MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lenin 22 Days Collections: లెనిన్‌ 22 రోజుల కలెక్షన్లు.. మొత్తంగా అఖిల్‌ సినిమాకి వచ్చింది ఎంతంటే? అది నిజం కాదా?

Lenin 22 Days Collections: లెనిన్‌ 22 రోజుల కలెక్షన్లు.. మొత్తంగా అఖిల్‌ సినిమాకి వచ్చింది ఎంతంటే? అది నిజం కాదా?

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన `లెనిన్‌` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లని సాధించింది. మరి 22 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 01 2026, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లెనిన్‌తో తొలి బ్రేక్‌ అందుకున్న అఖిల్‌
Image Credit : Asianet News

లెనిన్‌తో తొలి బ్రేక్‌ అందుకున్న అఖిల్‌

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున వారసులుగా నాగచైతన్యతోపాటు, అఖిల్‌ కూడా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చైతన్య రెండో చిత్రంతోనే హిట్‌ కొట్టాడు. కానీ అఖిల్‌ ఇన్నాళ్లు స్ట్రగుల్‌ అయ్యాడు. దాదాపు ఐదు సినిమాలు బోల్తా కొట్టాయి. ఇప్పుడు ఆరో మూవీ(హీరోగా) సక్సెస్‌ అయ్యింది. `లెనిన్‌`తో ఆయన హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లోనే ఫస్ట్ హిట్‌ ఇదే అని చెప్పొచ్చు. మొత్తానికి దాదాపు 11ఏళ్ల తర్వాత అఖిల్‌కి ఫస్ట్ బ్రేక్‌ వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లెనిన్‌పై నాగార్జున స్పెషల్‌ కేర్‌
Image Credit : Asianet News

లెనిన్‌పై నాగార్జున స్పెషల్‌ కేర్‌

అఖిల్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. శివాజీ, ఈశ్వరీ రావు, గెటప్‌ శ్రీను, ప్రమోద్‌, రాంకీ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. విలేజ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.  `లెనిన్‌` మూవీ జులై 10న విడుదలైంది. ఈ సినిమా విషయంలో నాగార్జున చాలా కేర్‌ తీసుకున్నారు. స్వయంగా ఆయన కూర్చొని మూవీని సెట్‌ చేశారు. ఎడిటింగ్‌ రూమ్‌లో ఏది ఎలా చేయాలో పర్‌ఫెక్ట్ గా ప్లాన్‌ చేశారు. దీంతో హిట్ సాధ్యమైందనేది టాక్‌.

34
లెనిన్‌ టోటల్‌ కలెక్షన్లు
Image Credit : Asianet News

లెనిన్‌ టోటల్‌ కలెక్షన్లు

ఇక `లెనిన్‌` మూవీ విడుదలై 22 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా ఈ సినిమా థియేటర్లో రన్‌ అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే,. ఇది వంద కోట్లు దాటినట్టు ఇటీవలే ప్రకటించారు. మరి నిజంగానే వంద కోట్లు దాటిందా? ట్రేడ్‌ సైట్లు ఎంత చెబుతున్నాయనేది చూస్తే, ఈ మూవీ ఇప్పటి వరకు సుమారు రూ.72.5కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సమాచారం. రూ.66.86 కోట్ల నెట్‌ కలెక్షన్లు వసూలు చేశాయి. అంటే సుమారు రూ.35కోట్లకుపైగానే షేర్‌ వచ్చిందని సమాచారం. 22వ రోజు ఇది కేవలం ఆరు లక్షలు మాత్రమే వసూలు చేసింది. అవి థియేటర్‌ రెంట్లకే సరిపోతాయి. దీంతో కొత్తగా వచ్చే షేర్‌ ఏం లేదు. మొత్తంగా `లెనిన్‌` మూవీ బాక్సాఫీసు వద్ద క్లోజ్‌ అయ్యిందనే చెప్పొచ్చు. మరో వారం రోజుల్లో ఇది ఓటీటీలోకి రాబోతుందని సమాచారం.

44
లెనిన్‌కి భారీ లాభాలు
Image Credit : Asianet News

లెనిన్‌కి భారీ లాభాలు

అఖిల్‌ `లెనిన్‌` మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ సుమారు రూ.22కోట్లు అని సమాచారం. షేర్‌ రూ.35కోట్లు దాటింది. అంటే రూ.13కోట్లకుపైగానే లాభాలు వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల రికవరీ అయ్యిందని టాక్‌. సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.55కోట్లు అని సమాచారం. నాన్ థియేట్రికల్ గా దీనికి బాగానే(సుమారు రూ.30కోట్లు) వచ్చిందట. ఓవరాల్‌గా `లెనిన్‌` నిర్మాతలకు ప్రాఫిట్‌ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. అదే సమయంలో అఖిల్‌ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచిన సినిమా అవుతుంది. ఆయన కెరీర్‌కిది పెద్ద బూస్ట్ ఇచ్చింది. మరో ఐదారేళ్లు తిరుగులేదని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ వంశీ సూర్యదేవర
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?
Recommended image2
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్
Recommended image3
డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Related Stories
Recommended image1
Trisha: మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? జస్ట్ లో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌
Recommended image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved