MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసలు పోకిరి మూవీ ఎలా హిట్ అయింది ? మహేష్, పూరి ఆన్సర్ ఇదే.. అది ఒక అమ్మాయి చేసిన మ్యాజిక్ అని తెలుసా

అసలు పోకిరి మూవీ ఎలా హిట్ అయింది ? మహేష్, పూరి ఆన్సర్ ఇదే.. అది ఒక అమ్మాయి చేసిన మ్యాజిక్ అని తెలుసా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన చిత్రం పోకిరి. సాధారణ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ నివ్వెరపోయేలా అసాధారణ విజయం సొంతం చేసుకుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 07 2025, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పోకిరి అసాధారణ విజయం 
Image Credit : Facebook

పోకిరి అసాధారణ విజయం 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన చిత్రం పోకిరి. సాధారణ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ నివ్వెరపోయేలా అసాధారణ విజయం సొంతం చేసుకుంది. ఎవరూ ఊహించిన విధంగా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. మహేష్ బాబు మాస్ ఇమేజ్ ని అమాంతం పెంచేసిన చిత్రం ఇది.

పోకిరి మూవీ అప్పట్లో అంత పెద్ద విజయం ఎలా సాధించింది అనేది ఇండస్ట్రీ ప్రముఖులకు కూడా అర్థం కాలేదు. ఈ చిత్రం ఫస్ట్ కాపీని సూపర్ స్టార్ కృష్ణ చూసి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది అని చెప్పారట. ఆయన మాటలను కూడా ఎవరు నమ్మలేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక పోకిరి చిత్రం చేసిన మ్యాజిక్ కి అంతా ఫిదా అయిపోయారు. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుంది అంటున్నారు కానీ అంత పెద్ద విజయం సాధించడానికి స్పష్టమైన కారణాలు  చెప్పలేకపోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టైటిల్ విని టెన్షన్ పడ్డ మహేష్
Image Credit : our own

టైటిల్ విని టెన్షన్ పడ్డ మహేష్

ఇదే పరిస్థితి డైరెక్టర్ పూరి జగన్నాథ్, మహేష్ బాబుకి కూడా ఎదురైంది. మహేష్ బాబు ఈ చిత్రం రిలీజ్ అయ్యాక కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కథ చెప్పాక ఈ చిత్రానికి టైటిల్ పోకిరి అని అన్నారు. ఇదేంటి పోకిరి అని నెగటివ్ టైటిల్ చెబుతున్నారు అని టెన్షన్ పడ్డాను. ఈ చిత్రంలో పోకిరిలా కనిపించడానికి కష్టపడ్డాను. ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నా.

35
ఆ అమ్మాయి చేసిన మ్యాజిక్ అది
Image Credit : Instagram

ఆ అమ్మాయి చేసిన మ్యాజిక్ అది

పోకిరిలా కనిపించాలి అంటే హెయిర్ పెంచాలి అని పూరి జగన్నాథ్ గారు చెప్పారు. అతడు తర్వాత మూడు నెలల గ్యాప్ వచ్చింది. హెయిర్ బాగా పెంచేశాను. నేను హెయిర్ పెంచడం అదే తొలిసారి కావడంతో చాలా చిరాగ్గా అనిపించింది. పోకిరిలా కనిపిస్తూనే హ్యాండ్సమ్ లుక్ లో కూడా కనిపించాలి. 

అలాంటి లుక్ ఎవరు ఇవ్వగలరు అని ఆలోచిస్తున్న ముంబైలో దిల్షాద్ అనే అమ్మాయి గురించి తెలిసింది.ఆమె హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తున్నారు. వెంటనే ముంబైకి వెళ్లి ఆమె దగ్గర హెయిర్ స్టైల్ చేయించుకున్నాను. పోకిరి చిత్రంలో నా హెయిర్ స్టైల్ అంత బాగా కుదిరింది అంటే కారణం ఆ అమ్మాయి అని మహేష్ బాబు అన్నారు.

45
పోకిరి విజయానికి కారణాలు ఇవే
Image Credit : our own

పోకిరి విజయానికి కారణాలు ఇవే

ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఏమనుకుంటున్నారు అని యాంకర్ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి మహేష్ సమాధానం ఇస్తూ.. అది మాక్కూడా ఇంతవరకు అర్థం కాలేదని మహేష్ బాబు నవ్వేశారు. ఆ తర్వాత మహేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ఇన్ క్రెడిబుల్ ఎనర్జీ ఉంది. చివరి 40 నిమిషాలు అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

దీనికి తోడు డైలాగులు అదిరిపోయాయి. ఆడియన్స్ థియేటర్ లోనే డైలాగులు రిపీట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్ర విజయానికి ఈ అంశాలే కారణం అని అనిపిస్తోంది. పూరి జగన్నాథ్ చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది అని మహేష్ బాబు అన్నారు.

55
పూరి జగన్నాధ్ కి అర్థం కాలేదట
Image Credit : our own

పూరి జగన్నాధ్ కి అర్థం కాలేదట

పోకిరి చిత్రం అంత పెద్ద విజయం ఎలా సాధించింది అనే ప్రశ్న పూరి జగన్నాథ్ కి కూడా ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. పూరి సమాధానం ఇస్తూ.. పోకిరి తర్వాత నేను కొన్ని చిత్రాలు చేశాను. అవి కూడా మంచి విజయం సాధించాయి కానీ పోకిరి రేంజ్ లో హిట్ కాలేదు. అసలు పోకిరిలో అంత గొప్ప ఏం తీశాను అని తెలుసుకోవడానికి ఆ సినిమాని నేనొక్కడినే ఒంటరిగా చూశాను. కానీ నాకేమీ అర్థం కాలేదు అంటూ పూరి జగన్నాథ్ సరదాగా కామెంట్స్ చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Srinidhi Shetty: ఆ విషయంలో యశ్ కంటే నానినే బెస్ట్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి సంచలన కామెంట్స్..
Recommended image2
Pawan-Singeetam Movie: జీసస్‌ కథతో పవన్‌ కళ్యాణ్‌ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
Recommended image3
Singeetham Top 10 Movies: సినిమా సైంటిస్ట్.. సింగీతం శ్రీనివాసరావు టాప్ 10 క్లాసిక్ మూవీస్, మయూరి నుంచి భైరవ ద్వీపం వరకు..
Related Stories
Recommended image1
రాఘవేంద్రరావు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి నంది అవార్డు అందుకున్న ఏకైక చిత్రం.. ఆ మూవీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్
Recommended image2
హరిహర వీరమల్లు కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇది జరిగితే నార్త్ లో వసూళ్ల వర్షమే.. మైండ్ బ్లోయింగ్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved