- Home
- Entertainment
- హరిహర వీరమల్లు కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇది జరిగితే నార్త్ లో వసూళ్ల వర్షమే.. మైండ్ బ్లోయింగ్ ప్లాన్
హరిహర వీరమల్లు కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇది జరిగితే నార్త్ లో వసూళ్ల వర్షమే.. మైండ్ బ్లోయింగ్ ప్లాన్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేస్తోంది.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేస్తోంది.ఇటీవల విడుదలైన ట్రైలర్ కి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ దక్కింది. కేవలం 24 గంటల్లోనే హరిహర వీరమల్లు ట్రైలర్ కి 48 మిలియన్ల వ్యూస్ దక్కాయి. సౌత్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా హరిహర వీరమల్లు రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రైలర్ ఇచ్చిన జోష్ తో చిత్ర యూనిట్ మరిన్ని ప్రచార కార్యక్రమాలకు రెడీ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం,ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 19న తిరుపతిలో జరగనుంది. అయితే, అంతకుముందే మరో ముఖ్యమైన ఈవెంట్ ను జూలై 17న వారణాసిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావలసి ఉంది.
వారణాసిలో జరగబోయే హరిహర వీరమల్లు ఈవెంట్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమైతే, నార్త్ బెల్ట్ లో హరిహర వీరమల్లు చిత్రానికి బాగా పబ్లిసిటీ లభిస్తుంది. కంటెంట్ కనెక్ట్ అయితే హిందీలో వసూళ్ల వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. రాజకీయాల్లో పవన్ హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో దేశ వ్యాప్తంగా నెమ్మదిగా పాపులర్ అవుతున్నారు.
రాజకీయంగా ఇటు జనసేన పార్టీ, అటు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి. నార్త్ లీడర్స్ తో పవన్ కళ్యాణ్ కి మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ హరిహర వీరమల్లు ఈవెంట్ కి యూపీ సీఎం యోగి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
హరిహర వీరమల్లు చిత్రంలో కూడా హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌తో పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ అంశాలు బీజేపీ అనుకూల ప్రేక్షకులని ఆకర్షించేలా ఉండవచ్చన్న విశ్లేషణ కూడా ఉంది. వారణాసిలో యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో హరిహర వీరమల్లు ఈవెంట్ జరిగితే జాతీయ స్థాయిలో ఈ చిత్రం చర్చనీయాంశం అవుతుంది. అంతే కాకుండా ఉత్తర భారతంలో పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ దక్కే అవకాశం కూడా ఉంటుంది.
ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైంది. కొంత షూటింగ్ జరిగాక క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీత దర్శకుడు.