శోభన్ బాబు భోజనంలో ప్రతిరోజూ వడ పాయిసం.. ప్రొడక్షన్ బాయ్ చేత అంత అవమానం ఫేస్ చేశాడా?
శోభన్ బాబు అద్బుతమైన నటనతో ఎంతగా మెప్పించాడో, బిజినెస్ మ్యాన్‌గానూ అంతే పాపులర్ అయ్యారు. అయితే అవమానాలు కూడా చాలానే ఫేస్ చేశాడు సోగ్గాడు. ఓ రోజు ప్రొడక్షన్ బాయ్ చేసిన అవమానం బయటపెట్టాడు శోభన్‌బాబు.
తెలుగు తెర ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్‌బాబు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి చిత్ర పరిశ్రమలో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగాడు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమని శాషించాడు. ఫ్యామిలీ కథా చిత్రాలకు పెద్ద పీఠ వేస్తూ ఇంటిళ్లిపాదిని ఆకట్టుకున్నారు. మహిళా ఆడియెన్స్ లో విశేష ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకున్నాడు.
శోభన్ బాబు పేద మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. అందరిలాగే తాను సినిమా కష్టాలు పడ్డాడు. కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఫేస్ చేశాడు. సినిమాల నుంచి తొలగించిన సందర్భాలున్నాయి. అంతేకాదు సినిమా సెట్‌లోనూ అవమానాలు ఫేస్ చేశాడు. ప్రొడక్షన్ బాయ్స్ కూడా శోభన్‌బాబుని అవమానించారట.
ఫుడ్ విషయంలోనూ చులకగా మాట్లాడేవారట. సరైన ఫుడ్ పెట్టేవారు కాదట. ఈ క్రమంలో వడ పాయిసం కి సంబంధించిన ఓ బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ఉంది. దాన్ని మనసులో పెట్టుకున్న శోభన్ బాబు తన ఇంట్లో ప్రతి రోజు ఆ ఐటెమ్ ఉండేలా చూసుకున్నారట.
read more: కృష్ణ సినిమాలో విలన్‌గా చేసి, తర్వాత సూపర్ స్టార్‌గా ఎదిగి తనకే పోటీ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా?
శోభన్‌బాబు కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. జూ ఆర్టిస్ట్ కి ఎక్కువ, ఆర్టిస్ట్ కి తక్కువ అనేలా ఆయన పాత్రలు ఉండేవట. ప్రొడక్షన్ వాళ్లు జూ ఆర్టిస్ట్ లాగే డీల్ చేసేవారట. ఈ క్రమంలో భోజనాలు పెడితే ఆర్టిస్ట్ లకు, వీరికి తేడా చూపించేవారట. రైస్, సాంబార్ ప్యాకెట్, కర్డ్ ప్యాకెట్ ఇచ్చేవారట.
పెద్ద ఆర్టిస్ట్ లకు వడ పాయిసం వేసేవారట. తనకు వేయమంటే ఈ ఫుడ్ పెట్టడమే ఎక్కువ, ఇంకా వడ పాయిసం కావాలా అంటూ అవమానించారట ప్రొడక్షన్ బాయ్స్. చాలా బాధపడిపోయిన సోగ్గాడు తాను పెద్దగా ఎదిగితే తన భోజనంలో రోజూ వడ పాయిసం కచ్చితంగా ఉండేలా చూసుకోవాలనుకున్నారట.
అన్నట్టుగానే అనతి కాలంలోనే ఆయన పెద్ద హీరోగా ఎదిగాడు, స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్‌గా ఎదిగాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. ఆ రోజు ప్రొడక్షన్ బాయ్ అవమానాన్ని మాత్రం మర్చిపోలేదు. తాను ఓ స్థాయికి వచ్చిన తర్వాత ప్రతి రోజు తన భోజనంలో వడ పాయిసం ఉండేలా చూసుకునేవారట. ప్రతి రోజూ స్వీట్ ఉండాల్సిందే అట.
ఈ విషయాన్ని రైటర్, నటుడు తోటపల్లి మధు వెల్లడించారు. శోభన్‌బాబుతో ఆయన చాలా సినిమాలకు రైటర్‌గా చేశాడు. ఈ క్రమంలో తరచూ సోగ్గాడి ఇంటికి వెళ్లేవాడట. ఎప్పుడూ వెళ్లినా భోజనంలో వడ పాయిసం, స్వీట్ కనిపించేవి అట, ఓ రోజు ఈ విషయాన్ని అడిగితే తనకు జరిగిన అవమానం విషయాన్ని బయటపెట్టాడట శోభన్‌బాబు. తను ఇలాంటి విషయాల్లో చాలా పర్టిక్యూలర్‌గా ఉంటాడని తెలిపారు రైటర్.
దీనికి మరో ఉదాహరణ కూడా ఉంది. శోభన్ బాబు ఔట్ డోర్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆయనకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉంది. ఓ రోజు హోటల్ వాడు కాఫీ తేవడం లేట్ చేశాడట. రెండు సార్లు అలానే జరిగిందట. చివరికి కాఫీ తేలేదట. కానీ అది శోభన్‌బాబుకి రోజూ అలవాటుగా ఉండేది, ప్రతి రోజు కాఫీ తాగకుండా ఉండేవాడు కాదు.
ఈ క్రమంలో రెండు రోజులు తాగలేకపోయాడు. దీంతో తనలో ఆ బలహీనత ఉండకూడదని కాఫీ తాగడమే మానేడట. దాదాపు ముప్పై ఏళ్ల అలవాటుని ఇలా సింపుల్‌గా వదిలించుకున్నాడట శోభన్‌బాబు. ఆయన ఇలాంటి అవమానాల విషయంలో ఎంత కచ్చితంగా ఉంటాడనేదానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు.
శోభన్ బాబు మంచి ఏజ్‌లో ఉన్నప్పుడు, ముసలితనం ఆవయిస్తుందనుకున్న సమయంలోనే ఆయన సినిమాలకు రిటైర్‌మెంట్ ఇచ్చాడు. ఆడియెన్స్ దృష్టిలో ఎవర్ గ్రీన్ సోగ్గాడిగానే ఉండిపోవాలని చెప్పి ఆయన సినిమాలకు దూరమయ్యారు. సినిమాలు మానేసిన తర్వాత ఆరేడేళ్లు ప్రైవేట్ జీవితాన్ని గడిపిన శోభన్ బాబు 2008లో కన్నుమూశారు.
read more: రామ్ చరణ్ వేసుకున్న టీషర్ట్ ధర ఎంతో తెలుసా? బన్నీ, మహేష్, ఎన్టీఆర్ లు కూడా ఈ రేంజ్‌లో వేయరు?