- Home
- Entertainment
- శ్రీదేవి ని చూసి షాక్ అయిన మంచు లక్ష్మి, ఇలా చేయడం తన వల్ల కాదంటున్న మోహన్ బాబు కూతురు.
శ్రీదేవి ని చూసి షాక్ అయిన మంచు లక్ష్మి, ఇలా చేయడం తన వల్ల కాదంటున్న మోహన్ బాబు కూతురు.
మంచు లక్ష్మికి శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే శ్రీదేవిని ఓ సందర్భంలో చూసి ఆమె షాక్ అయ్యిందంట. ఇంతకీ అప్పుడు శ్రీదేవి ఎలా కనిపించి ఉంటుంది.

Manchu Lakshmi
టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది మంచు వారి ఆడపడుచు, మోహన్ బాబు కూతుర మంచు లక్ష్మి. టాలీవుడ్ లో తనకు సరైన అవకాశాలు రావడం లేదు అని ముంబయ్ కి షిప్ట్ అయిపోయింది. అక్కడ కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా.. వెబ్ సిరీస్ లు, టెలివిజన్, ఓటీటీ షోస్ చేసుకుంటుంది. ఎలాగైనా బాలీవుడ్ లో ఫేమస్ అవ్వాలని చూస్తోంది మంచు లక్ష్మి.
అయితే ఆమెకు దివంగత హీరోయిన్ శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలా సందర్భాల్లో ఆమె చెప్పింది. అయితే ఆమెకు సబంధించిన మెమోరీలను చాలా సార్లు పంచుకుంది మంచు లక్ష్మి. శ్రీదేవికి సబంధంచిన రేర్ విషయాన్ని రీసెంట్ గా ఓ షోలో వెల్లడించింద మంచు లక్ష్మి. బాలీవుడ్ లో ఆమె బ్యూటీ విత్ లక్ష్మి షోను చేస్తున్నారు. ఈ షోకు బాలీవుడ్ ప్రముఖులు చాలామంది వస్తున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ భార్య మహీషా కపూర్ ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా వీరిమధ్య శ్రీదేవి టాపిక్ చర్చకు వచ్చింది.
Also Read: ప్రభాస్ తమ్ముడు హీరోగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు?
శ్రీదేవి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ.. మంచు లక్ష్మి ఓ విషయాన్ని పంచుకున్నారు. శ్రీదేవిని ఓ సారి జిమ్ లో చూసిందట మంచు లక్ష్మి. అప్పుడు ఆమె ట్రెడ్ మిల్ పైన ఉంది. అక్కడ ఆమె లుక్ ను చూసి షాక్ అయ్యిందట మంచు లక్ష్మి. శ్రీదేవి జుట్టుకు ఒత్తుగా నూనె పెట్టుకుని జిమ్ చేస్తున్నారట. ఈ విషయం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందట. ఎవరో ఏమో అనకుంటారు అని అనుకోకుండా ఆమె తన జుట్టుకోసం అంత నూనె పెట్టుకుని కేర్ తసుకున్నారు.
Also Read: సమంత ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ? అతనితో బ్రేకప్ ఎలా అయ్యింది?
Actress Sridevi
సాధారణంగా సౌత్ హీరోయిన్లు ఇలా జుట్టుకు నూనె పెడతారు. తాను బాలీవుడ్ వెళ్ళినా అలా ఆ అలవాటును వదులుకోలేదు శ్రీదేవి. ఆమె సినిమాల్లో అంత స్టార్ హీరోయిన్ అయినా.. సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతారు. నేను అయితే నాలైఫ్ లో నూనె పెట్టుకోలేదు. అలా పెట్టే ధైర్యం కూడా చేయలేదు. ఎంతైనా శ్రీదేవిగారు చాలా గ్రేట్ అంటూ.. దివంగత నటిని తలుచుకున్నారు మంచు లక్ష్మి.
Also Read: 100 రోజుల్లో సిక్స్ ప్యాక్ , సూర్య డైట్ ప్లాన్ తెలిస్తే మతిపోవాల్సిందే
ఇక ప్రస్తుతం ముంబల్ సెటిల్ అయ్యారు లక్ష్మి. హైదారాబాద్ లో మంచు వారి ఇంట్లో పరిస్థితి ఎలా ఉండో అందరికి తెలిసిందే. మంచువారి అన్నతమ్ములు విష్ణు, మనోజ్ మధ్య ఆస్తి గొడవలు, మోహన్ బాబు కేసులు, ఇలా రచ్చ రచ్చ జరుగుతుంటే.. ఆమె మాత్రం ఇంత వరకూ వీటిపై స్పందించలేదు. హైదరాబాద్ కూడా వచ్చినట్టు కనిపించలేదు. మరి ఈ గొడవలో ఆమె ఏ తమ్ముడివైపు ఉంటారు అనేది కూడా తెలియడం లేదు. ఫ్యామిలీ అంతా వ్యతిరేకించినా.. తన చిన్న తమ్ముడు మనోజ్ పెళ్ళి ఆమె తన ఇంట్లో దగ్గరుండి చేయించారు.