Pushpa:‘పుష్ప’ లీక్, ఈ సీన్లు ఉంటాయని అసలు ఊహించరు
అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్‌లుగా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
‘ఈలోకం మీకు తుపాకి ఇచ్చింది. నాకు గొడ్డలి ఇచ్చింది. ఎవడి యుద్ధం వాడిదే’ అంటున్నాడు పుష్పరాజ్. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ...’ అంటూ అల్లు అర్జున్ వచ్చేసాడు. మరి అతని కథేమిటో తెలియాలంటే ‘పుష్ప’ చిత్రం చూడాల్సిందేఅని జనం ఫిక్సై పోతున్నారు.టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్‌లో పదేళ్ల తర్వాత వస్తున్న చిత్రం 'పుష్ప: ది రైజ్'. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదలైన పాటలు, పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు, మేకింగ్ వీడియో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్‌ను ఊరించి ఊరించి విడుదల చేశారు. ఈ ట్రైలర్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో అల్లు అర్జున్ మాస్ గెటప్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ ట్రైలర్‌పై పలువురు సెలబ్రిటీలు తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో మేజర్ హైలెట్స్ ఏమిటనే విషయమై సినీ జనాలలో చర్చ జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు...
Pushpa trailer: Allu Arjun, Fahadh Faasil promise an epic movie
ఈ సినిమా క్లైమాక్స్ లో సునీల్ ని చంపేసి అల్లు అర్జున్ అతని ప్లేస్ లోకి వస్తాడని, ఆ సీన్ ఒళ్ళు గగుర్పొడుచేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఆ సీన్ లో అనసూయ హైలెట్ అవుతుందని, ఆ తర్వాత అల్లు అర్జున్ ...ఆ అడవికి తానే డాన్ లా ప్రకటించుకుంటాడని, ఆ సీన్స్ అన్నీ అద్బుతంగా వచ్చాయట.
అలాగే ఇంటర్వెల్ ముందు ఓ ఊహించని ట్విస్ట్ ఉంటుందని, కథను అదే పూర్తిగా మలుపుతిప్పుతుందని చెప్తున్నారు. పోలీస్ పాత్ర కూడా ఇక్కడే రివీల్ అవుతుందని చెప్తన్నారు. స్క్రీన్ ప్లే ఇప్పటిదాకా మనం చూడని మ్యాజిక్ ని సుకుమార్ చేసారట. అది కనుక పడింతే ఓ రేంజిలో ఉండబోతోందిట.
Anasuya Bharadwaj
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ బైక్ పై నల్లమల ఫారెస్ట్ లో ...వెనుక రౌడీలు ఛేజ్ చేస్తూంటే తీసిన ఫైటి సీక్వెన్స్ హైలెట్ కానుంది. సుకుమార్ ఈ సీక్వెన్స్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసారట. సినిమా రిలీజ్ అయ్యాక దీన్ని జనం బాగా గుర్తు పెట్టుకుంటారని భావిస్తున్నారు.
pushpa trailer tease
పోలీస్ లు అల్లు అర్జున్ ని పట్టుకుని టార్చర్ పెట్టే సీన్ , చాలా సర్పైజింగ్ గా ఉంటుందిట. అల్లు అర్జున్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ..ఇలాంటి సీన్ లో కనపడతాడని అసలు ఊహించలేము అనుకునేలా ఉండబోతోందిట. పుష్పరాజ్ కి విలన్ ఫహద్ ఫాజిల్ కి మధ్యన ఈ యాక్షన్ సీన్స్ రాగానే ప్రేక్షకులకి గూస్ బంబ్స్ రావడం ఖాయమట
ఇక ఈ సినిమాలో మొదటి నుండి ఫారెస్ట్ ఫైట్ పై భారీ అంచనాలున్నాయి. ఆ సీన్స్ కోసం 6 కోట్ల ఖర్చు పెట్టినట్లుగా చెప్పారు. ఆ యాక్షన్ సీన్ సినిమా కి హైలెట్ అంటూ చెబుతున్నారు.కానీ ఇప్పుడు పుష్ప సినిమాలో మరో ఫైట్ సీన్ ఇండియన్ సినిమా చరిత్రలో ఎవరూ చూపించని విధంగా డిజైన్ చేసారని.. అది బోట్ ఫైట్ అని అంటున్నారు. భారీ బడ్జెట్ తో ఈ బోట్ ఫైట్ థియేటర్లో ప్రేక్షకులు థ్రిల్‌కు గురయ్యేలా చిత్రీకరించారట.
Pushpa movie
ఈ సినిమాలో సమంత ఓ ఐటెం సాంగ్ చేయనున్నారట. ఇందుకు గాను ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పోస్టర్ లో సమంత బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని కనిపిస్తారు. పుష్ప స్పెషల్ సాంగ్ లో సమంత కాస్ట్యూమ్.. “లైలా మే లైలా” సాంగ్ కోసం సన్నీ లియోన్ వేసుకున్న కాస్ట్యూమ్ లా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాట కూడా ఆ స్దాయిలోనే ఉండబోతోంది.
‘తగ్గేదే లే’ అనే ఒకే ఒక డైలాగ్.. ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘ఏయ్ బిడ్డా’ అనే నాలుగు పాటలు.. ‘పుష్ప’ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. చిత్ర వర్గాలు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడా జాబితాలోకి ట్రైలర్ చేరింది. ఈ ట్రైలర్ చిత్రంపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. పాత్రలను తీర్చిదిద్దిన తీరు, అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు విశేషంగా అలరిస్తున్నాయి. నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ఆయువుపట్టుగా నిలిచింది. అల్లు అర్జున్ అభిమానులు కోరుకునే పక్కా కమర్షియల్ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నట్టు కనిపిస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రష్మిక హీరోయిన్. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడు. సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రెండు భాగాలుగా నిర్మిస్తోంది. ‘ది రైజ్’ పేరుతో తొలి భాగం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.
Also read అల్లు అర్జున్ వలె చిరు, పవన్ చేయగలరా... మెగా ఫ్యామిలీలో వర్మ చిచ్చు