కృష్ణ సినిమాలో విలన్‌గా చేసి, తర్వాత సూపర్ స్టార్‌గా ఎదిగి తనకే పోటీ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ సినిమాలో విలన్‌గా నటించి, ఆ తర్వాత హీరోగా మారి సూపర్ స్టార్ గా ఎదిగి ఆయనకే పోటీ ఇచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ.. ఏఎన్నార్‌ని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చారు. ఆయన సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతుండగా, వంద రోజుల సెలబ్రేషన్స్ లో ఏఎన్నార్‌ని చూశారు కృష్ణ. ఆ తర్వాత ఎన్టీఆర్ వద్దకు వెళ్లి తన మనసులో మాట చెప్పారు. హీరో కావాలనుకుంటున్నట్టు తెలిపారు.
కొన్ని ప్రయత్నాల అనంతరం `కులగోత్రాలు`, `పదండి ముందుకు`, `పరువు ప్రతిష్ట` చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. `తేనేమనసులు` సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
krishna,krishnam raju
ఇదిలా ఉంటే `తేనే మనసులు` సినిమాకి హీరోగా కృష్ణ ఆడిషన్‌కి వెళ్లినప్పుడు మరో హీరో కూడా ఆడిషన్‌కి వచ్చాడు. కానీ ఆయన ఎంపికకాలేదు. కృష్ణ సెలెక్ట్అయ్యాడు. హీరో అయ్యాడు. కానీ ఎంపిక కాని హీరో ఎవరో కాదు కృష్ణంరాజు. ఈ మూవీకి హీరో పాత్ర కోసం ఆయన కూడా వచ్చారట.
కానీ ఎంపిక కాలేదు. `చిలకాగోరింక` సినిమాలో ఎంపికయ్యారు. ఈ మూవీ ఫర్వాలేదనిపించింది. కానీ పెద్ద హిట్ కాదు. ఆ తర్వాత వరుసగా చిన్న చిన్న పాత్రల్లో నటించాల్సి వచ్చింది. సినిమా ఆఫర్లు రాలేదు. ఈ క్రమంలో విలన్‌గానూ మారాడు కృష్ణంరాజు.
read more: ఫ్యాన్స్ కి ప్రభాస్ న్యూ ఇయర్ సందేశం, మనల్ని ప్రేమించే మనుషులున్నారంటూ ఎమోషనల్ వర్డ్స్
అది కృష్ణ హీరోగా నటించిన `నేనంటే నేనే` సినిమాలో విలన్‌గా చేశాడు కృష్ణంరాజు. అదే కాదు వరుసగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు సినిమాల్లో విలన్‌గా, సెకండ్ హీరోగా నటించి అలరించారు. దదాపు ఏడెనిమిదేళ్ల వరకు ఇలా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు.
`కృష్ణవేణి`తో హిట్ కొట్టాడు. కానీ తనకు పేరు రాలేదు. `పరివర్తన`బాగానే ఆడింది. కానీ బ్రేక్ తేలేకపోయింది. ఈ క్రమంలో వచ్చిన `భక్తకన్నప్ప`తో సంచలనాలు సృష్టించారు కృష్ణంరాజు. ఇక హీరోగా తిరగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
అప్పటికే కృష్ణ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. బిజీగా ఉన్నారు. `భక్తకన్నప్ప` ఇచ్చిన బ్రేక్‌తోస్టార్ అయిపోయి కృష్ణకే పోటీ ఇచ్చారు కృష్ణంరాజు. ఇద్దరు పోటాపోటీగా సినిమాలు చేశారు. `అమరదీపం`, `జీవన తరంగాలు`తో ఆయన రేంజ్ మారిపోయింది. `కటకటాల రుద్రయ్య`తో తిరుగులేని సూపర్ స్టార్ అయిపోయారు కృష్ణంరాజు.
ఇక ఆ సమయంలో కృష్ణ, శోభన్‌బాబులకే కాదు, ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు కూడా పోటీ ఇచ్చారు కృష్ణంరాజు. ఇండస్ట్రీలో తనకంటూ గొప్ప ఇమేజ్‌ని, స్టార్ డమ్‌ని సంపాదించుకున్నారు. ఫ్యాన్ బేస్‌ని బిల్డ్ చేసుకున్నారు. తిరుగులేని స్టార్ అయిపోయారు.
దాదాపు ఐదున్నర దశాబ్దాలపాటు నటుడిగా రాణించారు కృష్ణంరాజు. రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన వారసుడిగా ప్రభాస్‌ని ఇండస్ట్రీకి అందించారు. ఆయన ఇప్పుడు గ్లోబల్‌స్టార్‌గా రాణిస్తున్నారు. కృష్ణంరాజు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ సైతం రెండేళ్ల క్రితమే కన్నుమూశారు. కృష్ణ వారసుడిగా మహేష్ బాబు హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
read more: `మార్కో` మూవీ తెలుగు రివ్యూ