MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాఘవేంద్రరావు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి నంది అవార్డు అందుకున్న ఏకైక చిత్రం.. ఆ మూవీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్

రాఘవేంద్రరావు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి నంది అవార్డు అందుకున్న ఏకైక చిత్రం.. ఆ మూవీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు టాలీవుడ్ లో లెజెండ్రీ డైరెక్టర్లలో ఒకరు. ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 06 2025, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : our own

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు టాలీవుడ్ లో లెజెండ్రీ డైరెక్టర్లలో ఒకరు. ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఈ తరం హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబులని హీరోలుగా పరిచయం చేసింది కూడా ఆయనే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : our own

కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడంలో రాఘవేంద్రరావుకు ప్రత్యేక శైలి ఉంది. దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్న ఆయన.. డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా సత్తా చాటారని తెలుసా? కానీ ఇది నిజం.. డాన్స్ కొరియోగ్రఫీ చేయడం మాత్రమే కాదు, అందుకుగాను ఆయన నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే 1996లో విడుదలైన పెళ్లి సందడి మూవీ.

35
Image Credit : google

రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ ఈ చిత్రంలో కలిసి నటించారు. దర్శకత్వం చేస్తూనే ఈ మూవీలో పాటలకు ఆయన కొరియోగ్రఫీ కూడా చేశారు. పాటలు చిత్రీకరించడంలో రాఘవేందర్ రావు కి ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన చిత్రాల్లోని పాటల్లో ఎక్కువగా పూలు,  పళ్ళు కనిపిస్తుంటాయి. పెళ్లి సందడి చిత్రంలో పెద్దగా డాన్స్ మూమెంట్స్ లేకుండా ఎంతో అందంగా పాటలకు కొరియోగ్రఫీ అందించారు.ఈ మూవీలో కీరవాణి అందించిన సంగీతం హైలైట్. 

45
Image Credit : our own

పెళ్లి సందడి చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 1996 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరోల చిత్రాల పోటీ నుంచి తట్టుకుని కూడా టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ చిత్రానికి పోటీగా బాలకృష్ణ వంశానికొక్కడు, వెంకటేష్ ధర్మచక్రం చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఈ చిత్రాలు పెళ్లి సందడి అంతా పెద్ద హిట్ కాలేకపోయాయి.

55
Image Credit : IMDB

ఆ ఏడాది నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ మూవీ తర్వాత పెళ్లి సందడి చిత్రం రెండవ స్థానంలో నిలిచింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ లోపే తెరకెక్కిన పెళ్లి సందడి చిత్రం ఏకంగా 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Mahesh Babu: అది వల్గర్ సినిమా అంటున్నారు, అసలు మహేష్ బాబు త్రివిక్రమ్ కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారో తెలుసా ?
Recommended image2
Trivikram Srinivas: హీరోయిన్ కాళ్లపై పడబోయిన త్రివిక్రమ్.. షాక్‌లో శ్రీనిధి.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
బుద్ధుందా అంటూ తెలుగు హీరోయిన్ ని తిట్టిన కమల్ హాసన్..16 ఏళ్ళ వయసున్న ఆమెని చూసి ఏఎన్నార్ సతీమణికి ఆశ్చర్యం
Recommended image2
ఒకప్పుడు విజయశాంతికి ఆయన పర్సనల్ మేకప్ మెన్..ఇప్పుడు 200 కోట్ల సినిమా నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved