మహేష్ బాబు, రాజమౌళి సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే ? న్యూ ఇయర్ సర్‌ప్రైజ్, కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే?
మహేష్ బాబు ఫ్యాన్స్ కి కొత్త ఏడాది సర్‌ప్రైజ్ వచ్చింది. రాజమౌళితో సినిమాకి సంబంధించిన గూస్‌బంమ్స్ తెప్పించే వార్త లీక్ అయ్యింది. ఒక్కరోజులోనే సర్‌ప్రైజ్ రాబోతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. భారీ స్థాయిలో దీన్ని తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో, అంతర్జాతీయ మూవీలా రూపొందించే పనిలో ఉన్నారు.
దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇదిగో, అదిగో అనే వార్తలు తప్పితే సినిమా టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.
ఈ క్రమంలో ఇప్పుడు అభిమానుల నిరీక్షణ ఫలించే టైమ్ వచ్చింది. ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ బయటకు వచ్చింది. కొత్త ఏడాది సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ ప్రారంభం కాబోతుంది.
రేపే(జనవరి 2న) ఈ మూవీని ప్రారంభించబోతున్నారట. గురువారం సినిమా ఓపెనింగ్ చేయబోతున్నారట. అయితే ఇందులో ట్విస్ట్ ఉంది. సినిమా ఓపెనింగ్ మాత్రమే ఉంటుందట. ఫార్మల్ ఓపెనింగ్‌ని నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది.
Rajamouli
`ఎస్‌ఎస్‌ఎంబీ29` రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమవడానికి ఇంకా టైమ్ పడుతుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ఇంకా జరుగుతున్నట్టు తెలుస్తుంది. లొకేషన్లు, కాస్టింగ్ ఎంపిక, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయడం, సీన్ డివిజన్ జరుగుతున్నాయట. డేట్స్ వేస్ట్ కాకుండా పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో సినిమాని తీయాలని జక్కన్న స్కెచ్ వేస్తున్నారట.
ఇందులో అంతర్జాతీయ నటీనటులు కూడా నటిస్తారని తెలుస్తుంది. అయితే ఇటీవల పృథ్వీరాజ్ సుకుమార్, ప్రియాంక చోప్రా నటిస్తారనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అందులో నిజం లేదని, ఇంకా కాస్టింగ్ ఫైనల్ కాలేదని సమాచారం.
రాజమౌళి మాత్రం ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేసేలా మెయిన్ ఇండస్ట్రీల నుంచి ఒక్కో ఆర్టిస్టు ఉండేలా చూసుకుంటున్నారట. మార్కెట్ పరంగా అది హెల్ప్ కావడం కోసం ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా తమిళంలో బాగా తెలిసిన ఆర్టిస్ట్ , కన్నడం నుంచి, మలయాళం నుంచి, హిందీ నుంచి ప్రముఖ నటీనటులు నటిస్తారని తెలుస్తుంది. వీరితోపాటు అంతర్జాతీయ ఆర్టిస్ట్ లను కూడా తీసుకురాబోతున్నారట.
సుమారు వెయ్యి-1200 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. సినిమా రేంజ్‌ని కూడా ఆ స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు, అంతే హైప్ క్రియేట్ చేయబోతున్నారట రాజమౌళి. ఆయన సినిమా తీయడం మాత్రమే కాదు, బిజినెస్ చేయడంలోనూ దిట్ట. ముందు నుంచి ప్లానింగ్‌తోనే వెళ్తుంటారు. ఇప్పుడు మహేష్ సినిమా విషయంలోనూ అదే జరుగుతుందని సమాచారం.
also read: కృష్ణ సినిమాలో విలన్‌గా చేసి, తర్వాత సూపర్ స్టార్‌గా ఎదిగి తనకే పోటీ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా?
ఇక ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందని, ప్రపంచ సాహసికుడిగా మహేష్ బాబు కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి, రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే. అందుకోసం మహేష్ సరికొత్త మేకోవర్‌లోకి మారిపోతున్నారు. ఇప్పటికే కొత్త లుక్‌లో కనిపిస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. సినిమా ప్రారంభానికి ముందే గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నారు. ఇక సినిమా అదే రేంజ్‌లో ఉంటే ఇండియన్ సినిమా రికార్డులన్నీ పటాపంచలు కావడం ఖాయమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
rea more: శోభన్ బాబు భోజనంలో ప్రతిరోజూ వడ పాయిసం.. ప్రొడక్షన్ బాయ్ చేత అంత అవమానం ఫేస్ చేశాడా?