MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Maheshbabu Next Movies: `వారణాసి` రిలీజ్‌కి ఇంకా ఏడాది ఉంది, అప్పుడే క్యూలో ఐదు.. మహేష్‌ నెక్ట్స్ లైనప్‌

Maheshbabu Next Movies: `వారణాసి` రిలీజ్‌కి ఇంకా ఏడాది ఉంది, అప్పుడే క్యూలో ఐదు.. మహేష్‌ నెక్ట్స్ లైనప్‌

ప్రస్తుతం `వారణాసి`తో బిజీగా ఉన్న మహేష్‌ బాబు నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన వార్తలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏకంగా ఐదు ప్రొడక్షన్‌ హౌజ్‌లు క్యూలో ఉన్నాయట. లైనప్‌ గట్టిగానే ఉండబోతుందట.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 18 2026, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియాలోనే అత్యంత ఖరీదైన మూవీ `వారణాసి`
Image Credit : mahesh babu instagram

ఇండియాలోనే అత్యంత ఖరీదైన మూవీ `వారణాసి`

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం `వారణాసి` సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న గ్లోబల్‌ ఫిల్మ్ ఇది. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్ లో, అంతర్జాతీయ మార్కెట్‌కి చేరువయ్యేలా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎస్‌ నారాయణ నిర్మిస్తున్నారు. సుమారు రూ. 1400కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఖరీదైన మూవీ ఇదే కావడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`వారణాసి` తో గ్లోబల్‌ స్టార్‌గా మహేష్‌ బాబు
Image Credit : mahesh babu instagram

`వారణాసి` తో గ్లోబల్‌ స్టార్‌గా మహేష్‌ బాబు

ఈ సినిమా మహేష్‌ బాబు కెరీర్‌ని మార్చేయబోతుంది. ఆయన్ని గ్లోబల్‌ స్టార్‌ని చేయబోతుంది. ఇప్పటి వరకు ఒక్క పాన్‌ ఇండియా మూవీ కూడా చేయని మహేష్‌ ఒకేసారి గ్లోబల్‌ రేంజ్‌ మూవీ చేస్తుండటం విశేషం. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమాని రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారట జక్కన్న. అదే స్థాయిలో మార్కెటింగ్‌ చేయబోతున్నారు. మూడు వేలకోట్లకుపైగానే కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకుని, ఆ దిశగా ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమా కోసమే మహేష్‌ తోపాటు సినీ వర్గాలు, అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

35
మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీస్‌ లైనప్‌
Image Credit : mahesh babu instagram

మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీస్‌ లైనప్‌

`వారణాసి` వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా ఏడాదికిపైగానే ఉంది. కానీ ఇప్పట్నుంచే మహేష్‌ బాబుతో సినిమా చేసేందుకు క్యూ పెరిగిపోతుంది. నిర్మాణ సంస్థలు మహేష్‌తో మూవీస్‌ చేసేందుకు క్యూ కడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఇందులో మొదటి వరుసలో ఉంది. రాజమౌళితో మూవీ అనంతరం నెక్ట్స్ తమ బ్యానర్‌లోనే మూవీ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట. అలాగే సన్‌ పిక్చర్స్, హోంబలే ఫిల్మ్స్ కూడా క్యూలో ఉన్నాయట. వీటితోపాటు మరో రెండు హిందీ ప్రొడక్షన్‌ హౌజెస్‌ కూడా మహేష్‌ బాబుతో మూవీకి ప్లాన్‌ చేస్తున్నాయట. ఇప్పట్నుంచే ఈ బ్యానర్స్ కథలు వినిపించే పనిలో ఉన్నట్టు సమాచారం.

45
సందీప్‌ రెడ్డితో మహేష్‌ మూవీ?
Image Credit : our own

సందీప్‌ రెడ్డితో మహేష్‌ మూవీ?

అయితే మహేష్‌ బాబుతో నెక్ట్స్ సినిమాలు చేసే దర్శకుల్లో సందీప్‌ రెడ్డి వంగా ముందు వరుసలో ఉంటారని సమాచారం. మహేష్‌ బాబుతో ఆయనకు మంచి ర్యాపో ఉంది. `యానిమల్‌` మూవీ మహేష్‌ చేయాల్సింది. కానీ సెట్‌ కాలేదు. త్వరలో మరో కథతో మహేష్‌ని కలుస్తానని పలు ఇంటర్వ్యూలో సందీప్‌ రెడ్డి వంగా తెలిపారు. అన్నీ కుదిరితే సందీప్‌తో మూవీ ఉండే ఛాన్స్ ఉంది. వీరితోపాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌, ఇతర తెలుగు దర్శకులు కూడా మహేష్‌ కోసం కథలు రెడీ చేస్తున్నారట.

55
`వారణాసి` రిలీజ్‌ తర్వాతే మహేష్‌ నిర్ణయం
Image Credit : mahesh babu instagram

`వారణాసి` రిలీజ్‌ తర్వాతే మహేష్‌ నిర్ణయం

ఇవన్నీ ఇప్పుడు ప్రైమరీ డిస్కషన్‌ స్టేజ్‌లోనే ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్‌.. `వారణాసి` షూటింగ్‌లోనే బిజీగా ఉన్నారు. టైమ్‌ దొరికినప్పుడు కథలు వింటున్నారని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, `వారణాసి` రిలీజ్‌ తర్వాతనే, దాని రిజల్ట్ ని బట్టి ఆయన ఎవరితో చేయాలనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కానీ పలు భారీ నిర్మాణ సంస్థలు మాత్రం అడ్వాన్స్ లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయట. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Mohanbabu: ఎన్టీఆర్‌ ముందే మోహన్‌బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌.. ఏఎన్నార్‌, రామారావుతోపాటు అంతా షాక్‌
Recommended image2
Shrasti Verma: ఐటెమ్‌ సాంగ్‌తో రాబోతున్న బిగ్‌ బాస్‌ నటి.. శ్రష్టి వర్మ డేరింగ్‌ స్టెప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved