- Home
- Entertainment
- Amala Paul: ఇక అలాంటి అశ్లీల సీన్లలో అస్సలు నటించను..ఇమేజ్ డ్యామేజ్, గతాన్ని గుర్తు చేసుకున్న అమలాపాల్
Amala Paul: ఇక అలాంటి అశ్లీల సీన్లలో అస్సలు నటించను..ఇమేజ్ డ్యామేజ్, గతాన్ని గుర్తు చేసుకున్న అమలాపాల్
2019లో వచ్చిన ఆడై సినిమాలో అశ్లీల సన్నివేశంలో నటించిన అమలా పాల్.. ఇలాంటి సన్నివేశాలను మళ్లీ చేయనని తాజాగా వెల్లడించారు. ఆ మూవీ వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అని భయపడ్డట్లు అమలాపాల్ తెలిపారు.

ఆడైపై అమలా పాల్ కీలక వ్యాఖ్యలు
నటి అమలా పాల్ 2019లో వచ్చిన తమిళ చిత్రం ఆడైలో అశ్లీల సన్నివేశంలో నటించారు. ఈ సినిమా కోసం తాను తీసుకున్న రిస్క్ గురించి తాజాగా ఇండియా టుడేతో మాట్లాడిన ఆమె.. ఈ తరహా నిర్ణయం తీసుకునే ముందు తన ఇమేజ్ గురించి ఎన్నో ఆలోచనలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అదే పరిస్థితి ఎదురైతే ఆడై సినిమాలో చేసినట్లుగా మళ్లీ నటించబోనని ఆమె స్పష్టం చేశారు.
దర్శకుడి ఆలోచనపై రెండు నెలలు ఆలోచన
ఆడై సినిమాకు ఓకే చెప్పే ముందు తనకు ప్రధానంగా ఉన్న ఆందోళన దర్శకుడు రత్న కుమార్ ఈ కథను ఎలా తెరకెక్కిస్తారన్నదేనని అమలా పాల్ తెలిపారు. సినిమాలోని అశ్లీల సన్నివేశాలు కథకు అవసరమైన అంశంగా ఉంటుందా, లేక అదే కథలో ప్రధాన ఆకర్షణగా మారుతుందా అనే విషయంపై ఆమెకు సందేహాలు ఉన్నాయని చెప్పారు. సినిమా టీమ్ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి దాదాపు రెండు నెలలు సమయం తీసుకున్నానని, ఆ తర్వాతే సినిమా చేయడానికి అంగీకరించానని వెల్లడించారు.
దర్శకుడు కెమెరామెన్‌పై నమ్మకంతోనే అంగీకారం
దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌పై నమ్మకం ఏర్పడిన తర్వాతే ఆ సన్నివేశానికి అంగీకరించానని అమలా పాల్ చెప్పారు. ఇది కేవలం అశ్లీల సన్నివేశాలు చుట్టూ తిరిగే సినిమా కాకుండా, భావోద్వేగాలతో కూడిన కళాత్మక చిత్రంగా తెరకెక్కుతుందనే నమ్మకం కలిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చిత్రీకరణ సమయంలో సెట్‌లో చాలా తక్కువ మందిని ఉంచి తనకు సౌకర్యంగా ఉండేలా టీమ్ వ్యవహరించిందని, అందుకే ఆ ప్రక్రియ తమందరికీ ఎంతో అందమైన సృజనాత్మక అనుభవంగా మారిందని ఆమె వివరించారు.
తన ఇమేజ్ గురించి భయపడిన అమలా పాల్
ఆడైకి అంగీకరించే సమయంలో తన ఇమేజ్ గురించి భయపడ్డానని అమలా పాల్ వెల్లడించారు. ఇలాంటి పాత్రలతోనే తనను గుర్తించే పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అదే సమయంలో సినిమా గురించి తనకు ఉన్న సందేహాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఎవరైనా తనను ఆడై లాంటి సినిమా చేయమని అడిగితే తాను అంగీకరించనని స్పష్టం చేశారు.
ఆడై కథ ఇదే
రత్న కుమార్ రచించి దర్శకత్వం వహించిన ఆడై చిత్రాన్ని వి స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమాలో అమలా పాల్‌తో పాటు అనన్య రామప్రసాద్, వివేక్ ప్రసన్న, రమ్య సుబ్రమణియన్ నటించారు. సినిమాలో కమిని అనే యువ టెలివిజన్ జర్నలిస్టు పాత్రలో అమలా పాల్ కనిపించారు. సరదాగా గడిపిన ఓ రాత్రి తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. మరుసటి రోజు ఓ నిర్జన భవనంలో ఒంటరిగా, బట్టలు లేకుండా మేల్కొన్న కమినికి తన స్నేహితులకు ఏమైందో, తాను అక్కడికి ఎలా చేరుకున్నానో తెలియదు. అక్కడి నుంచి బయటపడేందుకు ఆమె చేసే ప్రయత్నాలు, అంతకుముందు రాత్రి అసలు ఏం జరిగిందో తెలుసుకునే క్రమంతో ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్‌గా సాగుతుంది.

