాఫీసు దుమ్ములేపుతున్న విలేజ్ లవ్ స్టోరీ.. రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్లు
రూ.99 టికెట్ రేట్‌తో బాక్సాఫీసు దుమ్ములేపుతున్న విలేజ్ లవ్ స్టోరీ.. రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్లు
ఈ శుక్రవారం విడుదలైన చిత్రాల్లో రాజు వెడ్స్ రాంబాయి మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాదు అతి తక్కువ టికెట్ రేట్లతో బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వసూళు చేసిందనేది తెలుసుకుందాం.

భారీ పోటీలో సత్తా చాటుతున్న `రాజు వెడ్స్ రాంబాయి`
ఈ శుక్రవారం వరుసగా చిన్న సినిమాల సందడి సాగింది. దాదాపు ఆరు చిత్రాలు ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. రెండు రీ రిలీజ్ కూడా ఉన్నాయి. అందులో చిరంజీవి `కొదమసింహం` మూవీ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే వాటిని మించి ఓ మూవీ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతుంది. తక్కువ(రూ.99) టికెట్ రేట్‌తో బాక్సాఫీసుని షేక్ చేస్తోంది. ఆ మూవీనే `రాజు వెడ్స్ రాంబాయి`.
హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీతో `రాజు వెడ్స్ రాంబాయి`
కొత్త హీరోహీరోయిన్లు అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రమే `రాజు వెడ్స్ రాంబాయి`. ఈ మూవీతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై దర్శకుడు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ మూవీని విడుదల చేశారు. విలేజ్ నేపథ్యంలో సాగే హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ ఇది. స్వచ్ఛమైన ప్రేమని అంతే స్వచ్ఛంగా తెరపై ఆవిష్కరించారు. మూవీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.
99 రూపాయల టికెట్ రేట్‌తో రాజు వెడ్స్ రాంబాయి విడుదల
అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ప్రియదర్శి వంటి హీరోల చిత్రాలతో పోటీ పడి ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. దీంతో కొన్ని థియేటర్లలోనే విడుదలైంది. కానీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది. అయితే ఈ మూవీని ఆడియెన్స్ దగ్గరి తీసుకెళ్లేందుకు, ఎక్కువ మంది ఆడియెన్స్ చూసేందుకు టీమ్ సాహసం చేసింది. సింగిల్ థియేటర్లలో కేవలం రూ.99 టికెట్ రేట్‌తోనే ఈ మూవీని విడుదల చేశారు. దీనికి విశేష స్పందన లభిస్తోంది. ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
రాజు వెడ్స్ రాంబాయి ఫస్ట్ డే కలెక్షన్లు
బిగ్ కాంపిటీషన్‌లోనూ, తక్కువ టికెట్ రేట్‌తోనూ ఈ మూవీకికి మంచి వసూళ్లు రావడం విశేషం. ఫస్ట్ డే ఈ మూవీ రూ.1.47కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే రోజు వచ్చిన పెద్ద హీరోల సినిమాలు కూడా కోటి, రెండు కోట్లు వసూలు చేయలేని పరిస్థితుల్లో ఈ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం విశేషం. అంతేకాదు ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లు పెంచుతున్నారు. శనివారం నుంచి మరో వంద థియేటర్లు యాడ్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. నెమ్మదిగా ఈ మూవీ పుంజుకునే అవకాశం ఉంది.
రాజు వెడ్స్ రాంబాయి స్టోరీ ఇదే
వరంగల్‌లో ఇల్లందులోని ఓ విలేజ్‌లో సాగే లవ్ స్టోరీ ఇది. బ్యాండ్ కొట్టే రాజు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే కాంపౌండర్ కూతురు రాంబాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడతారు. వీరి ప్రేమ విషయం ఊరంతా తెలుస్తుంది. రాంబాయి తండ్రి వెళ్లి రాజు ఇంటి వద్ద గొడవ చేస్తాడు. మీరెంతా మీ బతుకులెంతా అంటూ దారుణంగా అవమానిస్తాడు. దీంతో రాజు తండ్రి చనిపోతాడు. కొంత కాలం దూరంగా ఉన్న రాజు మళ్లీ ఊరుకెళ్లగా, ఇద్దరు కలుసుకుంటారు. ప్రేమని కొనసాగిస్తారు. కానీ తమ ప్రేమకి రాంబాయి తండ్రి పెద్ద అడ్డంకిగా మారతాడు, మనుషులను పెట్టి కొట్టిస్తాడు. మరి తమ ప్రేమని గెలిపించుకునేందుకు ఈ ఇద్దరు ఎలాంటి సాహసం చేశారు, రాజుకి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తే తన పరువు పోతుందని భావించిన రాంబాయి తండ్రి ఎంతటి దారుణానికి ఒడిగట్టాడనేదే ఈ మూవీ కథ. ఇందులో రాంబాయి తండ్రిగా హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్న చైతన్య జొన్నలగడ్డ నటించడం విశేషం. స్వచ్ఛమైన ప్రేమ కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 90 కిడ్స్ తమ లైఫ్‌ని, లవ్ స్టోరీని ఈ మూవీలో చూసుకునేలా, మళ్లీ ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లేలా ఉందని చెప్పొచ్చు. ఇది రియల్ లవ్ స్టోరీ కావడం విశేషం.

