Pushpa Trailer: `పుష్ప` అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అంటోన్న బన్నీ.. ఊపేస్తున్న ట్రైలర్.. మాస్ పార్టీ రెడీ
లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చాననేలా ఉంది ట్రైలర్. మాస్ పార్టీకి రెడీ అవ్వండనే సిగ్నల్ ఇస్తున్నారు బన్నీ. ఇందులో ఆయన చేసే యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నాయి. బన్నీ లుక్ సైతం అదరహో అనిపించేలా ఉంది.
లేట్‌గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చానంటోన్నారు అల్లు అర్జున్(Allu Arjun). ఆయన హీరోగా నటిస్తున్న `పుష్ప`(Pushpa) ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ఈ ట్రైలర్ సాయంత్రం ఆరుగంటలకే విడుదల కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ కారణాల వల్ల మూడు గంటల ఆలస్యంతో విడుదలైంది. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చాననేలా ఉంది Pushpa Trailer. మాస్ పార్టీకి రెడీ అవ్వండనే సిగ్నల్ ఇస్తున్నారు బన్నీ. ఇందులో ఆయన చేసే యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నాయి. బన్నీ లుక్ సైతం అదరహో అనిపించేలా ఉంది.
అందరు ఊహించినట్టే సినిమా ఎర్రచందనం నేపథ్యంలో సాగుతుందని ట్రైలర్‌లో క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో సినిమాలో కథని కూడా ఆల్మోస్ట్ రివీల్ చేశారు. నెలపై దొరికే బంగారంగా ఎర్రచందనం వర్ణిస్తూ, దీనికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉందని, అందుకు శేషాచలం అడవులు ఎర్రచందనానికి అడ్డగా ఉందని తెలిపారు. అక్కడి నుంచి సైలెంట్‌గా ఎర్రచందనం రవాణా జరుగుతుండటం, దాన్ని అల్లు అర్జునే రవాణా చేస్తుండటం విశేషం.
అయితే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో లాఠీలతో కొడుతూ `సరుకు ఎక్కడ దాచావో చెప్పు` అని పోలీసులు అడగ్గా, `చెబితే మా బాస్ చంపేస్తాడు` అని బన్నీ చెప్పడం, ఎవరు మీ బాస్ అంటే.. అల్లు అర్జున్‌నే చూపించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది బన్నీనేనా అని తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్‌తో కలిసి బన్నీనే ఈ గేమ్ ఆడతాడనే సందేహాలను కలిగిస్తుంది. మొత్తంగా సినిమాలో పెద్ద ట్విస్టే ఉండబోతుందని తెలుస్తుంది.
ఇందులో `పుష్ప` అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్` అని బన్నీ తనదైన మాస్ స్టయిల్‌లో చెప్పడం, పార్టీ ఎప్పుడు పుష్ప అని పోలీస్ ఆఫీసర్ ఫహద్ ఫాజిల్ అడగ్గా.. `మాస్ పార్టీ డిసెంబర్ 17 నుంచి` అని రావడంతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `పుష్ప` చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. `పుష్పః ది రైజ్` అనే మొదటి భాగం సినిమా ఈ నెల(డిసెంబర్) 17న విడుదల కానుంది.
`ఆర్య`, `ఆర్య2` చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇందులో అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ.. పుష్పరాజ్ అనే పాత్రని పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో సమంత స్పెషల్ సాంగ్‌ని చేస్తుండటం విశేషం. ఇది సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
also read: