- Home
- Entertainment
- Malavika Mohanan: డైలాగ్స్ చెప్పమంటే ఏబీసీడీలు చదువుతారు.. హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ కామెంట్స్
Malavika Mohanan: డైలాగ్స్ చెప్పమంటే ఏబీసీడీలు చదువుతారు.. హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ కామెంట్స్
Malavika Mohanan: రాాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు చేరువైన హీరోయిన్ మాళవికా మోహనన్. ఆమె తాజాగా.. స్టార్ హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కనీసం డైలాగులు కూడా గుర్తుంచుకోరు అంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

డైలాగులు చెప్పడం కూడా రాదు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాజా సాబ్. ఈ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ మాళవిక మోహనన్. ఆమె తమిళం, మళయాలంలో చాలా సినిమాల్లో నటించారు. అందులో కొన్ని తెలుగులో డబ్ అయ్యాయి కూడా. అయితే.. డైరెక్ట్ గా తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా ఈ రాజాసాబ్. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. చాలా మంది హీరోయిన్లకు కనీసం డైలాగులు చెప్పడం కూడా రాదు అని ఆమె అనడం గమనార్హం.
స్టార్ హీరోయిన్లపై కామెంట్స్...
తమిళ, తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు డైలాగులు కూడా గుర్తుపెట్టుకోరు అని మాళవిక మోహనన్ అన్నారు. డైలాగులు చెప్పమంటే ఏ, బీ, సీ, డీ లు చదువుతారు అని ఆమె అన్నారు. ఎమోషనల్ గా డైలాగులు చెప్పడమంటే… అలాంటి ఎక్స్ ప్రెషన్స్ పెట్టి.. 1, 2, 3, 4, 5 అంటూ నెంబర్లు లెక్కపెపడతారు. అదే.. కోపంగా ఉన్న డైలాగులు చెప్పమంటే.. ఏ,బీ, సీ, డీ అంటారు. తర్వాత డబ్బింగ్ లో లిప్ సింక్ చేస్తారు… అని మాళవిక చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆ హీరోయిన్ ఎవరు..?
‘ఇదేమీ కొత్త విషయం కాదు. చాలా ఏళ్లుగా ఇది జరుగుతోంది. కెరీర్ మొత్తం ఇలా చేసిన వాళ్లు కూడా ఉన్నారు’ అని మాళవిక చెప్పారు. అయితే..ఆమె ఈ మాటలు చెప్పిన తర్వాత ఆ హీరోయిన్ ఎవరై ఉంటారు అంటూ.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
ఇదిలా ఉండగా.. ఆమె నటించిన రాజా సాబ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రస్తుతం ఆమె కార్తీ హీరో గా నటిస్తున్న సర్దార్ 2 మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

