అల్లు అర్జున్ వలె చిరు, పవన్ చేయగలరా... మెగా ఫ్యామిలీలో వర్మ చిచ్చు
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఓ ట్వీట్ వేశాడంటే దాని వెనుక ఖచ్చితంగా ఎవరో ఒకరిని కెలికే ఉద్దేశం ఉంటుంది. రాజకీయాలలో బాబు, చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ టార్గెట్ గా ఆయన సినిమాలు, సోషల్ మీడియా ట్వీట్స్ ఉంటాయి. తాజాగా మెగా ఫ్యామిలీ హీరోల మధ్య చిచ్చుపెట్టేలా వర్మ ట్వీట్ చేశారు.
డిసెంబర్ 6న పుష్ప (Pushpa)ట్రైలర్ గ్రాండ్ గా విడుదలైంది. సౌత్ ఇండియాలోని నాలుగు ప్రధాన భాషలైన తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు మలయాళ భాషల్లో ట్రైలర్ విడుదల కావడం జరిగింది. డిసెంబర్ 7న హిందీ ట్రైలర్ కూడా విడుదల చేశారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ పుష్ప హిందీ ట్రైలర్ విడుదల చేశారు. ఇక పుష్ప ట్రైలర్ కి సర్వత్రా ప్రసంశలు దక్కుతున్నాయి. డీగ్లామర్ రోల్ లో అల్లు అర్జున్ లుక్, మేనరిజం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సుకుమార్ టేకింగ్, క్యారెక్టర్స్ , విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
కాగా పుష్ప ట్రైలర్ చూసిన వర్మ తనదైన శైలిలో స్పందించారు.రియలిస్టిక్ పాత్రలు చేయడానికి భయపడని ఏకైన సూపర్ స్టార్ అల్లు అర్జున్. నేను ఛాలెంజ్ చేస్తున్నా... చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, మహేష్ బాబు తో పాటు మిగతా స్టార్స్ లో ఎవరైనా ఇలాంటి పాత్రలు చేయగలరా. పుష్ప ఫ్లవర్ కాదు, ఫైర్.. .అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ట్రైలర్ నచ్చితే అల్లు అర్జున్ ని పొగిడితే సరిపోతుంది. బన్నీని పొగిడే క్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రజినీకాంత్, మహేష్ వంటి స్టార్స్ ని కించపరిచేలా ఆయన ట్వీట్ చేశారు.
గతంలో కూడా అల్లు అర్జున్ ఎదుగుదల వెనుక చిరంజీవి ప్రమేయం, సప్పోర్ట్ ఏమీ లేదని. మెగా ఫ్యామిలీ లో నిజమైన స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అంటూ... ట్వీట్స్ వేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పై వర్మ ట్వీట్ వైరల్ గా మారింది. వర్మ మెగా ఫ్యామిలీ ని కెలకడమే పనిగా పెట్టుకున్నాడు. ఆయన నుండి పవన్ తో పాటు చిరంజీవి(Chiranjeevi)ని కించపరిచేలా మరో సినిమా సిద్ధం చేశాడు. ఆ మధ్య పవర్ స్టార్ పేరుతో పవన్ రాజకీయ వైఫల్యంపై స్పూఫ్ మూవీ చేసిన వర్మ... దానికి కొనసాగింపుగా ఆర్జీవీ కిడ్నాప్ పేరుతో మరో మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా.. వివాదాస్పదంగా ఉంది.
వర్మ తీరు చూసిన జనాలు మాత్రం, అసలు వర్మకు పవన్ కళ్యాణ్ అంటే ఇంత కోపం ఎందుకని మాట్లాడుకుంటున్నారు. కెరీర్ బిగినింగ్ లో వర్మ చిరంజీవితో సినిమా చేస్తూ చేస్తూ బాలీవుడ్ ఆఫర్ రావడంతో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో చిరుకు వర్మకు చెడింది. ఇది జరిగి చాలా కాలం అవుతుంది.